Breaking News

12న వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

 

నందిపేట, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించనున్నారు. నందిపేట యువకులు పార్టీలకు అతీతంగా వివేకానంద సేవాసమితి ఏర్పాటుచేసి తద్వారా విరాళాలు సేకరించి వివేకానంద విగ్రహం ఏర్పాటుచేశారు. 12 జనవరి వివేకానంద జయంతి రోజు కావడంతో విగ్రహావిష్కరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 2015 సెప్టెంబరు 17న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ చేత భూమిపూజ చేశారు. సుమారు మూడు లక్షల వరకు విగ్రహ ఏర్పాటు కోసం ఖర్చు చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టిటిడి బోర్డు డైరెక్టర్‌ అరికెల నర్సారెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, రాజారాం యాదవ్‌, ప్రభాకర్‌ తదితర ప్రముఖులు విచ్చేయనున్నట్టు వారు తెలిపారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *