Breaking News

Daily Archives: February 12, 2017

వైభవంగా బోనాల పండగ

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలో గంగపుత్రులు ఆదివారం బోనాల పండగను వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి పెద్ద చెరువులోని గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గంగపుత్ర మహిళలు అందంగా అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకొని ఆలయం వరకు ఊరేగించి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు చేశారు.

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతోసిసి రోడ్డు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, నాయకులు తేజప్‌ ప్రసాద్‌, సురేశ్‌, యూనుస్‌, మజర్‌, లింబాద్రి, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సహ చట్టాన్ని వజ్రాయుధంలా వాడాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టాన్ని ప్రజలు వజ్రాయుధంలా మలుచుకొని వినియోగించుకోవాలని అఖిలభారతీయ సమాచార హక్కు చట్ట రక్షణ కమిటీ నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి శంకర్‌ అన్నారు. సహ చట్టం ద్వారా ప్రభుత్వ పథకాలు, వాటి ఖర్చులు వివరాలను బహిర్గతం చేసే అవకాశం ఉందన్నారు. ప్రతి అంశంపై ప్రజలకు తెలిసేవిధంగా ప్రభుత్వం సమాచారహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. తద్వారా అభివృద్ది పనులకు సంబంధించిన ఖర్చులు, ఇతర వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించిందన్నారు. ...

Read More »

బీడీ కార్మికులందరికి జీవనభృతి ఇవ్వాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన బీడీ కార్మికులందరికి జీవనభృతి ప్రభుత్వం అందజేయాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంగి సత్యం డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసరా పథకం కింద బీడీ కార్మికులకు జీవన భృతి అందించాల్సి ఉండగా చాలా మంది అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి అందడం లేదన్నారు. ఈ విషయమై గతంలో ఆర్డీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందన్నారు. ఓ ఇంట్లో అత్తకు భృతి ...

Read More »

వైభవంగా ఖుదావన్‌పూర్‌ ఎల్లమ్మ పండుగ

  – మొక్కులు తీర్చుకున్న ఎంపి, ఎమ్మెల్యే నందిపేట, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఖుదావన్‌పూర్‌ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయంలో నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపి కవిత ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హారతి, తీర్థ, ప్రసాదాలు, అమ్మవారి ...

Read More »

రూ. 4.5 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

  – ఐదుగురి అరెస్టు కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం రూ. 4.5 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపారు. జిల్లా కేంద్రంలో పక్క సమాచారం మేరకు పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఐ రాజు సిబ్బందితో కలిసి దర్శన్‌ థియేటర్‌ వద్ద వాహనాలు తనికీలు నిర్వహిస్తుండగా ఎపి 23 యు 6520 ఆటో వాహనం తనికీ చేయగా అందులోంచి నాలుగు ...

Read More »

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకున్నది అని ఎలా చెప్తామో పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారునకు కూడా పరమశివుని కళ ఆవాహన అవుతుంది. పెండ్లి కుమారుని చేసినప్పుడు ఆ సుముహూర్తానికి మంగళస్నానం చేయిస్తారు. తిలక ధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పెండ్లి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చేయవలసింది కులదేవతారాధన చేయాలి. ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో. తన ఐశ్వర్యం పెంపొందాలి. తను పితృఋణం నుండి విముక్తుడు అవడానికి సంతానం పొందాలి. ...

Read More »