Breaking News

Daily Archives: February 1, 2017

వైభవంగా వసంత పంచమి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పాఠశాలల్లో సైతం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. పట్టణంలోని అక్షర పాఠశాలలో ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు, ఎంఇవో ఎల్లయ్యలు పాల్గొన్నారు.

Read More »

మురికి కూపంలో పాఠశాల పరిసరాలు

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాల పరిసరాలు మురికి కూపంలో ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ముస్తాయిద్‌పూరాలో ఉన్న ప్రభుత్వ స్కూల్‌ కాంప్లెక్సులో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉన్నాయి. సుమారు 300 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. స్కూలు ముందు భాగంలో ప్రహరీ గోడ ఉన్నప్పటికి వెనకవైపు లేకపోవడంతో అక్కడినుంచి పందులు పదుల సంఖ్యలో స్వైర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలకు దగ్గర్లో పశు ...

Read More »

నందిపేట సేవాసమితి ఆధ్వర్యంలోస్వచ్చ నందిపేట్‌

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట సేవాసమితి ఆద్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌లో స్వచ్చనందిపేట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండ్‌ ప్రయాణ ప్రాంగణాన్ని నీటితో కడిగి పరిసరాల్లోని చెత్త, చెదారం ఎత్తిపోశారు.పిచ్చిమొక్కలు తొలగించారు. దుర్గంధంగా మారిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయించారు. కుల, మతాలకు అతీతంగా ఐక్యతే మార్గం, సేవే లక్ష్యంగా గ్రామంలోని పలు రంగాల ప్రజలు, విద్యావంతులు ఇటీవలే ఏకమై నందిపేట సేవాసమితి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ ...

Read More »

నసురుల్లాబాద్‌ పోలీసుస్టేషన్‌ తనిఖీ

  బీర్కూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని పోలీసు స్టేసన్‌ను బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత తనిఖీ చేపట్టారు. ముందుగా పోలీసు స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, అనంతరం నూతన పోలీసు స్టేసన్‌ నిర్మానానికి స్థల ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి, శాంతిబద్రతలను అదుపులో ఉంచుతున్నట్టు, గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజలతో పోలీసులు మమేకమై ఉండాలని అన్నారు. ఆమె వెంట సిఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ గోపి, సర్పంచ్‌ సాయిలు, తదితరులున్నారు.

Read More »

ఘనంగా గంగమ్మ జాతర

  బీర్కూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో గంగపుత్రుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. గ్రామంలో గంగపుత్రుల మహిళలు బోనాలు నిర్వహించి, భాజాభజంత్రీలతో, ఆటపాటలతో బోనాలను స్థానిక చెరువువద్దగల గంగమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాఅన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి సంవత్సరం లాగే ఈయేడు కూడా అధికంగా వర్షాలు కురిసి చెరువులు నిండి, ప్రజలందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ పూజలు చేపట్టారు.

Read More »

ఇసుక ట్రాక్టర్‌బోల్తా , యువకుని మృతి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌ మంజీర నది పరివాహక ప్రాంతంలో నియోజకవర్గ అభివృద్ది పనుల దృష్ట్యా ఇసుక తరలింపులో బుధవారం అపశృతి చోటుచేసుకుంది. కిష్టాపూర్‌ గ్రామంలో ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడినట్టు డ్రైవర్‌కు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బీర్కూర్‌ గ్రామ పోలీసు స్టేషన్‌ వద్ద అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడడంతో కల్హేరు మండలం మాసాయిపల్లికి చెందిన గూండ్ల సాయిలు (26) వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ తెలిపారు. ...

Read More »

క్యాంపు కార్యాలయానికి భూమిపూజ

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలో బుధవారం అధికారుల నివాస, క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భూమిపూజ చేశారు. శాసనసభ్యుల నివాస, క్యాంపు కార్యాలయానికి సతీసమేతంగా భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రూ. కోటితో నిర్మించే నూతన కార్యాలయాల్లో శాసనసభ్యులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. శాసనసభ్యులు స్థానికంగా ఉంటూ ప్రజలకు మరింత సేవ చేయడం కోసం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ...

Read More »

రైలుకింద పడి వ్యక్తి మృతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి – ఉప్పల్‌వాయి రైల్వేస్టేసన్‌ల మధ్య బుధవారం గుర్తుతెలియని యువకుడు రైలుకింద పడి మృతి చెందినట్టు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ పాండు తెలిపారు. మృతుని చొక్కాపై జుక్కల్‌ రాజ్‌ టేలర్స్‌ స్టిక్కర్‌ ఉందన్నారు.గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Read More »

ఘనంగా వసంత పంచమి వేడుకలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదిన వేడుకలు పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాల్లో, ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలుచేసి విద్యార్థులకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడి కేంద్రాల్లో ఆయా గ్రామల్లో చిన్నారులతో తల్లిదండ్రులు వసంత పంచమి పురస్కరించుకొని అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బీర్కూర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో విద్యార్థులతో సరస్వతి పూజ చేయించారు.

Read More »

పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలి

  – ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా ఇన్‌చార్జి సింహాచలం కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంఆర్‌పిఎస్‌ ఏ,బి,సి,డి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేయాలని ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా ఇన్‌చార్జి సింహాచలం మాదిగ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ బిల్లు పెట్టే దిశగా ...

Read More »

తెలంగాణను సీడ్‌ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణను సీడ్‌ హబ్‌గా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లి క్షేత్రంలో బుధవారం విత్తనశుద్ది కర్మాగారం, గిడ్డంగుల సముదాయానికి ఆయన శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాన్ని ఈ క్షేత్రంలో ఉత్పత్తి చేసి ఇక్కడే ప్రాసెసింగ్‌ చేస్తామన్నారు. మొత్తం 4 కోట్లతో విత్తన శుద్ది ...

Read More »

విఓఎల దీక్షలకు షబ్బీర్‌ అలీ మద్దతు

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం విఓఎలు చేస్తున్న దీక్షలకు శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ తమ మద్దతు ప్రకటించారు. బుధవారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విఓఎలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్‌ మాట్లాడుతూ విఓఎలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఓ విఓఎల కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం ...

Read More »

గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పండ్ల రాజును బుధవారం శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ సన్మానించారు. పండ్ల రాజు గతంలో సదాశివనగర్‌ మండలం ఎంపిపిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడుగా ఉన్నారు. ఈ క్రమంలో గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నేపథ్యంలో షబ్బీర్‌అలీని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన రాజును శాలువాతో సత్కరించారు. అనంతరం రాజు మాట్లాడుతూ గంగపుత్రుల అభ్యున్నతికి తనవంతు కృసి ...

Read More »

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  గాంధారి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని దానికొరకే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గాందారి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గీతా శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో స్థానికజడ్పిటిసి తానాజీరావుతో కలిసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో ...

Read More »

సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని హౌజింగ్‌ బోర్డు కాలనీలోగల శ్రీశారదమాత ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హారతి, వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం చిన్నారుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More »

పడకేసిన పారిశుద్యం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పారిశుద్యం అస్తవ్యస్తంగా మారింది. మురికి కాలువలు నిండిపోవడం, రహదారులపైనే చెత్త, చెదారం పేరుకుపోయినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడం వల్ల గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. పంచాయతీలకు నెలరోజుల క్రితమే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. నిధులు విడుదలైనప్పటికి పంచాయతీల్లో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలుండగా, 7 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులున్నారు. ...

Read More »

వైభవంగా వసంత పంచమి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పాఠశాలల్లో సైతం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. పట్టణంలోని అక్షర పాఠశాలలో ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు, ఎంఇవో ఎల్లయ్యలు పాల్గొన్నారు.

Read More »