Breaking News

Daily Archives: February 8, 2017

నులిపురుగు నివారణపై వీడియో కాన్ఫరెన్స్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న నులిపురుగు నివారణ దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ కరుణ బుధవారం జిల్లా వైద్య శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు.అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో నట్టల నివారణ బిల్లలను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రవిందర్‌గౌడ్‌, వైద్యాధికారి రాజు, పర్యవేక్షకులు హబీబుద్దీన్‌, ...

Read More »

10న నులిపురుగు నివారణ బిళ్లల పంపిణీ

  బీర్కూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగు నివారణ బిళ్లలు పంపిణీ చేయాలని ఎండివో రాజ్‌భరత్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని వైద్య సిబ్బంది, తదితర అధికారులతో సమావేశమయ్యారు. ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లకు నులిపురుగు నివారణ మందుల పంపిణీపై అవగాహన కల్పించాలని సూచించారు. స్తానిక వైద్య కేంద్రంలో ఇందుకు సంబంధించిన బిళ్లలు అందుబాటులో ఉంచాలని, ప్రతి విద్యార్థికి తప్పకుండా మాత్రలు అందేలా చూడాలని కోరారు.

Read More »

శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ, హౌజింగ్‌ బోర్డు సమీపంలోగల శ్మశాన వాటికల ప్రహరీ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారం శ్మశానవాటిక పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వెంటనే వాటికి ప్రహరీగోడలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ. 35 లక్షల నిధులు సైతం కేటాయించారు. ఈక్రమంలో ప్రహరీ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, శ్మశానవాటికలను అభివృద్ది పరచాలని, ...

Read More »

కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిట్టు జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ కౌన్సిలర్‌, తెరాస నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.మునిసిపల్‌ కాంటాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు నిట్టు కృష్ణామోహన్‌రావు, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, లక్ష్మినారాయణ, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సాజిద్‌లు కేక్‌కట్‌ చేసి నిట్టుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అద్యక్షుడు అయాజ్‌ బేగ్‌, ...

Read More »

జర్నలిస్టులను అణిచివేస్తే ఉద్యమం తప్పదు

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం జర్నలిస్టులను అణిచివేయాలని చూస్తే ఉద్యమం తప్పదని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజేఎఫ్‌)రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యుజేఎఫ్‌ జిల్లా ప్రథమ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చిన్న, పెద్ద పత్రికలు అన్న భావం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని, మూడు పడక గదుల ఇళ్లు నిర్మించి ...

Read More »

ప్రమాదకరంగా సాగర్‌ వంతెనలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ఓవైపు ప్రధాన కాలువ కట్ట బలోపేతం కోసం సిమెంటు లైనింగ్‌ పనులు గతంలో కొనసాగించారు. కాగా మరోవైపు కాలువ కట్టపై ఉన్న వంతెనలు ప్రమాదకరంగా మారినా నీటిపారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన కాలువ వంతెనపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.   ఇరుపక్కలా ఉన్న వంతెనల సైడ్‌వాల్‌లు కూలుతున్న ర్యాక్‌తో ప్రమాదాలు ...

Read More »

శిలాఫలకాలకే పరిమితమైన రోడ్లు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం నిధులుండి పనులు చేయాలిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.   ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి. నిజాంసాగర్‌ మండలంలోని మంగుళూరు గ్రామంలో రూ. 1.49 లక్షలు మంజూరు చేయగా రోడ్డుకు కంకరవేసి వదిలేశారు. గతేడాది ఆగష్టు 20న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మంగుళూరు రహదారి ఫార్మెషన్‌ రోడ్డుకే పరిమితమైంది. పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు నత్తనడకన ...

Read More »

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి జిల్లా భారతీయ జనతాపార్టీ దళితమోర్చా జిల్లా అద్యక్షుడు రాజన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల్లో మండలంలోని బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు బిజెపి అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోడి ...

Read More »

స్పెషల్‌ డ్రైవ్‌లో రూ. 29 వేలు వసూలు

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో బుధవారం నిర్వహించిన స్పెసల్‌ డ్రైవ్‌లో రూ. 29 వేలు ఇంటిపన్నుల రూపంలో వసూలైనట్టు ఇవో పిఆర్‌డి ఆనంద్‌ తెలిపారు. వంద శాతం ఇంటిపన్ను వసూలే లక్ష్యంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో మొదటిరోజు బుధవారం పేతు సంగం గ్రామ పంచాయతీలో 13 వేలు వసూలు కాగా మిగతా చోట్ల 16 వేలు కలుపుకొని మొత్తం 29 వేలు వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సిబ్బంది ఇంటింటికి ...

Read More »

10న నులిపురుగు నివారణ దినోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు గాంధారి ఎంఇవో సేవ్లానాయక్‌, ముత్తునూరు వైద్యాధికారి షాహెద్‌అలీ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఎండివో కార్యాలయాల్లో ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో వేరువేరుగా నులిపురుగు నివారణ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగు నివారణ కొరకు ఆల్బెండజోమ్‌ మాత్రలను అందించాలన్నారు. ...

Read More »

గాంధారిలో దివ్యాంగులకు ఫిజియో థెరఫి చికిత్స

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆద్వర్యంలో దివ్యాంగులకు ఫిజియోథెరఫి వైద్యాన్ని డాక్టర్‌ రవిందర్‌ అందజేశారు. ఈ సందర్భంగా 11 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఫిజియో థెరఫి వైద్యంతోపాటు వ్యాయామంలో చేయవలసిన మెళకువలను వివరించారు. ఫిజియోథెరఫి నిర్వహించడం ద్వారా దివ్యాంగులు సకలాంగులుగా మారి తమ తమ పనులను తామే చేసుకుంటారన్నారు. దివ్యాంగులకు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఇంటి వద్ద వ్యాయామం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

బీర్కూర్‌ విఆర్వో దారుణ హత్య

  బీర్కూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో బుధవారం ఉదయం బీర్కూర్‌ విఆర్వో-2 అద్దె రాములు (45) దారుణంగా హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ డిఎస్పీ నర్సింహరావు కథనం ప్రకారం… బాల్కొండ మండలం సుబ్బిర్యాల్‌ గ్రామానికి చెందిన అద్దె రాములు గత ఏడాదిన్నర కాలంగా బీర్కూర్‌ మండల విఆర్వో-2గా పనిచేస్తున్నారన్నారు. అదే క్రమంలో బుధవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు విఆర్వో రాములు ఒంటిపైన బట్టలు లేకుండా, తలపై, ఒంటిపై పదునైన ఆయుధంతో చేసిన గాట్లతో ...

Read More »

వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయం

0.25 శాతం తగ్గుతుందని నిపుణుల అంచనా నేడే ఎంపిసి నిర్ణయం    ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపునకు గ్రహగతులు పూర్తి అనుకూలంగా ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మంగళవారం నుంచి రెండు రోజుల పాటు సమావేశం అవుతోంది. ఈ సారి 0.25 శాతం మేర రెపో రేటు తగ్గించడం ఖాయమని విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు. అన్ని రకాల సంకేతాలు రేట్ల తగ్గింపునే సూచిస్తున్నాయని వారంటున్నారు. అయితే మరికొందరు ...

Read More »

ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారిగా హిల్లరీ స్పందన

వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వీడియో సందేశం ద్వారా హిల్లరీ క్లింటన్ స్పందించారు. ‘2017 మేకర్స్’ పేరుతో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను త్వరలోనే అధిగమించనున్నారని క్లింటన్ అభిప్రాయపడ్డారు. గత నెలలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘ఉమెన్ మార్చ్’ కార్యక్రమం విజయవంతం కావడమే దీనికి ప్రత్యేక్ష ఉదాహరణని ఆమె పేర్కొన్నారు. ఇదివరకెప్పుడు లేనివిధంగా మహిళలు అన్నీ రంగాల్లో బలపడాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆమె సూచించారు. ఎలక్ట్రోరల్ కాలేజీలో తనకు ...

Read More »

‘ట్రంప్‌ ఆంక్షల లక్ష్యం ఎటువైపు?

అగ్రరాజ్యం కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్‌ట్రంప్‌ ప్ర వేశపెట్టిన విధానాలు మొత్తం ప్రపంచ దేశా లకు కలవరం పుట్టిస్తున్నాయి. హెచ్‌వన్‌బి వీసాలపై ఆంక్షలు ప్రవేశపెట్టి, ఏడు ముస్లిందేశాలనుంచి వచ్చే శరణార్ధులపై 190 రోజుల నిషేధం ప్రకటించిన వెంటనే అమెరికా వీసా అధికార యంత్రాంగం సుమారు లక్షకుపైగా వీసాలను రద్దుచేసింది. ఏడు ముస్లిం దేశా లపైనే ప్రధానంగా లక్ష్యంపెట్టుకుని డొనాల్డ్‌ట్రంప్‌ పాలనా యంత్రాంగం ఈ నిషేధాజ్ఞలు జారీచేసింది.ఒక్క 2015లోనే 11 మిలియన్లకుపైగా వలస, వలసేతర వీసాలను జారీచేసిన అమెరికా ఈసారి ఏడు ముస్లిం దేశాలతోపాటు ఇతర దేశాల ...

Read More »

కోదండరాం ‘ఫేస్‌బుక్‌ లైవ్‌’కు భారీ స్పందన

 24 గంటల్లోనే 1.24 లక్షలకుపైగా వ్యూస్‌   నిరుద్యోగుల ర్యాలీకి మద్దతిస్తామన్న నెటిజన్లు  ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 22న టీజేఏసీ తలపెట్టిన ‘నిరుద్యోగుల నిరసన ర్యాలీ’కి తరలిరావాలని ప్రొఫెసర్‌ కోదండరాం ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ర్యాలీని విజయవంతం చేసేందుకు బోనాల జాతరలా తరలిరావాలంటూ కోదండరాం సోమవారం ‘ఫేస్‌బుక్‌ లైవ్‌’లో మాట్లాడిన వీడియోను నెటిజన్లు భారీగా చూశారు. తొలిసారి లైవ్‌లోకి వచ్చి ఆయన వీడియోను 24 గంటల్లోనే 1.24 లక్షల మందికి పైగా తిలకించారు. ప్రసారమైన మొదటి 3 ...

Read More »

‘ఫస్ట్‌క్లాస్‌’ ఉండాల్సిందే

టీచర్‌ పోస్టుల ఆశావహులకు సర్కారు షాక్‌ ఇచ్చింది. సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయనున్న టీచర్‌ పోస్టుల భర్తీకి డిగ్రీలో ఫస్ట్‌ క్లాస్‌(60శాతం) మార్కులు సాధించాలనే నిబంధనను తెరపైకి తెచ్చింది. గురుకుల టీచరు పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 60 శాతం మార్కులు సాధించాలనే ఈ నిబంధన అభ్యర్థులను ఆందోళన గురిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ఫస్ట్‌ క్లాస్‌’ మార్కులు సాధించాలనే నిబంధన పెట్టడంతో చాలా మంది ఆశావహులు పరీక్షకు దూరమయ్యే అవకాశం ఉంది. 7,306 పోస్టులకు టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన జారీ ...

Read More »

ఓడిపోతే డేటింగ్ చేస్తానని ట్వీట్ చేసిన టెన్నిస్ స్టార్… చివరికి.

వాషింగ్టన్: కెనడాకి చెందిన  టెన్నిస్ స్టార్ ఎగోనీ బౌచర్డ్ సోషల్ మీడియాలో చిత్రమైన బెట్టింగ్ కాసి చిక్కుల్లో పడింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో కొనసాగుతున్న ఈ అమ్మడు.. ఆదివారం సరదాగా సూపర్ బౌల్ ఆటపై బెట్టింగ్ కాసింది. అయితే ఆమె చెప్పిన జట్టు గెలవకపోతే తనతో డేటింగ్‌కి వచ్చేందుకు సిద్ధమా అని మరోవ్యక్తి పంపిన ట్వీట్ సవాలుకు సైతం సరేనంది. అట్లాంటా ఫాల్కన్స్, న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో…. అట్లాంటా విజయం సాధిస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. ఇంతలో ...

Read More »