Breaking News

‘ట్రంప్‌ ఆంక్షల లక్ష్యం ఎటువైపు?

అగ్రరాజ్యం కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్‌ట్రంప్‌ ప్ర వేశపెట్టిన విధానాలు మొత్తం ప్రపంచ దేశా లకు కలవరం పుట్టిస్తున్నాయి. హెచ్‌వన్‌బి వీసాలపై ఆంక్షలు ప్రవేశపెట్టి, ఏడు ముస్లిందేశాలనుంచి వచ్చే శరణార్ధులపై 190 రోజుల నిషేధం ప్రకటించిన వెంటనే అమెరికా వీసా అధికార యంత్రాంగం సుమారు లక్షకుపైగా వీసాలను రద్దుచేసింది. ఏడు ముస్లిం దేశా లపైనే ప్రధానంగా లక్ష్యంపెట్టుకుని డొనాల్డ్‌ట్రంప్‌ పాలనా యంత్రాంగం ఈ నిషేధాజ్ఞలు జారీచేసింది.ఒక్క 2015లోనే 11 మిలియన్లకుపైగా వలస, వలసేతర వీసాలను జారీచేసిన అమెరికా ఈసారి ఏడు ముస్లిం దేశాలతోపాటు ఇతర దేశాల వీసాలపై కూడా ఆంక్షలు పెట్టింది.

ఐక్యరాజ్యసమితి వీసాలు, నాటో దేశాల వీసా లపై రాకపోకలు చేస్తున్నవారికి ఈ ఆంక్షలు వర్తించవని కొంత ఊరటనిచ్చినా ప్రస్తుతంముస్లిందేశాల పై ఆంక్షలు పెట్టడాన్ని అంతర్జాతీయ ఐటిసంస్థలు సైతం సుము ఖంగా లేవు. అందులోనూ ఈ ఏడుదేశాలనుంచి స్పెషల్‌ వీసాలపై వచ్చే ప్రయాణీకులు అమెరికా కేంద్రంగా రాక పోకలు సాగిస్తున్న విమానాల్లోనే ప్రయాణాలు చేయా ల్సి ఉంటుంది. బాధ్యతలు చేపట్టిన అతికొద్దిరోజుల్లోనే ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకారణంగా 51 శాతం ప్రజాదరణ తగ్గిందని వాషింగ్టన్‌లో సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జార్జిబుష్‌కు 50శాతంమేర ప్రజాద రణ తగ్గడానికి మూడేళ్ల వ్యవధి పడితే ట్రంప్‌కు కేవలం ఎనిమిదే ఎనిమిదిరోజుల్లో 51శాతం ప్రజాదరణ తగ్గిం దంటే ఎంతటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా రో అర్ధం అవుతోంది. అయితే ఇందుకు తమదేశంలోని ఉపాధి గణాంకాలతో అమెరికా సమర్ధించుకుంటున్నది. జనవరినెలలో కొత్తగా 2.27 లక్షల ఉద్యోగాలు కల్పించి నట్లు ఆదేశ కార్మిక శాఖ ప్రకటించింది.

కేవలం మతమే ప్రాతిపదికగా ట్రంప్‌ ముందుకు వెళుతున్నట్లు స్పష్టం అవుతోంది. సమస్యాత్మక ముస్లిందేశాలుగా భావి స్తున్న దేశాల వలసలను నిషేధించి మతస్వాతంత్య్రాన్ని నిరోధించే వివాదాస్పద ఆదేశం జారీచేసేందుకు సైతం సిద్ధం అవుతున్నారంటే ఏమిటీ తెగింపు, ఏమిటీ తెంప రితనం అన్న వాదనలు వినవస్తున్నాయి. మతప్రాతిపది కన ఉద్యోగాలు, సేవలను ఇతర ప్రయోజనాలను కూడా అమెరికాలో నిరాకరించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలసేవలు అందించేందుకు మతపరమైన అభ్యం తరా లున్నాయి. వీటికి చట్టపరమైన రక్షణ కల్పించాలని మిత వాదులు కొందరు ఎన్నో ఏళ్లనుంచి డిమాండ్‌ చేస్తున్నా రు.ట్రంప్‌ ఆదేశాలు జారీచేస్తే మతస్వాతంత్య్రం, గేహ క్కులు తదితరాలపై పెద్ద ఎత్తున చర్చ వివాదాలు తప్ప వన్న వాదన పెరిగింది. తమ దేశానికి వస్తున్న భారీ వలసల్ని ట్రంప్‌నిరోధించే లక్ష్యంతోనే హెచ్‌వన్‌బి వీసాల జారీకి కనీస వేతనపరిమితిని రెట్టింపుచేసిన బిల్లును తెస్తున్నారు.ఈబిల్లు అమలయితే 80శాతం మంది హెచ్‌ వన్‌బి వీసాలకు గండంఏర్పడుతుంది. అందులో అత్యధి కులు భారతీయులు అందులోనూ తెలుగువారే అధికం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అమెరికాలో చదు వుపూర్తయిన వారికి అక్కడే రెండేళ్లపాటు అభ్యాస శిక్షణ కు గడువు ఉంటుంది.ఈకాలంలో అక్కడే ఉద్యోగంచేసు కునే అవకాశం ఉంటుంది. హెచ్‌వన్‌బి వీసా ఈలోపు సంపాదించి అమెరికాలో మంచి ఉద్యోగాల్లో భారతీయు లు స్థిరపడుతున్నారు. హెచ్‌వన్‌బి వీసా వచ్చిన ఐదేళ్లకు గ్రీన్‌కార్డు దక్కించుకుని ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కూడా పొందగలుగుతున్నారు. ఈ తరహా భారతీయులు అమెరికాలో లక్షల్లోనేఉన్నారు.వీటన్నింటికికీలక అభ్యాస శిక్షణ (ఒపిటి) అనేది పునాదిగా నిలుస్తున్నది. ఈ కాలాన్ని ప్రస్తుతట్రంప్‌ యంత్రాంగం ఏడాదికి కుదించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదేజరిగితే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలి లేకుండా భారత్‌కు తిరుగు ప్రయాణం కట్టాల్సిందే. లక్ష లు ఖర్చుచేసి అమెరికా వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం గ్యారంటీ లేకపోతే భవిష్యత్తు అంథకారం అవుతుందన్న భారతీయుల ఆందోళన ట్రంప్‌కు తెలి యందికాదు. అయినా అమెరికా ఫస్ట్‌ నినాదంతో ట్రంప్‌ వీసా ఆంక్షలు, శరణార్ధులపై ప్రవేశపెట్టిన తాత్కాలిక నిషేధం వంటివాటిని ఎట్టిపరిస్థితుల్లోను ఉపసంహ రించుకునే ప్రశ్నేలేదని ఆయన తెగేసి చెపుతున్నారు. అలాగే భార్యాభర్తల్లో ఒకరికి హెచ్‌వన్‌బి వీసా ఉంటే మరొకరు ఇంతకాలం వర్క్‌పర్మిట్‌తో అమెరికాలో ఉద్యో గంచేసుకునేవారు. ఇకపై వీసాలున్నవారి భాగస్వామికి ఇచ్చే ఉద్యోగాలపై కూడా ఆంక్షలు విధించేయోచనతో ట్రంప్‌ పాలనాయంత్రాంగం ఉంది. అదే జరిగితే ప్రవాస భారతీయుల ఆర్ధికపరిస్థితులు మరింత దెబ్బతింటాయ నడంలో ఎటువంటి సందేహంలేదు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టెక్కీ దిగ్గజాల కు భారీనష్టం వస్తుందని, సమస్యలు ఉత్పన్నం అవుతు న్నాయని ట్రంప్‌కు లేఖలు సైతం రాసాయి. మైక్రోసాప్ట్‌, గూగుల్‌,ఎటిఅండ్‌టి వంటి టెక్కీదిగ్గజాలు సైతం ట్రంప్‌ వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి.

కొన్నిసంస్థలైతే ఇందుకు పౌరహక్కుల సంస్థలు న్యాయపరంగా పోరాడేందుకు వీలుగా లక్షలాది అమెరికా డాలర్లను విరాళంగా అందిస్తు న్నాయి.వీటిలో తాజాగా ట్విట్టర్‌కూడా చేరిందంటే ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత వివాదా స్పదం అవుతున్నాయో అవగతం అవుతున్నది. వెనక్కి తగ్గాలని ఘాటుగా లేఖలు రాస్తున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చి తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడుతున్నదని మైక్రోసాప్ట్‌ హెచ్చరించింది. అలాగే ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌జుకర్‌ బెర్గ్‌ అయితే మొత్తం వీసా ఆంక్షలనే వ్యతిరేకించారు. అమెరికా సహ జంగానే వలస వాదుల దేశమని,ఉగ్రఛాయలు ఉన్న ట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలేకానీ మొత్తం ఆదేశంపైనే నిషేధం విధించడం సరికాదని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లతో మొట్టమొదటి సారిగా నిరసన వ్యక్తం చేసారు. అదేబాటలో ఇతర బహుళజాతి సంస్థలు కూడా నిరసన ప్రకటించాయి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article