Breaking News

Daily Archives: February 14, 2017

మైనార్టీ పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని రెండు తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరయ్య తెలిపారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో 2017-18 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్టు తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఈనెల 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, ఇందుకోసం ్‌ఎతీవఱర.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ. వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

Read More »

పాఠ్యపుస్తకాల రవాణాకు టెండర్ల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లాలోని 22 మండలాలకు పాఠ్యపుస్తకాలు రవాణా చేసేందుకు లారీ ట్రాన్స్‌పోర్టు ఓనర్లు ఈనెల 16వ తేదీ లోగా టెండర్లు దాఖలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ పాఠ్యపుస్తకాలు 1 నుంచి 10వ తరగతి వరకు 5 లక్షల 80 వేల పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభించి పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు రూ. 15 వేల దారావత్తు జిల్లా విద్యాశాఖాధికారి పేరిట ...

Read More »

బుధవారం సేవాలాల్‌ మహారాజ్‌జయంతి ఉత్సవాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాద్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ 278 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డిలో శాసనసభ్యుడు గంపగోవర్ధన్‌ ఆద్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి దేవిదాస్‌ తెలిపారు. పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్‌లో ఉత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్తకలెక్టర్‌ సత్తయ్య హాజరుకానున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని గిరిజనులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని సూచించారు.

Read More »

మానసిక వికలాంగులకు క్రీడాపోటీలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు మానసిక వికలాంగ చిన్నారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. క్యారమ్స్‌, చదరంగం, ఆటలు, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్టీపట్టణ అధ్యక్షుడు కైలాష్‌శ్రీనివాస్‌రావు, నాయకులు కన్నయ్య, ఇసాక్‌ షేరూ, గోనె శ్రీనివాస్‌, ఐరేని సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణపతి ఆలయంలో వైభవంగా పూజలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలోగల సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో మంగళవారం వైభవంగా పూజలు నిర్వహించారు. శుభ మాఘమాస అంగారక సంకష్టహర రోజును పురస్కరించుకొని గణపతి క్షేత్రంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ఫల పంచామృతాభిషేకం, అలంకరణ, 108 మంది గణపతులతో సామూహిక సంకష్ట హర చతుర్థి వ్రత ఉద్యానపనలు, గణపతి హోమం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు ...

Read More »

కూతురును చంపిన తండ్రిపై చర్యలు తీసుకోవాలి

  – పివోడబ్ల్యు జిల్లా కార్యదర్శి అరుణ కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అమ్రాద్‌ గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి కుల దురహంకారంతో దళిత యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతురునే దారుణంగా చంపినందుకు రాజన్నపై కఠిన చర్యలుతీసుకోవాలని ప్రగతిశీల మహిళ సంఘం పివోడబ్ల్యు జిల్లా కార్యదర్శి అరుణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కామారెడ్డిలో ఆమె మాట్లాడారు. కారెడ్డి రాజన్న కుమార్తె రోజ దళిత యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కులోన్మాదంతో ఆమెను స్నేహితునితో ...

Read More »

గురుకుల పాఠశాలల భర్తీకి రీ నోటిపికేషన్‌ విడుదల చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీ అంశంలో విధించిన మార్కుల నిబందన ఎత్తివేసి రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం డిగ్రీ, పిజిల్లో 50 శాతం, బిఇడిలో 50 శాతం మార్కులుండాలనే నిబంధనతోలక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌ ...

Read More »

‘పది’ పరీక్షలకు సన్నద్దంకండి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 13వ తేదీ నుంచి 30 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలను సాఫీగా నిర్వహించేలా అధికారులు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలుజారీచేశారు. మంగళవారం కలెక్టర్‌ చాంబరులో 10వ తరగతి పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మొత్తం 13,592 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరిలో 13090 రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూస్తాం

  – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ బీర్కూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బైరాపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న డబుల బెడ్‌ రూం ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తనశుద్ది కర్మాగారాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనికీ చేపట్టారు. విత్తనశుద్ది కర్మాగారంలో అభివృద్దిపనులపై జాప్యం చేస్తున్నందున ఎడిఎ ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌డేవిడ్‌లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్మాగారం ద్వారా రైతులకు సకాలంలో విత్తనాలు అందజేసే ...

Read More »

నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో విద్యార్థి గల్లంతు

  – తోటి విద్యార్థుల పరారీ నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ -8 సమీపంలోని మక్దుమ్‌పూర్‌ గ్రామ శివారులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు కాగా ముగ్గురు విద్యార్థులు పారిపోయారు. నలుగురు విద్యార్థులు కలిసి స్నానాలు చేసేందుకు ప్రధాన కాలువ వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా తోటి విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందినట్టు నిర్దారించుకొని ముగ్గురు విద్యార్థులు పారిపోయారు. మంగళవారం మండలంలోని మక్దుమ్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోగల కొనతాండాకు ...

Read More »

యాదవులకు అండ…

  నందిపేట, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొల్ల కురుమ కులస్తుల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఓ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 75 శాతం సబ్సిడీపై గొర్రెలు, మేకలు అందించి వారికి ఆర్థికంగా లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వెనకబడిన వర్గాలకు చెందిన గొల్ల కురుమల జీవనస్థితి గతిని మార్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధకశాఖతో ఈ కార్యక్రమం చేపట్టనుంది. గొల్ల కురుమ కులస్తుల సొసైటీలో సభ్యుల్లో కుటుంబానికి ఒక ...

Read More »

బుధవారం ఎమ్మెల్యే పర్యటన

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ గ్రామానికి బుధవారం మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా,స్తానిక సర్పంచ్‌ రాజేశ్వర్‌లు మంగళవారం తెలిపారు. బుధవారం గాండ్లపేట్‌ గ్రామ శివారులోగల శివాలయం వార్షికోత్సవం, జాతర గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.

Read More »

తొర్తిలో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామంలోగల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నుంచి బ్రహ్మూెత్సవాలు వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన రథోత్సవం, 18న జాతర, అన్నదానం నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ ఎం.నర్సయ్య తెలిపారు. గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు వచ్చి స్వామివారినిదర్శించుకోవాలని కోరారు. జాతర సందర్భంగా ఆలయాన్ని రంగులతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించి ముస్తాబు చేశారు. భక్తుల కోసం అన్ని ...

Read More »

తడపాకల్‌ గల్ప్‌ బాధితున్ని విడిపిస్తాం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని మహేశ్‌ ట్రావెల్స్‌ యజమాని నిర్వాకం వల్ల దుబాయ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న తడపాకల్‌కు చెందిన పూసల శ్రీనును విడిపించేందుకు కృషి చేస్తామని తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిన్నరాజరెడ్డి, గల్ప్‌ తెలంగాణ వెల్పేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బసంత్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం వారు తడపాకల్‌ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గల్ప్‌ రిటర్నింగ్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ సభ్యులు చాంద్‌పాషాతో మాట్లాడి శ్రీను జైలుపాలు కావడానికి కారణాలు ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్టు క్లబ్‌ సభ్యులు తెలిపారు. కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మోతిబిందు గలవారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కంటి వైద్యులు సంపత్‌, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

నీటివిడుదల పెంపు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌, కామారెడ్డి జిల్లాలోని ఆయకట్టుకు మూడు విడతలుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌జిల్లాల్లోని 2 లక్షల 80 వేల ఎకరాలకు పంటసాగుచేసుకునేందుకు ప్రాజెక్టు 5 విడతలుగా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గత సంవత్సరం డిసెంబరులో మొదటి విడత, రెండు, మూడు విడతలుగా జనవరి, పిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. గత ఆదివారం నుంచి నీటివిడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం ...

Read More »

విద్యార్థులకు వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో ఆర్‌బిఎస్‌కె పథకం కింద విద్యార్తిని, విద్యార్తులకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్‌ సాధన, స్టాప్‌ నర్సులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. విద్యార్థులకు ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా శాంతిభద్రతలు, ఆరోగ్యం తదితర విషయాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు అమర్‌సింగ్‌, ఆరోగ్య కార్యకర్త సునీత, తదితరులున్నారు.

Read More »

మండలానికి చేరుకున్న ఏకరూప దుస్తులు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏకరూప దుస్తులు వచ్చాయి. 49 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలకు గాను 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3600 మందికి వచ్చే విద్యాసంవత్సరంలో ఒక్కో విద్యార్తికి ఒక ఏకరూప దుస్తుల జత అందిస్తామని ఎంఇవో బలిరాంనాయక్‌ అన్నారు. మండల విద్యాశాఖ కార్యాలయానికి దుస్తులు వచ్చినట్టు తెలిపారు. పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలల వారిగా దుస్తులు అందజేస్తామని ఆయన ...

Read More »

కనబడితే కళ్యాణం

సేవ! సురక్ష!! సంస్కార్!!! కనబడితే కళ్యాణం స్థానిక ఆర్మూర్ మండల కేంద్రం లో ప్రేమ జంటలు ఎక్కడ కనబడిన జంటలకు పెండ్లి చేస్తుంది …. …..ఇది మన దేశ సంస్కృతి కాదు ప్రాచ్యాత సంస్కృతి ని… బజరంగ్ దళ్ తివురంగా కందిస్తుంది …. కనిపించిన జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారు నిజమైన ప్రేమికులయితే అక్కడనే వివాహం జరోపిస్తుంది. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదు…. ఆరోజుకు వ్యతిరేకం … ఎందుకు అంటే ఆ రోజు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ వంట్టి వాళ్లు ...

Read More »

62 ఏళ్లగా స్నానం లేదు.. కుళ్లిన ముళ్లపంది మాంసం తింటాడు..

టెహ్రాన్‌: ఇరాన్‌కు చెందిన అమో హాజీ (82) అరవై  రెండేళ్ల నుంచి స్నానం చేయలేదు. అతడు దక్షిణ ఇరాన్‌ ప్రాంతంలోని డెజ్‌గా అనే గ్రామం పొలిమేరలో ఒంటరిగా జీవిస్తుంటాడు. యువకుడిగా ఉన్నప్పుడు మానసిక ఆందోళనకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇలా ఒంటరిగా జీవిస్తున్నాడు. స్నానం అంటే తనకు ఆగ్రహం వచ్చేస్తుంది. స్నానం చేస్తే తనకు అనారోగ్యం కలుగుతుందంటాడు. ఒక్క స్నానమే కాదు.. తాజా ఆహారమన్నా, శుభ్రమైన నీళ్లన్నా హాజీకి పడదు. చనిపోయిన జంతువుల కుళ్లిన కళేబరాలను తింటాడు.కుళ్లిపోయిన ముళ్లపంది మాంసం అంటే అతడికి చాలా ...

Read More »