Breaking News

వరకట్నాగ్నికి వధువులు సమిధలా!

Doury harrasement

పెళ్లిఅయిన కొద్ది రోజుల్లోనే వధువ్ఞ వంటింట్లో అగ్ని ప్రమాదానికి గురికావడం కొన్ని సంఘటనల్లో సజీవ దహనం కావడం,మరికొన్ని సంఘటనల్లో తీవ్రంగా గాయపడడం, ఆ తర్వాత ఆస్పత్రిలో మృతిచెందడం ఈ సంఘ టనలపై అనుమానాలు ఈవిధంగా దేశంలో ఎన్నో అనుమానాస్పద మరణాలు వధువ్ఞల పాలిట కన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ మరణాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇవన్నీ కూడా గృహహింస కింద,వరకట్నం చావులకింద చివరకు నిర్ధారణ అవ్ఞతు న్నాయి. భర్త, అత్తమామల వల్ల వేధింపులకు గురి కావడం, ఆ తర్వాత హత్యకు దారితీయడం ఇవన్నీ అనూహ్యపరిణామాలుగా సంభవిస్తున్నాయి.కొన్నిచోట్ల వధువులశరీరంపై కిరోసిన్‌, గ్యాసిలిన్‌, లేదా మండే ద్రవాలు చల్లడంవల్ల వంటగదిలోనే వధువ్ఞల జీవితా లు అంతరించిపోతున్నాయి.ప్రతిఇంటిలో వంటింట్లో కిరోసిన్‌ ఉండ డం సహజం.

ఇదే ఆ ఇంటిఇల్లాలికి మృత్యువ్ఞగా మారుతోందా? 1993 నుంచి ఇది సామాజిక, ప్రజారోగ్య సమస్యగా సమాజానికి దాపురిస్తోంది.గృహహింస వల్ల చనిపోయిన కేసులన్నీ కూడా క్రూర హత్యగానే పరిగణించబడుతున్నాయి. ఈ కేసుల్లో వాస్తవాలు బయ టపడితే నిందితులకు జీవిత కాలం ఖైదు, లేదా మరణశిక్ష తప్పదని చట్టం చెబుతోంది. భారతదేశంలో వధువ్ఞ మంటల్లో కాలిపోవడం తీరని సమస్యగా దాపురించింది.1995లో అప్పటిసర్వే ప్రకారం ఏటా2,500 వర కట్నం చావ్ఞలు సంభవిస్తున్నట్టు తేలింది. ఈ సంఖ్య రానురాను పెరిగింది.1980లో ఏడాదికి నాలుగువందల కేసులు బయటప డ్డాయి. 1990మధ్యకాలంలో 5,800 వరకు ఈ సంఖ్య తేలింది. ఏటాపోలీసులు 2,500వధువ్ఞ మరణాల ఫిర్యాదులు అందుకుం టున్నారు.

జాతీయ నేర విభాగ రికార్డు ప్రకారం( నేషనల్‌ క్రైం రికార్డుబ్యూరో) 2008లో 1948 మందికి శిక్షలుపడగా 3,876 మంది నిందితులుగా నమోదయ్యారు.దక్షిణ ఆసియాలో ముఖ్యంగా భారతదేశంలో వరకట్నం చావ్ఞ ఒక సమస్యగా పరిణమించింది. వధువ్ఞ తన భర్తవల్ల వేధింపులకు గురై చివరకు ఆత్మ హత్యకు పాల్పడిందంటే అది పెద్దనేరమే. సమాజంలో స్త్రీకి ముఖ్యమైన పాత్రఉంది. కుటుంబంలో స్త్రీ ఎన్నోకీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్పటికీ ఆమె అత్తవారింటికి తీసుకు వచ్చే కట్నకానుకలే ఆ కుటుంబ హోదాగా జమకడుతున్నారు. అత్తమామలు ఆశించిన ప్రకారం ఆమె కట్నకానుకలు తీసుకురాలేకపోతే అత్తింటిలో వేధింపులకు, హింస లకు బలికావలసి వస్తుంది. వరకట్నం అనేది సమాజంలోని ఆయా వర్గాల కుటుంబాల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. అందు వల్లనే పెళ్లి అయి అత్తవా రింటికి వచ్చిన వధువ్ఞలపై వరకట్నం ఒత్తిడిలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. మన భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో కూడా ఈ దుష్ట సంస్కృతి కొనసాగుతోంది. ఎక్కువ కట్నం తేవడం పెద్ద హోదా కింద పరిగణించే పరిస్థితి హిందూ, ముస్లిం, సంస్కృతిలో కూడా కనిపిస్తుంది.

1961లో భారత ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.వరకట్నం కోసంసాగే ప్రయత్నాలను కూడా నిషే ధించింది. 1986లో పార్లమెంటు వరకట్నం చావ్ఞలను గృహ హింసనేరం కింద చేర్చింది.పార్లమెంటు రూపొందించిన కొత్త సెక్షన్‌ 304-బి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ఏ వధువైనా తనకు పెళ్లి అయిన ఏడు సంవత్సరాల కాలంలో హత్యకు గురి అయితే ఆ హత్య భర్త వేధింపుల కింద క్రూరత్వం కింద పరిగణించాలని చట్టప్రకారం సూచించారు. మృతురాలి భర్త తరపు బంధువ్ఞలైనా సరే ఈ హత్యతో సంబంధం ఉన్నప్పుడు అలాగే వరకట్నం కోసం ఒత్తిడి తెచ్చారని అది చివరకు ఆత్మహత్యకు దారి తీసిందని, లేదా హత్యకు దారితీసిందని రుజు వైనప్పుడు జీవితఖైదుకు నిందితులు గురికాకతప్పదు. చాలా వరకట్నం చావ్ఞలు, ఆత్మహత్యలు,హత్యలు ఇవన్నీ కూడా ఈ విధంగా నే ఏడేళ్లలో జరిగితే ఘోరమైన నేరంగానే చట్టం చెప్తుంది. 1997 నివేదిక ప్రకారం ఏటా కనీసం ఐదువేల మంది వర కట్నం కాటుకు బలి అవ్ఞతున్నారని వంటగదిలోని మంటల వల్ల ప్రతిరోజూ కనీసం పన్నెండు మంది చనిపోతున్నారని వెల్లడైంది. ఈ కేసుల్లో ముప్ఫైశాతం వరకట్నం చావ్ఞలే అని రూఢి అయింది.

ఈ కేసుల్లో నిందితులు శిక్షలకు గురిఅయ్యారు.1961లో వరకట్నం నిషేధం చట్టం వచ్చినప్పటికీ ఆ చట్టంలోని కొన్ని లోపాలను సవ రించి 1980లో సమగ్రంగా చట్టాన్ని తీర్చిదిద్దారు. వరకట్నం చావ్ఞ కేసుల్లో వధువ్ఞ భర్తకాని, లేదా బంధువ్ఞలు కానీ ఈ సంఘటనతో సంబంధం ఉన్నప్పుడు అది పెళ్లి అయిన ఏడేళ్లలోనే జరిగినప్పుడు ఆ సాక్ష్యా లు రుజువ్ఞ అయితేనే శిక్షకు గురి అవ్ఞతారు. కాని దురదృష్టవశాత్తు చట్టంలోఈ నేరాన్ని కచ్చితంగా నిర్ధారించే మార్గం స్పష్టంగా లేదు. ఏవిధంగా దోషులను వరకట్నం చావ్ఞలకేసుల్లో నిర్ధారించాలో స్పష్టంగా పేర్కొనలేదు. ఇటువంటి లోపాలన్నీ కూడా నిందితులకు సులు వ్ఞగా తప్పించుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.

ఇందులో పెళ్లి అయిన ఏడేళ్లలోగా అనే వివరణ కొంత సమస్యా త్మకంగా తయారైంది. ఏడే ళ్ల వరకు వధువ్ఞకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఏడేళ్ల తర్వాత గృహహింస ఎక్కువై చివరకు ఆత్మహ త్యకు లేదా హత్యకు దారి తీసినా అవి వరకట్నం చావ్ఞలకింద కేసుల్లో నమోదుకావడం లేదు. 1983లో మరో చట్టం అమలులోకి తెచ్చారు. భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించినా, లేదా అత్తమామలు తీవ్రంగా హింసించినా శిక్షకు గురి అవ్ఞతారని హెచ్చరించారు. కానీ వాస్తవానికి దోషులను తేల్చడంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురవ్ఞతున్నాయి. దేశంలో ఈ వరకట్నం చావ్ఞలను నివారించ డం కోసం ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుటుంబంలోని అనుబంధాలను పెంచడంతో పాటు వధువుపై ఎటు వంటి హింస జరగకుండా సభ్యులందరిలో మానవతాదృక్పథాన్ని పెంపొందించడం ఈ విభాగాల బాధ్యతగా నిర్ణయించారు. న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులు వీలైనంత వరకు లేకుండా కౌన్సి లింగ్‌ ద్వారానే కుటుంబ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇవికూడా మొక్కుబడి తంతుగా తయారవ్ఞతున్నాయి. కుటుంబంలోని భర్త మాటే చివరకు చెల్లుబాటు అవ్ఞతుందన్న అభిప్రాయమే కొనసాగుతోంది.ఎవరు ఏమన్నా సహనం పాటించాలని, పరుషంగా మాట్లాడకూడదని, తిరుగుబాటు చేయకూడదని ఈ కౌన్సిలింగ్‌ సెంటర్లు కూడా హిత వచనాలు పలుకుతున్నాయి. అంతర్జాతీయసంస్థలు మహిళలపై జరుగుతున్న దారుణాలు,గృహహింస వంటివి తగ్గించడానికి ప్రయ త్నిస్తున్నాయి. దేశం మొత్తం మీద ఏటా పదివేల మంది మహిళలు కాలిన గాయాలతో చనిపోతున్నట్టు, కొంతమంది దీనివల్ల వికలాం గులు అవ్ఞతున్నట్టు స్పష్టమవ్ఞతోంది.అయితేమహిళలు ఈ విధంగా ఎందుకు కాలిపోవలసి వస్తుందో ఎవరు స్పష్టం చేయ లేకపోతు న్నారు. అందుకనే బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ చెన్నై ఒక సదస్సును ఈ సమస్యపై ఏర్పాటు చేసింది. అలాగే తెలంగా ణాలో కొంతమంది ఉద్యమనేతలు మహిళల దుర్మరణాలకు సంబం ధించి ముఖ్యంగా కాలిన గాయాలతో చనిపోయిన యువతులకు సంబం ధించి కొన్ని అంశాలను వెల్లడించారు.

ఈ కాలిన కేసుల్లో ఇరవై శాతంమంది మృతిచెందుతున్నట్టు ఉద్యమ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సదస్సులో కొన్ని పరిష్కార సూచనలు వస్తాయని భావిస్తున్నారు. వంటింటిలో మంటలకు గురై జీవితాలను చాలించే సంఘటనలకు సంబంధించి బాధితులకు రక్ష ణగా ఒక పాలనావ్యవస్థ ఏర్పాటు కావలసి ఉంది. అలాగే బాధి తులకు ఆరోగ్య శ్రీ పథకం కింద అనేక రకాల సర్జరీలు చేసి ప్రాణా లను రక్షించాల్సిన అవసరం ఉంది. జాతీయ కార్యక్రమం కింద ఈ మేరకు నిధులు కూడా భారీగా వెచ్చించవలసి ఉందని తెలంగాణ ఉద్యమనేతలు సూచిస్తున్నారు.

ఈ సదస్సులో డాక్టర్లను ప్లాస్టిక్‌ సర్జన్‌లను,ఫోరిన్‌సిక్‌ నిపుణులను, మానసిక వైద్యులను భాగస్వా ములను చేస్తున్నారు. పోలీసు, న్యాయ విభాగాల నుంచి కూడా కొంత మంది అధికారులు, న్యాయవాదులు పాల్గొంటున్నారు.ఈ సదస్సులో మహిళలు మంటలకు గురికావడం అనే అంశంపై ఎన్నో సూచనలు, పరిష్కారాలు లభిస్తాయని నిర్వాహకులు ఆశిస్తున్నారు. పెళ్లి చేసుకొని అత్తింటిలో అడుగు పెట్టిన వధువ్ఞ తెచ్చే వరకట్నమే అత్తింటి భవిష్యత్తుకు లేదా భర్త భవిష్యత్తుకు ఆధారమని అంద చందాలు,గుణగణాలకన్నా కట్నమే హోదాను నిర్ణయిస్తుందని నమ్మి పాటించే దుష్టసంస్కృతి నివారిస్తే కానీ మహిళలకు అత్తింటిలో రక్షణ కలగదు.చట్టాల పరంగా కాకుండా మానవతాదృ క్పథంలో భర్తదగ్గర నుంచి అత్తమా మలవరకు అందరిలో సద్భావ నకలగాలి. అంతేకాని ఆడపిల్ల ఇంట్లో పనిమనిషిగా లేదా ఒక బానిసగా చూసేఫ్యూడల్‌ మనస్తత్వం నశించి పోవాలి. వంటింట్లో ఒక ఇల్లాలు మంటలకు గురై చనిపోయిందంటే అది ఆ కుటుంబానికే తీరని కళంకం. అందుకనే చాలా సంఘటనలు పోలీసుల వరకు రావడం లేదు.

పరువుపోతుందని చాలామంది ఈ సంఘటనలను బయ టకి వెల్ల్లడికాకుండా ఎలాగోలాగా కుటుంబాలను కట్టడి చేస్తున్నారు. అందుకనే స్త్రీలు కూడా ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాలను ఎప్పటికప్పుడు బయటపెట్టగలగాలి.భర్త ప్రవర్తనలో మార్పు తీసు కురావడానికి ప్రయత్నించాలి.అత్తింటిపోరును ధైర్యంతో ఎదిరించా లి. అత్తింటివారు కూడా కోడలిని తమ కూతురిగానే భావించాలి తప్ప కక్షాకార్పణ్యాలతో పెత్తనం చేయడం మంచిదికాదు. కోడలిపై లేనిపోని ఆరోపణలు కొడుక్కు చెప్పినప్పుడు వాటిని తిప్పికొట్టే శక్తి కోడలికి ఉండాలి.అప్పుడే గృహలక్ష్మి ధైర్యలక్ష్మిగా వర్ధిల్లుతుంది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article