Breaking News

ఇంకెన్నేళ్లీ పేదరికం?

Poverty
Poverty

సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించి అరవైఏడు సంవత్సరాలు పూర్తిఅయ్యాయి. నేడు అరవై ఎనిమిదోవ రిపబ్లిక్‌ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణం. ఇన్నే ళ్లు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రధానంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. లక్షలాది కోట్లరూపాయల ప్రజాధనాన్ని వెచ్చిం చారు.కోట్లాది రూపాయల సబ్సిడీ అందించారు.

అర్థా కలితో అల్లాడుతున్న నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.ఇప్పటికీ ఈ కార్యక్రమాలు నిరంతరంగానే జరుగుతున్నాయి.కానీ ఆశించిన మేరకు ఫలితాలు అంద డంలేదు.ఎవరికోసమైతే ఈ పథకాలు ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారో అందులో నాలుగోవంతు కూడా నిజమైన అర్హులకు అందడం లేదు. వ్యవస్థలోని లొసుగులు, చట్టాల్లోని లోపాలను సరిదిద్దేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఆ లొసుగుల ను లోపాలను అమలులో కీలకపాత్ర వహిస్తున్న అధికా రగణ అలక్ష్యాన్ని అసమర్థతనుఅవినీతిని ఆసరాగా చేసు కొని మధ్యదళారులే అధికశాతం సొమ్మును భోంచేస్తు న్నారు.అందుకే పేదల,ధనికుల మధ్యవ్యత్యాసం తగ్గిం చే ప్రయత్నాలు సఫలీకృతం కావడంలేదు. ఈ ఆర్థిక వ్యత్యాసం భారతదేశంలో అంతకంతకుపెరిగిపోతున్నది. పేదల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాలు పురోభివృద్ధిపై అడుగులు వేస్తున్నాయి.ఆకలి,అనారోగ్యం,

అసౌకర్యాల తో ప్రజలు జీవచ్ఛవాలుగా ఉన్నదేశాలు ఇప్పుడు పురో గాభివృద్ధివైపు పయనిస్తూ ప్రజల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకువస్తున్నాయి. పేదరికం ఛాయలు క్రమేణ తగ్గిపోతున్నాయి. ఆయాదేశాల ప్రభుత్వాలు పక డ్బందీగా అమలు చేసినపథకాలు, నూతన ఆర్థిక,పారిశ్రా మిక వ్యవసాయ విధానాలు ఆ దేశాల నుంచి పేదరి కాన్ని పారద్రోలేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యి. తూర్పు ఆసియా దేశాల్లో కొన్ని అనూహ్యమైన ఆర్థి కాభివృద్ధి సాధించి ఎదుగుతున్నాయి. 1990 ప్రాంతం లో తూర్పు ఆసియా దేశాల్లోని జనాభాలో అరవై శాతం మంది నిరుపేదలు. ఇప్పుడు ఈ రెండున్నర దశాబ్దాల్లో ఆ దేశాలు అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలతో 3.5 శాతానికి తగ్గించగలిగారు. మరికొన్ని దేశాలు ఆ కోణంలో ఆలోచించి అడుగులువేస్తున్నాయి. ముఖ్యంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరగకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

అభివృద్ధి ఫలాలు, ధనికులతోపాటు పేదలకు అందాలి. అసమానతలు పెరిగిపోయేందుకు అవకాశాలు కల్పిస్తే పేదరికం అనేది మరింత చిక్కుసమస్యగా మారుతుంది. పేదరికం దానంతటా అదే తగ్గిపోతుంది అనుకుంటే అది భ్రమే అవ్ఞతుంది. ఆఫ్రికా దేశాల్లో ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తూనే పేదరికాన్ని పారద్రోలగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని 2030 నాటికి మూడు శాతం కంటే దిగువకు తగ్గించాలని ప్రపంచబ్యాంకు లక్ష్యంగా నిర్దేశించింది. అదే సమయానికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిస్తు న్నది. భారతదేశంలో ఎన్ని పథకాలు రూపొందించినా, మరెన్ని నిధులు విడుదల చేసినా, పేదరికంపై పోరాటం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనేది అందరికి తెలి సిందే.ఇప్పుడైనా ఆలోచించాల్సిన సమయమిది.

కారణా లు ఏమిటి?కారకులు ఎవరు? ఎక్కడుంది లోపం? తది తర అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరం. పేదల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయలు వారికి పూర్తి గా ఎందుకు అందడం లేదు? తదితర కోణాలు అధ్యయ నం చేయాలి.లోపాలను సరిదిద్దాలి.స్వతంత్ర భారతచరి త్రలోనే అతిపెద్ద పని హక్కు కార్యక్రమంగా పేరొందిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేటికీి ఎందుకు లొసుగులతో కొట్టుకమిట్లాడుతున్నది? ఎంతోపవిత్రఆశయంతో పనిలేని,పనిదొరకక పస్తులుండే రెక్కాడితే డొక్కాడని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎలా దళారుల పాలవ్ఞతున్నదో ఒక్కసారి పరిశీ లిస్తే ఆవేదన కలుగుతుంది.

వాస్తవంగా ఎన్నో కోణాలు పరిశీలించి మరెంతో అధ్యయనం చేసి 2006 ఫిబ్రవరి రెండున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లాలో ఈ పథకం ప్రారంభించారు. ఆ తర్వాత దేశం లో అత్యంత వెనుకబడిన రెండువందల జిల్లాల్లో వర్తిం పచేశారు.ఇప్పుడు మరింతవిస్తరించి ఆరువందల యాభై ఎనిమిది జిల్లాలోపైగా అమలు అవ్ఞతున్న ప్రపంచంలో ని అతిపెద్ద పనిహక్కు కార్యక్రమం. ఇందులో గ్రామీణ కుటుంబాల్లో నైపుణ్యం లేనివారికి, పనిచేయడానికి సంసిద్ధులైనవారికి సంవత్సరానికి వందరోజులు అయి నా పని కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఆ తర్వా త దానిని నూటయాభై రోజులకు పెంచారు. కానీ లోప భూయిష్టంగా మారడంతో అనేక ప్రాంతాల్లో కూలీలకు బదులు యంత్రాలతో పనిచేయిస్తున్నారు. అందుకే ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నది. ఇదే కాదు అనేక పథకాలు నిజమైన అర్హులకంటే మధ్య దళారులకు లాభం చేకూరుస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆలోచించాల్సిన తరుణం ఏర్ప డింది. పథకాలు ప్రవేశపెట్టడంలో కాదు అవి అమలుకు త్రికరణశుద్ధితో కృషి చేయాలి. ఇలాగే కొనసాగితే ఇంకో యాభై ఏళ్లయినా దేశం నుంచి పేదరికం పారద్రోలడం అనేది భ్రమే అవుతుంది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article