Breaking News

Daily Archives: February 15, 2017

డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల డ్రైవర్లకు సాధికారత కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలుచేపట్టిందని, ఇందులో భాగంగా డ్రైవింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరచడంతోపాటు ప్లేస్‌మెంట్స్‌ కల్పన, వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని అందించనుందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి తెలిపారు. దరఖాస్తుచేసుకోవడానికి 8వ తరగతి కనీస అర్హత అని, 10వ తరగతి ఉత్తీర్ణత, లేదా అనుత్తీర్ణత అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారికి ...

Read More »

ఘనంగా షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ మహ్మద్‌ అలీ షబ్బీర్‌ జన్మదిన వేడుకలు బుధవారం కామరెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విటి.ఠాకూర్‌ బ్లడ్‌బ్యాంకులో 48 మంది కార్యకర్తలు రక్తదానంచేశారు. అనంతరం బతుకమ్మ కుంటలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులైన వైద్యులతో మురికివాడల్లోని రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ ...

Read More »

బట్టికి బాల్యం బలి…

  – అధికారుల చోద్యం, పర్యవేక్షణ లోపం – లక్షల రూపాయలు వృధా రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచానికి జ్ఞాన సంపదను అందించాల్సిన చిన్నారులు ఇటుక బట్టీల్లోనే తమ భవిష్యత్తును సమాధి చేస్తున్నాయి. అభం శుభం తెలియని ఆ లేత మనసులు ఇటు రాపిడికి గాయాల పాలవుతున్నాయి. బలపం పట్టాల్సిన చేతులు బట్టిలో మూలుగుతున్నాయి. అఆఇఈలు దిద్దాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తున్నారు. జిల్లాలో ఇటుక బట్టీలలో జరుగుతున్న సంఘటన. ఇందులో పనిచేసే కార్మికులు వివిధ రాష్ట్రాల నుండి ...

Read More »

శుక్రవారం మండల ప్రత్యేక సమావేశం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపిడిఓ శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. సమావేశానికి ఎంపిటిసిలు, జడ్పిటిసి, మండల సర్పంచ్‌లు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వైస్‌ ఎంపిపి మోహన్‌రెడ్డి రాజీనామా చేయడంతో నూతన వైస్‌ ఎంపిపిని ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా తుమ్మల ప్రవీణ్‌కుమార్‌ను నియమించొద్దు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొని రుజువు కావడంతో తొలగించిన తుమ్మ గంగారాం తమ్ముడు అయిన తుమ్మల ప్రవీణ్‌ కుమార్‌ను కొందరు అధికార పార్టీ నాయకులు వికలాంగుడైన వ్యక్తిని ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా నియమించేందుకు కుట్ర పన్నుతున్నారని, అతన్ని తప్ప వేరే ఎవరిని నియమించినా తమకు అభ్యంతరం లేదని దొన్కల్‌ గ్రామస్తులు బుధవారం మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులను ...

Read More »

గాండ్లపేట్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం గాండ్లపేట్‌ శివారులోగల శివాలయం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న జాతరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్‌ రాజేశ్వర అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. గ్రామంలోని సమస్యలను స్థానిక సర్పంచ్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే బడ్జెట్‌లో సిసి రోడ్లు, ఎస్సీ, బిసి కమ్యూనిటీ హాల్‌ ...

Read More »

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

  గాంధారి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చుమన్‌ షా అలీ దర్గా వద్ద ఉర్సుకార్యక్రమాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ముస్లిం మతపెద్దల ఇంటి వద్ద నుంచి చాదర్‌, దుస్తులను ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ప్రదాన వీదులతో పాటుమసీదు వద్దనుంచి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో హిందు, ముస్లింలు పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా గుర్రపు విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాత్రి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ...

Read More »

దివ్యాంగులకు ఫిజియోథెరఫి వైద్యం

  గాంధారి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో బుధవారం దివ్యాంగులకు ఫిజియోథెరపి వైద్యాన్ని డాక్టర్‌ రవిందర్‌ అందించారు. ప్రతిరోజు దివ్యాంగుల తల్లిదండ్రులు ఇంటి వద్ద వ్యాయామం చేయించాలని సూచించారు. దివ్యాంగులు సకలాంగులుగా మారేంత వరకు వ్యాయామాన్ని కొనసాగించాలని తెలిపారు. ఈ సందర్భంగా 8 మంది దివ్యాంగులకు ఫిజియోథెరపి వైద్యంఅందించినట్టు రిసోర్సు పర్సన్లు పెంటయ్య, సాయన్న తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్‌ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మారుతి,తిరుపతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి

  గాంధారి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ 278వ జయంతి ఉత్సవాలను గిరిజనులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సేవాలాల్‌ చౌరస్తా వద్ద గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌మహారాజ్‌జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల వారు హర్సం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం ఇదే తరహాలో నియోజకవర్గ స్థాయితో పాటు మండల, గిరిజన తాండాల్లో కూడా సేవాలాల్‌ జయంతి వేడుకలు జరుపుకునే ...

Read More »

గాంధారిలో షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలు

  గాంధారి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ జన్మదిన వేడుకలను బుధవారం కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూచౌరస్తా వద్ద కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం లక్ష్మమ్మ ఆలయంలో షబ్బీర్‌ అలీ పేరుతో పూజలు నిర్వహించారు. షబ్బీర్‌ అలీ 61వ జన్మదిన వేడుకలను ఏవిధంగా జరుపుకుంటున్నారో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు సంగని బాలయ్య, ...

Read More »