ఘనంగా సంక్రాంతి సంబరాలు

 

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు గోదాదేవీ, రంగనాథ స్వామి వేషధారణలతో బొమ్మరిల్లు, గుడిసెలు వేశారు. పాలు పొంగించి బోడపండ్లు పోసుకున్నారు. రంగ వల్లులతో అందరిని ఆకట్టుకున్నారు. వివిధ కళాశాలలు, పాఠశాలల్లో సైతం విద్యార్థులు అందమైన రంగవల్లులు వేశారు. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత తెలియజేసేందుకు విద్యార్థుల చేత పండగ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Check Also

ప్రధాని మోడి కృషి ఫలితమే పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌

  మోర్తాడ్‌, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్రమోడి ఆధ్వర్యంలోనే పెద్దపల్లి – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *