Breaking News

Daily Archives: February 6, 2017

ఉపాధ్యాయురాలిపై దాడిపై ఫిర్యాదు

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయురాలిపై సహ ఉపాధ్యాయురాలి బంధువులు దాడికి దిగడంపై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు ఫిర్యాదుదారుడు రవిచందర్‌ తెలిపారు. రవిచందర్‌ భార్య పద్మరాణి లింగాపూర్‌ పాఠశాలలో ప్రధానోపాద్యాయురాలిగా పనిచేస్తుంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న సహ ఉపాధ్యాయురాలు ఉమారాణి అన్న లక్ష్మారెడ్డి, వారిబంధువులతో కలిసి శుక్రవారం పాఠశాలకు వెళ్లి తనబార్య పద్మరాణిని దుర్బాషలాడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె మానసిక వేదనకు గురై పాఠశాలకు వెల్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉమారాణి సర్వీసు వివరాలను కోరుతూ ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 12 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పోలీసు అధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి 12 ఫిర్యాదులు అందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్వేత ఫిర్యాదు దారుల నుంచి సమస్యలు స్వీకరించారన్నారు. పట్టణానికి సంబంధించి 3, రామారెడ్డి 1, తాడ్వాయి 1, భిక్కనూరు 2, గాందారి 2, లింగంపేట 1, బాన్సువాడ 1, బీర్కూర్‌ 1 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. సమస్యల పరిస్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఫిర్యాదులు ...

Read More »

రైతులకు వందశాతం పంట రుణాలు అందించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు వ్యవసాయానికిఅత్యధిక ప్రాధాన్యాన్ని రబీ పంట కాలానికి సంబంధించి మార్చిలోగా రైతులకు 100 శాతం పంట రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్తాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు సకాలంలో అందేలా బ్యాంకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. బ్యాంకు రుణాల పంపిణీ, స్వయం ...

Read More »

బహుజన సంఘాల ఆందోళన

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరణం గచ్చామి సినిమాను సెన్సార్‌బోర్డు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం బహుజనుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఐక్యవేదిక ప్రతినిధులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెన్సార్‌ బోర్డు ఆశ్లీల సినిమాలకు ఎలాంటి అడ్డుకట్ట వేయకుండా బహుజనుల నేపథ్యంతో తీస్తున్న శరణం గచ్చామి సినిమానుఅడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సినిమాకు సెన్సార్‌బోర్డు క్లీన్‌ చీట్‌ఇవ్వాలని, అడ్డుకోవడాన్ని మాని వెంటనే అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు.లేనిపక్షంలో బహుజనుల ఐక్యవేదిక ...

Read More »

వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవానికి శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీతోపాటు గౌడ సంఘం ప్రతినిదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గౌడ సంఘం మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిదులు నాయకులు పాల్గొన్నారు.

Read More »

బిటి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 22వ వార్డులో సోమవారం బిటి రోడ్డు పనులను మునిసిపల్‌ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ మునిసిపల్‌ సాధారణ నిదులు 22 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. రోడ్డు సమస్యను వార్డు కౌన్సిలర్‌ తనదృష్టికి తెచ్చారని, వెంటనే సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసి రోడ్డు వేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌, ప్రతినిదులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో 360 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 360 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని సంబంధిత శాఖాధికారులకు పంపామని, ఎప్పటికప్పుడు పంపుతున్నామని, వెంటనే ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసిసత్తయ్య, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మట్టినమూనా పరీక్షతో బహుళ ప్రయోజనాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బూసార పరీక్షల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ విస్తీర్ణాధికారి రవిందర్‌ అన్నారు. మంగుళూరు గ్రామంలో వ్యవసాయ శాఖ సంచార వాహనం ఆధ్వర్యంలో మట్టి నమూనా పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంటల సాగు సమయంలో రైతులు వ్యవసాయ భూములకు మట్టి పరీక్షలు తప్పకుండా చేయించాలన్నారు. మట్టి నమూనా పరీక్ష ద్వారా పంటల సాగు విధానం మార్పు చేయాలని ఆయన అన్నారు. రెండో దఫాలో ఏరకమైన ...

Read More »

రుణాలు సక్రమంగా చెల్లిస్తేనే సంఘాలు బలోపేతం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని నిరుపేద నిర్మూలన సంస్థ సంఘాలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తేనే ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశముంటుందని ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. ఐకెపి కార్యాలయంలో సంఘాల రుణాలు ఇచ్చేందుకు దృవపత్రాలు పరిశీలించారు. నిజాంసాగర్‌ స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ సౌరబ్‌కుమార్‌ ఉన్నారు. మొత్తం 8 సంఘాలకు చెందిన 92 మంది సభ్యులు పాల్గొన్నారు. వారందరికి రుణాలు అందించాలన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి ఆర్థికంగా ప్రతి సభ్యురాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ...

Read More »

సాదాబైనామాల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి

  గాంధారి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సాదాబైనామాలు, షాదీముబారక్‌,కళ్యాణలక్ష్మి దరఖాస్తులనుక్షుణ్ణంగా పరిశీలించాలని తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ సూచించారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాదాబైనామాల దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేసి సరియైన దరఖాస్తులకు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకునేవిధంగా ఇరువర్గాలను ఒప్పించాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల అవకతవకలకు పాల్పడకుండా క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. మండలంలోని ప్రబుత్వ భూములను గుర్తించాలన్నారు. గతంలో ప్రబుత్వం ఎవరికైతే పట్టాబూములు ఇచ్చిందో ఆ భూముల్లో ఎంతమంది కబ్జాలో ఉన్నారో, ఎంతమంది ...

Read More »

జేఏసి నాయకుల అరెస్టు

  గాంధారి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సోమవారం ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగాజేఏసి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో గాంధారి మండలానికి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి పర్యటించినసందర్భంగా గాంధారి జేఏసి నాయకులు అడ్డుకొని తీరుతామని హెచ్చరించడంతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సోమవారం మండలానికి వస్తున్న ఎమ్మెల్యేను జేఏసి నాయకులు అడ్డుకుంటారని ముందస్తు సమాచారం పోలీసులకు తెలియడంతో డివిజన్‌లోని 4 పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు ...

Read More »

ఆలయ అభివృద్దికి సహకరిస్తా…

  గాంధారి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని గుడిమేట్‌ వద్దగల మహదేవుని గుట్టను అభివృద్ది చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహాదేవుని గుట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేకపూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుట్టపై మహదేవుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాదేవునిగుట్టపై సిసి రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఇంకా మిగిలిన చోట్ల పూర్తిస్తాయిలో సిసి రోడ్లు నిర్మిస్తామన్నారు. గుట్టకు ...

Read More »

ప్రయోగ పరీక్ష కేంద్రాల పరిశీలన

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసరస్వతి జూనియర్‌ కళాశాల, భీమ్‌గల్‌లో ప్రయోగ పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఇంటర్మీడియట్‌ విద్య జిల్లా శాఖాధికారి దాసరి ఒడ్డెన్న పరిశీలించారు. ప్రయోగశాలల్లో పరికరాలు, విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పకడ్బందీగా ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, డిఓ యగ్నేశ్‌, ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ ఉన్నారు.

Read More »

మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు లయన్స్‌ క్లబ్‌ సబ్యులు తెలిపారు. కంటి సంబంధిత వ్యాదులుగలవారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామన్నారు. మోతిబిందు గలవారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ ఆసుపత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

ప్రతి గుంటకు నీరందించడమే ప్రభుత్వ ద్యేయం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో గల రైతులు ప్రతి గుంటకు నారువేయాలని తహసీల్దార్‌ డేవిడ్‌ అన్నారు. మండలంలోని నిజాంసాగర్‌ కెనాల్‌ మండలంలో ప్రవహించే కెనాల్‌ను సోమవారం ఆయన స్థానిక విఆర్‌ఏతో కలిసి సందర్శించారు. నాటు వేసుకున్న ప్రతి ఒక్కరికి చెరువుల ద్వారా నీరందించాలని సూచించారు. నిజాంసాగర్‌ కెనాల్‌ నుండి మూడోదఫా నీరు వస్తుందని, చెరువులు నింపుకోవడానికి ఆయా గ్రామాల రైతులు సన్నద్దం కావాలని సూచించారు. ఆయన వెంట తదితర అధికారులున్నారు.

Read More »

28 గ్రామాలకు ఏడుగురే కార్యదర్శులు

  నందిపేట, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా వేదిస్తుంది. మొత్తం 28 గ్రామపంచాయతీలకుగాను కేవలం ఏడుగురు కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 21 గ్రామ పంచాయతీలకు పర్మనెంట్‌ కార్యదర్శులు లేకపోవడంతో గ్రామాభివృద్దికుంటుపడుతుంది. ఒక్కో కార్యదర్శి మూడు, నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జిలుగా పనిచేస్తుండడంతో వారు ఏగ్రామానికి సరిగా సేవలు అందించలేకపోతున్నారు. గ్రామాల్లో పారిశుద్య సమస్య విలయతాండవం చేస్తుంది. పర్మనెంట్‌ కార్యదర్శులు లేకపోవడంతో కారోబార్లే దిక్కయ్యారు. కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో తాగునీరు, విద్యుత్‌, పారిశుద్యం ...

Read More »

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం అవుతుందని ఆయామండలాల తహసీల్దార్లు కృష్ణానాయక్‌, డేవిడ్‌లు తెలిపారు. ఆయా మండల కేంద్రాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండల వాసుల సమస్యల పరిష్కారం కొరకు గతంలో జిల్లా కేంద్రంలో నిర్వహించేవారని, సమస్యలపరిష్కారం కొరకు ప్రస్తుతం మండల స్తాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం ప్రజావాణిలో ఎటువంటి ఫిర్యాదులు రాలేదని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.

Read More »

గ్రంథాలయ భవనం నిర్మించండి

  నందిపేట, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం రెండుఫిర్యాదులు అందినట్టు తహసీల్దార్‌ ఉమాకాంత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో పాఠకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున సొంత భవనం నిర్మించాలని కోరుతూ నందిపేట సేవా సమితి సభ్యులు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబందించి వ్యక్తిగత ఫిర్యాదు అందినట్టు ఆయనతెలిపారు. ప్రజావాణిలో ఎండివో నాగవర్దన్‌, ఎంఇవో లింగయ్య, ఇవో పిఆర్‌డి రాజేశ్వర్‌గౌడ్‌, తదితరులున్నారు.

Read More »