Breaking News

ట్రంప్‌ శకం ఆరంభం!

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ట్రంప్‌ శకం ప్రారంభమైంది. ప్రపంచదేశాలను శాసిం చే అగ్రరాజ్యం 45వ అధ్యక్షుడిగా వాణిజ్య సామ్రాజ్యం నుంచి వచ్చిన ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించారు. నా ప్ర యాణం ఆరంభిస్తున్నాను. అమెరికా ప్రజలకోసం ఈ ప్ర యాణం మరింత గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆదిశగా మరింతకృషిచేస్తా. అందులో ఎలాంటి సందేహా లులేవు. అందరంకలిసి అమెరికానుమరోసారి మరోసారి గొప్పదేశంగానే కొనసాగిద్దాం అంటూ ట్రంప్‌ తన తొలి వ్యాఖ్యలుచేసి ప్రమాణస్వీకారానికి సన్నాహక కార్యాచర ణ ఆరంభించారు. ప్రపంచవ్యాప్తంగాఎంతోఆసక్తితో తిల కించనున్న డొనాల్డ్‌ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి సుమారు 9లక్షలమందివరకూ వస్తారన్నది అంచనాలుకూడా నిపు ణులు వేస్తున్నారు. తన కేబినెట్‌లోని ఇద్దరు నామినీల ను ఆమోదించినట్రంప్‌ మొత్తం వివిధశాఖలో పనిచేసే 660 మంది కార్యనిర్వాహకులస్థానంలో ఇప్పటివరకూ కీలకమైన 29 మందిని ఎంపికచేసుకున్నారు.

ఆయన మంత్రివర్గం అధికారులు కీలకశాఖల ప్రక్షాళనతోపాటు ఆర్ధిక, విదేశాంగ విధానాలు, ప్రత్యేకించి రష్యా,చైనాల పట్ల అనుసరించేవైఖరిపైనే నేడు సర్వత్రానెలకొన్న చర్చ. శ్వేతసౌధానికి వెళ్లేముందు లింకన్‌ స్మృతివనంలో జరి గిన సంగీత కచేరికి సతీసమేతంగా హాజరైనట్రంప్‌ శ్వేత సౌధంలోకి ప్రవేశించిన వెంటనే మొదటిరోజునుంచి చేప ట్టే అధికారిక కార్యక్రమాలపై ప్రపంచదేశాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల్లో పలువివాదాస్పద విమ ర్శలు, వ్యాఖ్యలుచేసి అమెరికన్లను తనవైపుకు తిప్పు కున్న ట్రంప్‌ తదనంతరం అమెరికన్లే తనకు ముఖ్యమ ని, ఉద్యోగాలకల్పన, ఉత్పత్తిరంగానికి ప్రాముఖ్యతనివ్వ డం, పెట్టుబడులను తిరిగిరప్పించడంవంటివే తనకు ముఖ్యమని పదేపదే చెపుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అధికారిక బాధ్యతలు చేపట్టేముందుచేసిన ప్రకట నలుగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యే కించి వీసా నిబంధనలను కఠినతరంచేయాలన్న ఆలోచ న ట్రంప్‌ మెదడులోనుంచి వచ్చినదే. ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా వలసపౌరసత్వ విధానం పైనే అన్నిదేశాలు కన్నేశాయి. ఇక తాజాగాట్రంప్‌ అనుస రించే విధివిధానాలు అంతర్జాతీనిపుణులకుసైతం ఊహ కందనివిధంగా ఉన్నాయి. పూర్వఅధ్యక్షుడు బరాక్‌ ఒబా మా యంత్రాంగంలో పనిచేసిన 50 మంది కీలక అధికా రులను తీసుకోవాలని చూస్తున్నారు. పాలనాయంత్రాం గంపై పూర్తిపట్టు, బీమా, గృహకొనుగోళ్లు, ఆర్ధిక విధి విధానాలు, అంతర్జాతీయ దౌత్యసంబంధాలువంటి వా టిలోపట్టు అపారఅనుభవం ఉన్న వారి సేవలను కూడా వినియోగించుకునేందుకు ట్రంప్‌నిర్ణయించినట్లు సమా చారం.

వీటిలో ముఖ్యంగా జాతీయభద్రతా విభాగం అధికార యంత్రాంగంకీలకమని నిపుణుల అంచనా. అం తర్గత రక్షణ, రక్షణరంగంవంటి వాటిని వెనువెంటనే ఆమోదించినట్లు చెపుతున్నారు. న్యూయార్క్‌నుంచి వాషిం గ్టన్‌కుబయలుదేరిన ట్రంప్‌కు అధ్యక్షస్వాగతం పూర్తయిన వెనువెంటనే శ్వేతసౌధంవైపునకు భారీఊరేగింపుతో వెళ్లా రు. శ్వేతసౌధానికివెళ్లిన తర్వాత ట్రంప్‌ప్రధాన సలహాదా రుల విభాగంలో మార్పులుచేర్పులు ఉంటాయని అంచ నా.

ట్రంప్‌ విజయం ఒకరకంగా 2006 తర్వాత అమెరికా కాంగ్రెస్‌, శ్వేతసౌధం రెండింటిపైనా రిపబ్లికన్‌ల పట్టునునిరూపిస్తోంది. 2006తర్వాత రిపబ్లికన్లు పాలన పగ్గాలుచేపట్టడం ఇదే తొలిసారి. ఒబామాచేపట్టిన హెల్త్‌ కేర్‌ చట్టాలనుకూడా సవరిస్తామని ప్రకటించిన ట్రంప్‌ శ్వేతసౌధంలోనికిప్రవేశించగానే వలసవిధానం,పన్నులు, హెల్త్‌కేర్‌ ఇతర కీలకఅంశాలపై దృష్టిపెడతారని అంచ నా. గడచిన 40 ఏళ్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకారంకంటే చిరస్మరణీ యంగా నిలిచేరీతిలో ట్రంప్‌ ప్రమాణస్వీకారం నిలిచిం దని అమెరికా నిపుణులఅంచనా. ఇప్పటివరకూ కొనసా గిన పాలనతీరుతో అలసిపోయాం. ఏంజరుగుతుందో అనవసరం ఒక మార్పు అనివార్యం. అయితే వాస్తవ మార్పులు మనం చూపించాలని లింకన్‌ స్మృతివనంవద్ద ట్రంప్‌చేసిన వ్యాఖ్యలు అమెరికన్లలో మరింత విశ్వాసం పెంపొందించాయి. మనందరం కలిసిపనిచేసేందుకు స న్నద్ధమవుతున్నాం. అమెరికాను మరోసారి గొప్పదేశంగా నిలబెడదామంటూ ఇచ్చిన ఆయన పిలుపునకు అనుగు ణంగానే లక్షలాదిమంది ప్రజలు ప్రమాణస్వీకారం తిల కించేందుకు హాజరయ్యారు. గతంలో చూడనివిధంగా అగ్రరాజ్యాన్నిఅభివృద్ధిచేస్తానని ట్రంప్‌ప్రకటించిన తీరుపై అంతర్జాతీయ నిపుణులుసైతం ఆసక్తిచూపుతున్నారు.

ట్రంప్‌ తన బాధ్యతల స్వీకారకార్యక్రమాన్ని వ్యూహా త్మకంగా ప్రకటించి నేను’నాదారిలోవెళుతున్నానని ట్వీట్‌ చేసారు.21మంది నియామకాలతోపాటుమరో536 మం ది ఉద్యోగులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అమెరి కా ఉపాధ్యక్షుడు పెన్స్‌ ప్రకటించడం ట్రంప్‌పాలన విధా నంలో వేగవంతమైన నిర్ణయాలను సూచిస్తోంది. మాజీ అధ్యక్షులు జిమ్మీకార్టర్‌, బిల్‌క్లింటన్‌, హిల్లరీ క్లింటన్‌లు సైతం హాజరైన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ట్రంప్‌ చేతబూనిన రెండుబైబిల్‌గ్రంథాలు కీలకం. ఒకటి లింకన్‌ 1861లో వినియోగించిందైతే మరోటి ఆయన కుటుం బం నుంచి వచ్చింది. బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే కొత్త అధ్యక్షుడు సాంప్రదాయబద్ధమైన జాతీయ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొని పాలనపగ్గాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రపంచ దేశాలపై అగ్రరాజ్యం పెత్త నం రూపురేఖలేవిధంగా ఉంటాయన్నది ట్రంప్‌ భవిష్యత్‌ పాలనవిధానాలేస్పష్టంచేస్తాయనడంలో అతిశయోక్తిలేదు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article