Breaking News

Daily Archives: February 7, 2017

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

  – జిల్లా కలెక్టర్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబరులో జరిగిన జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు బిచ్కుంద, బీర్కూర్‌ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్సు బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వే బ్రిడ్జిలను గుర్తించి వారి ద్వారా ఇసుక ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మాచారెడ్డి మండలం ఎల్పుగొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలు వస్తువులు అందజేశారు. పల్లాలు, గ్లాసులు, కుర్చీలు, టేబుల్‌, నీటి క్యాన్‌లను విరాళంగా అందజేశారు. దాతగా ఎజి బాపురావు ఆర్తిక సాయం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి లక్ష్మినర్సింలు, ప్రతినిధులు శ్రీశైలం, గంగారెడ్డి, బాలకిషన్‌, సుధాకర్‌, శోభన్‌గౌడ్‌, నారాగౌడ్‌, ప్రధానోపాద్యాయుడు అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

షబ్బీర్‌అలీ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ చిత్రపటానికి మంగళవారం కాంగ్రెస్‌నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు సాగునీటి కోసం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు మంజూరుచేయించగా తెరాస అధికారంలోకి రాగానే దాన్ని రద్దుచేసిందన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ దీనికి వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి భూంపల్లి నుంచి 11 కి.మీ.ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి విన్నవించి ప్యాకెజి 22 సాధించారన్నారు. ...

Read More »

దళితుల హామీలు నెరవేర్చి ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఎన్నికలకు ముందు దళితుల కోసం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి తన చిత్తశుద్దినిచాటుకోవాలని ఆర్‌ఎస్‌పి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తనర్సింలు డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, కెజి నుంచి పిజి ఉచిత విద్య అమలు చేస్తామని విస్మరించిందన్నారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న దళితున్ని తొలగించి ముఖ్యమంత్రి తన దొరతనం ...

Read More »

శ్మశాన వాటిక అభివృద్దికి నిదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం రూ. 35 లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్దగల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశానవాటిక చుట్టు ప్రహరీనిర్మించాలని, ఇందుకోసం 35 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ...

Read More »

వైభవంగా బోనాల పండగ

  కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం గౌడ సంఘం ఆద్వర్యంలో బోనాల పండగను వైభవంగా నిర్వహించారు. ప్రతియేటా కామారెడ్డి శివారులోని రేణుకమాత ఆలయంలో అమ్మవారి కళ్యాణం, బోనాల పండగ గౌడ సంఘం ఆధ్వర్యంలోఘనంగా నిర్వహిస్తారు. ఈయేడు సైతం గౌడ సంఘం మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్బంగా ఆలయంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Read More »

నీటి విడుదల పెంపు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డిఇ దత్తాత్రి తెలిపారు. 1800 క్యూసెక్కుల నీటి సామర్త్యం పెంచడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్లకు అనుసంధానంగా ఉన్న హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం గేట్ల ద్వారా టర్బయిన్‌లోకి నీటి విడుదల కొనసాగడంతో 6.45 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతుందని జెన్‌కో ఎడిఇ శ్రీకాంత్‌ తెలిపారు. 1వ, 2వ టర్బయిన్‌లద్వారా విద్యుత్‌ ఉత్పాదన జరుగుతూ ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణాల పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మల్లూరు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఎంపిడివో రాములు నాయక్‌, ఎంపిటిసి కంసవ్వ, సర్పంచ్‌లు లలిత, రాంసింగ్‌ మంగళవారం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు నిర్మించుకునేందుకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లనిర్మాణం కోసం రూ. 12 వేలు మంజూరు చేస్తుందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు లబ్దిదారుల వద్ద నుంచి రూ. 900 కంట్రిబ్యూసన్‌ చెల్లించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ...

Read More »

ప్రతి ఒక్కరు పన్నులు చెల్లించాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు ఇంటి, కుళాయి పన్నులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప సూచించారు. నర్సింగ్‌రావుపల్లి, మంగుళూరు గ్రామాల్లో మంగళవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిస్కరించాలంటే పంచాయతీలకు ఆదాయాన్నిచ్చే పన్నులు చెల్లించాలన్నారు. ప్రతి గ్రామంలో వందశాతం పన్నులు వసూలైతే గ్రామాల్లో సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. ఈ రెండు గ్రామాల్లో మొత్తం రూ. 6675 వసూలు చేసిసట్టు ఆయన తెలిపారు.

Read More »

పన్నుల వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్‌

  గాంధారి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని 19 గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటిపన్నుల వసూలుకు బుధవారం నుంచి స్పెసల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు ఇవోపిఆర్‌డి ఆనంద్‌ తెలిపారు. బుధవారం నుంచి గ్రామ పంచాయతీల వారిగా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేస్తారన్నారు. అధికారులకు సహకరించి ఇంటి యజమానులు పన్నులు చెల్లించాలన్నారు. వంద శాతం ఇంటిపన్ను వసూలే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు ఆనంద్‌ తెలిపారు.

Read More »

జాతీయ స్థాయి పేస్ట్‌బాల్‌ పోటీల్లో గాంధారి యువకునికి బంగారు పతకం

  గాంధారి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్తాయి ఫేస్ట్‌బాల్‌ పోటీల్లో గాంధారి యువకుడు బంగారు పతకం సాధించాడు. గాంధారికి చెందిన సుజిత్‌గౌడ్‌ ఇటీవల హర్యానాలోని గన్నూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పేస్ట్‌బాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్‌ సాధించిన సుజిత్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని సిక్సా కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ స్తాయి పేస్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక కాగా గత నెల 27 నుంచి 29వ తేదీ వరకు హర్యానాలో జరిగిన పోటీల్లో ...

Read More »

బాసర ఆలయంలో హుండీ లెక్కింపు

  బాసర, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆలయ హుండీ లెక్కించారు. 40 రోజుల హుండీ ఆదాయం 41 లక్షల 64 వేల 990 రూపాయలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 60 గ్రాముల 710 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 300 గ్రాములు, విదేశీ కరెన్సీ48 డాలర్లు, చెల్లని పాత 1000 రూపాయల నోట్లు 15, పాత 500 నోట్లు 84 వచ్చినట్టు పేర్కొన్నారు.

Read More »

చేయని తప్పుకు.. దుబాయ్ లో జైలు

గల్ఫ్ ఎజెంట్స్ , డ్రగ్స్ మాఫియా ఆగడాలకు ఓ అమాయకుడి జీవితం దుబాయ్ లో జైలుపాలైంది. చేయని తప్పుకు ఏడేళ్లు జైలు శిక్షపడింది.  నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్ ఉపాధికోసం దుబాయ్ వెళ్లాడు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన శ్రీనివాస్ 2016లో తిరిగి ఇంటికి వచ్చాడు. నితిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగు నెలల తర్వాత  దుబాయ్ వెళ్లాడు. రిటర్న్ లో వెళ్లేప్పుడే చిక్కుల్లో పడ్డాడు. శ్రీనివాస్ దుబాయ్ కు వెళ్లేప్పుడు ట్రావెల్ ఏజెంట్ మహష్ చిన్న ...

Read More »