Breaking News

సొంతగడ్డపైనే ట్రంప్‌కు చిక్కులు!

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ జారీచేసిన ఫర్మానాపై స్వదేశంలోని న్యాయవ్యవస్థలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ట్రంప్‌ జారీ చేసిన ముస్లిందేశాల శరణార్ధుల తాత్కాలిక నిషేధం ఉత్తర్వులు చెల్లవని పేర్కొంటూ అప్పీల్స్‌కోర్టును ఆశ్రయించిన 16 మంది అటార్ని జనరల్స్‌ తాజా సవాలు అమెరికాలోనే కాదు ప్రపంచదేశాల్లో చర్చనీయాంశమైంది. అయినా వెనక్కి తగ్గేదిలేదని, న్యాయస్థానాల్లో కూడా పోరాడతా మని శ్వేతసౌధం ట్రంప్‌కు వత్తాసుపలుకుతోంది.

రాజ్యాంగం ఆయనవైపే ఉందని, దేశప్రజల ప్రయోజ నాలను కాపాడేందుకు ఏంచేయాలి,ఏమిచేయకూడదనే అంశంలో అధ్యక్షునికి పూర్తిస్పష్టత ఉందని,చట్టం పూర్తి గా అధ్యక్షునివైపే ఉందని శ్వేతసౌధం ప్రతినిధివర్గం వెన కేసుకురావడాన్ని చూస్తే వివక్షపూరితంగా అమెరికా వ్యవ హరిస్తోందన్న వాదనలు మిన్నంటుతున్నాయి. ఎవరెన్ని అనుకున్నా ఎన్నికల్లో అమెరికా ప్రజలకు ఇచ్చిన వాగ్దా నాలను ఒక్కొక్కటిగా అమలుచేయడమే తన బాధ్యత అన్నట్లుగా ఉంది ట్రంప్‌ వ్యవహారశైలి. ముందు హెచ్‌ వన్‌బి వీసాలపై ఆంక్షలు. లక్షా30వేల డాలర్లకు వార్షిక వేతన పరిమితిపెంపు, ఆ తర్వాత మెక్సికోసరిహద్దుల వెంబడి గోడనిర్మాణం.కాదంటే ఆదేశం నుంచి వచ్చే దిగు మతులపై 20శాతం సుంకం విధించి నిధులు సమీక రించి మరీ గోడనిర్మాణం పూర్తిచేస్తామని ట్రంప్‌ వెల్లడిం చడాన్ని చూస్తుంటే చేసిన నిర్ణయాలపై ఎట్టి పరిస్థితు ల్లోను వెనక్కితగ్గేదిలేదన్న ధోరణి వెల్లడవుతోంది. శరణా ర్ధులపై ప్రవేశపెట్టిన తాత్కాలిక నిషేధంపై ఆదేశంలోని రాజ్యాంగం పైనా, చట్టాలపైనా సంపూర్ణ అవగాహన ఉన్న అటార్ని జనరల్‌స్థాయి అధికారులే ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్‌చేస్తూ అప్పీల్స్‌కోర్టుకు వెళ్లారు.

ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ప్రజలను సురక్షితంగా ఉంచుకునేందుకే ఈ కేసును దాఖలు చేయాల్సి వచ్చిం దని వారు ఒకేమాటపై ఉన్నారు. చట్టాలు, రాజ్యాంగం కంటే అధ్యక్షుడు శక్తిమంతుడు కాదని, రాష్ట్రాలు ప్రజల పక్షాన నిలవడం న్యాయవ్యవస్థలో తమకు తక్షణ కర్తవ్య మని చెపుతున్నారు. ఏడు ముస్లిందేశాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకమని,చట్టవిరుద్ధమని, అమెరికా ప్రాథ మికసంస్కృతి సాంప్రదాయాలకే విరుద్ధమన్న అభిప్రా యాలు వ్యక్తంఅయ్యాయి.ట్రంప్‌ నిర్ణయంతో వర్సిటీలు, ఆసుపత్రులు, వ్యాపారాలతోపాటు రాష్ట్రాలపన్నుల ఆదా యానికి కూడా ముప్పు ఏర్పడుతుందని స్వదేశంలోనే నిరసనలు మిన్నుముట్టా యి.ముస్లిందేశాలపై నిషేధం విధించడంద్వారా అమెరికా అసలు స్వరూపాన్ని ట్రంప్‌ వెల్లడించారని ఇరాన్‌దేశ అగ్రనేతలు సైతం దుయ్యబడు తున్నారు. అమెరికా పాలన వ్యవస్థలోనే రాజకీయ, ఆర్థిక, నైతిక, సామాజిక అవినీతి ఉందని, మూడు దశా బ్దాలుగా ఇరాన్‌ చెపుతూనే వస్తోందని, ఎన్నికలముందు, ఆతర్వాత ట్రంప్‌ ఈ అంశాన్నే స్పష్టంచేసినట్లుఆదేశ అగ్రనేతలు దుయ్యబడుతున్నారు. సహజంగా అమెరికా అంటేనే వలసవాదుల రాజ్యమని వలసవాదులు ఆదేశ ఆర్థికాభివృద్ధికి తమ మేధాసంపత్తితోనే జిడిపిని పెంచు తున్నారని, ఆర్థికవృద్ధిలో వీరి వాటా కీలకమని నిపుణు లు సైతం విశ్లేషించారు.

అయితే హెచ్‌వన్‌బి వీసాల ఆంక్షలపరిస్థితి వేరని, ముస్లిం దేశాలపై ఆంక్షలు వేరని రాజకీయ పరిశీలకులు చేస్తున్న విశ్లేషణల్లో వాస్తవం ఉంది. వీటికితోడుగా వీసా కోసం వచ్చేవ్యక్తులు తాము ఉపయోగించే సోషల్‌ మీడియా పాస్‌వర్డ్‌లు మొత్తం చెప్పాలని అలా అయితేనే అమెరికాలో అడుగుపెట్టనిస్తా మని పేర్కొనడం మరింత విచిత్రంగా ఉంది.అమెరికా కు వచ్చే అభ్యర్ధుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అన్నిదేశాల రాయబార కార్యాలయాలకు ఇప్పటికే ఆదే శాలు జారీ అయ్యాయి. నిషేధం విధించిన తొలిరోజునే సుమారు 70వేలకుపైగా వీసాలు రద్దయ్యాయి. కొంద రిని విమానాశ్రయాల్లోనే అడ్డగించేశారు.తనకు అమెరికా ఫస్ట్‌ నినాదమే ముఖ్యమని తన దేశం తర్వాతనే ఏదైనా అంటూ తనదైనశైలి పాలనకు శ్రీకారంచుట్టారు. సోషల్‌ వెబ్‌సైట్‌ పాస్‌వర్డ్‌లుమాత్రం ఖచ్చితంగా అందిస్తేనే అను మతిస్తా మని, అలాఇవ్వని వారికి అమెరికాలో అడుగు పెట్టే అవకాశమే ఉండదని అమెరికా అంతర్గత భద్రత వ్యవహారాలకార్యదర్శి జాన్‌కెల్లీ స్పష్టంచేశారంటే మరిన్ని ఉత్తర్వులకు రంగం సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న ్టదేశాలను పక్కనపెట్టి ఇతర దేశాలపై ఆంక్షలు ఎంత వరకూ సబబన్న వాదకూడా తెరపైకి వచ్చింది. కొన్నింటి లో సరిహద్దుపోరు, మరికొన్ని అంతర్గతపోరుతో సతమతం అవుతున్నాయి.అమెరికా అంతర్గత భద్రతకు ముప్పువాటిల్లే ఏ అంశాన్నయినా కట్టడిచేసేందుకు ముందుంటామని ఆదేశ అధ్యక్షుని ధోరణులు ప్రస్ఫుటం చేస్తున్నాయి. అమెరికా టెక్నాలజీ సంస్థల్లో సైతం ట్రంప్‌ ఉత్తర్వులు గుబులు పుట్టిస్తున్నాయి. సుమారు 100కు పైగా టెక్కీ సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

ఈ నిషేధం వల్ల వాణిజ్యపరంగాను, అభివృద్ధిపరంగా తీవ్రంగా నష్టపోతుందని చెపుతున్నాయి.ట్రంప్‌ స్వదేశం పైనే దృష్టిపెట్టారని,అయితే ఇతరదేశాల్లో ఉన్న అమెరికా బలగాలకు ముప్పు ఉండదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.సర్వమతసమానత్వంకోరుతున్న అమెరికా వ్యాపార దిగ్గజాల అభిమతాన్ని, అటార్నిజనరల్స్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అయినా అమెరికా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న వాదనకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article