Breaking News

Daily Archives: February 16, 2017

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి వారికి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంఇవో బలిరాం రాథోడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రానున్న విద్యార్థులకు మార్గదర్శకం కావాలని, ప్రథమస్తానంలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేందర్‌, జయశ్రీ, రాజు, హరీష్‌ ఉన్నారు.

Read More »

పన్నులు చెల్లిస్తేనే గ్రామాల్లో అభివృద్ది

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సుంకిపల్లి గ్రామంలో ఇంటిపన్ను వసూలు కోసం పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పన్ను వసూలు కోసం ఇంటింటికి తిరుగుతూ పన్నులు చెల్లించాలని కోరారు. అందరు పన్నులు చెల్లిస్తే గ్రామాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరు గ్రామాభివృద్ది కోసం సహకరించాలని కోరారు.గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పర్యటిస్తూ 6300 రూపాయల పన్ను వసూలు చేసినట్టు తెలిపారు.

Read More »

విద్యార్థుల సామర్థ్యం పరిశీలన

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు సిఆర్‌పిల బృందం పరిశీలిస్తున్నట్టు ఎంఇవో బలిరాం రాథోడ్‌ తెలిపారు. సభ్యులు మండలంలోని ఒడ్దేపల్లి, మల్లూర్‌ పాఠశాలల్లో పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యం సేకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సమత, లక్ష్మణ్‌, సిఆర్‌పిలు వరలక్ష్మి, నర్సింలు, శ్రీధర్‌ ఉన్నారు.

Read More »

గురుకుల విద్యాలయంలో దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7తరగతుల్లో 2017-18 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బిసి సంక్షేమాధికారి దేవిదాస్‌ తెలిపారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి లకు చెందిన బాల బాలికల పాఠశాలల్లో 31 జిల్లాల్లోని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు మహాత్మాజ్యోతిబాఫూలే విద్యాలయ సంస్త కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారన్నారు. 6,7 ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ...

Read More »

28 నుంచి స్థాయిసంఘ సమావేశాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిజామాబాద్‌ జిల్లా ప్రజాపరిషత్‌ స్తాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన సభ్యులు, సంబంధిత అధికారులు సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.

Read More »

కస్తూర్బాలో వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఆరోగ్య కేంద్రం వైద్యురాలు వందన విద్యార్థినిలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 200 మంది విద్యార్థినిలు ఉండగా 187 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, కొందరికి ఉచితంగా మందులు అందించినట్టు తెలిపారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్తినిలకు సూచించారు. ఏవైనా సమస్యలుంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆమె వెంట సాయిలు, ప్రిన్సిపాల్‌ సరోజ, తదితరులున్నారు.

Read More »

మునిసిపల్‌ కార్మికుల క్రమబద్దీకరణకు ఉద్యమం

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికుల క్రమబద్దీకరణ కోసం సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు తెలిపారు. గురువారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపల్‌ కార్మికుల క్రమబద్దీకరణ, వేతనాల పెంపుదల, హెల్త్‌ కార్డులు, జిపిఎఫ్‌ అకౌంట్లు, ఇఎస్‌ఐ తదితర సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ నుంచి 16 వరకు ముఖ్యమంత్రికి లేఖలు రాశామన్నారు. 19 నుంచి ...

Read More »

కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా వీడియో సిడి ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనపై రూపొందించిన సిడిని గురువారం ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆవిష్కరించారు. మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన నరేశ్‌ పాటలను రచించగా, ముఖ్యమంత్రి జన్మదినోత్సవం పురస్కరించుకొని సిడి ఆవిష్కరించారు. నరేశ్‌తోపాటు వినోద్‌కుమార్‌, వెంకటేశ్‌ బొల్లలు గేయాలు రచించినట్టు తెలిపారు.పాటలను బాంబేబోలే స్వరపరిచి పాడారన్నారు. కెసిఆర్‌ జీవితచరిత్రకు సంబంధించిన పాలనకు సంబంధించిన అంశాలతో సిడి రూపొందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, ...

Read More »

గొర్రెల పెంపకం దారుల సమాచారం సేకరించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గ్రామాలన్నింటిలో గల గొర్రెల పెంపకం దారుల సమాచారం సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం తహసీల్దార్లు, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఆయా గ్రామాలకు సంబంధించి నాలుగురోజుల్లో గొర్రెల పెంపకం దారులపూర్తి సమాచారాన్ని సేకరించి ప్రొఫార్మాలో పొందుపరచాలని ఆదేశించారు. 20+1 గొర్రెల యూనిట్లు తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు, 25 శాతం లబ్దిదారుని ...

Read More »

గుమ్మిర్యాల్‌లో మళ్ళీ ఇసుక నిల్వలు…

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామ శివారులోగల కోమటి కొండాపూర్‌ వెళ్లే రహదారి మధ్యగల పాటిమీది హనుమాన్‌ పక్కనేగల పంట కాలువ వద్ద 20 ట్రిప్పుల ఇసుక నిలువలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజు గోదావరి నది నుంచి, తీగల వాగునుంచి అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా ప్రతిరోజు ఇసుక తరలిస్తూ నిలువలు ఏర్పాటు చేసుకొని భారీ వాహనాల్లో, టిప్పర్లలో ఆదిలాబాద్‌, మెట్‌పల్లి మీదుగా కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ...

Read More »

మోర్తాడ్‌కు గురుకుల పాఠశాల మంజూరు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలానికి గురుకుల పాఠశాలను మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేములప్రశాంత్‌రెడ్డి మంజూరు చేయించారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు అన్నారు. మోర్తాడ్‌కు గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన బాల్కొండ ఎమ్మెల్యే, సిఎం కెసిఆర్‌ చిత్రపటాలకు పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ త్వరలోనే గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి నిధులుమంజూరు చేయిస్తామని వారు తెలిపారు. గురుకుల పాఠశాల అనుమతికి ...

Read More »

ఎక్సైజ్‌ నూతన కార్యాలయం ప్రారంభం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ ఎక్సైజ్‌ కార్యాలయ పరిధిలోగల వేల్పూర్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీకల్లు, నాటుసారా నియంత్రించి ఐడిని పెంచిన ఘనత మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడిదేనని డిప్యూటి ఎక్సైజ్‌ కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయనముఖ్య అతిథిగా పాల్గొని మోర్తాడ్‌ ఎక్సైజ్‌ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. జిల్లాలో భీమ్‌గల్‌, మోర్తాడ్‌ ఎక్సైజ్‌పరిధిలో అధికారుల పనితీరు బాగుందన్నారు. జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ...

Read More »

భీమ్‌గల్‌ పరిధిలో పోలీసుల మెరుపు దాడులు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏసిపి ఆదేశాల మేరకు భీమ్‌గల్‌ సర్కిల్‌ పరిధిలోని మోర్తాడ్‌ మండలంలో బుధవారం అర్దరాత్రి నుంచి గురువారం వరకు పలు నకిలీ ఎంటర్‌ప్రైజెస్‌లపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ స్కీం నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు బీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డి, మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోశ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేని ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో స్కీంలు అక్రమంగా నడిపిస్తున్నారని గమనించి పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి ఒకేసారి నిర్వాహకుల దుకాణాలపై, ఇళ్లపై దాడులు జరిపారు. ...

Read More »

రేషన్‌ బియ్యం పక్కదారి పడితే చర్యలు తప్పవు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం తహసీల్దార్‌ డేవిడ్‌ ఆధ్వర్యంలో రేషన్‌ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ సరుకులు బియ్యం పక్కదారి పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో విజిలెన్సు అధికారులు పర్యటిస్తున్నారని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. నిర్ణీత సమయంలో రేషన్‌ సరుకులకు డిడిలు చెల్లించాలని, సరైన సమయంలో సరుకులు అందజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ...

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో సేవాసంఘ్‌, ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ 278వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సేవాలాల్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెరాస బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బంజారాల అభివృద్దికి సేవాలాల్‌ మహరాజ్‌ ఎంతో కృషి ...

Read More »

డీలర్లు నిబంధనలు పాటించాలి

  గాంధారి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి చెందిన రేషన్‌ డీలర్లు నిబందనలు పాటించాలని సివిల్‌సప్లయ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డిటి మునీరుద్దీన్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతినెల సకాలంలో లబ్దిదారులకు సరుకులు అందజేయాలన్నారు. అదేవిధంగా దుకాణం ఎదుట సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నిలువవివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Read More »

తహసీల్దార్‌ ఎదుట ముగ్గురి బైండోవర్‌

  గాంధారి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మన్‌ ఎదుట గురువారం ముగ్గురిని బైండోవర్‌ చేసినట్టు ఎల్లారెడ్డి సిఐ ఎ.ఎల్‌.ఎన్‌.స్వామి తెలిపారు. పేతుసంగం గ్రామం, గుడివెనక తాండాకు చెందిన మున్సావత్‌ పంగా, రమేశ్‌, విజయలు తాండాలో నాటుసారాతోపాటు మద్యాన్ని విక్రయిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా నిందితులు ముగ్గురిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది స్వరూప, దేవిసింగ్‌ ఉన్నారు.

Read More »

ట్రాక్టర్‌ బోల్తా, ఒకరి మృతి, మరొకరికి గాయాలు

  గాంధారి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం వండ్రికల్‌ గ్రామ శివారు వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్టు స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. వండ్రికల్‌ గ్రామానికి చెందిన గుండిగ సిల్వరాజ్‌ (40) గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో గ్రామంలోగల గుండు మోనారు గుట్ట వద్ద ట్రాక్టర్‌ ట్రాలీతో రాళ్ళను తరలించడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే క్రమంలో ట్రాక్టర్‌కు అడ్డంగా పంది రావడంతో తప్పించబోయి పక్కనేగల ...

Read More »

ఆంక్షలు లేని జీవన భృతి కల్పించాలి

  గాంధారి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికి జీవన భృతి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు గురువారం ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. బీడీ కార్మికులందరికి వెయ్యి రూపాయలు జీవన భృతి కల్పిస్తామన్న ప్రభుత్వం ఆంక్షలతో అందరికి కల్పించలేకపోయిందన్నారు. ఒక ఇంట్లో వృధ్దాప్యపింఛన్‌ వస్తున్న సందర్బంలో అదే ఇంట్లో బీడీలు చేస్తున్న తమకుజీవన భృతి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ...

Read More »

పెత్తనం పురుషులదే!

మహిళలకు క్రమంగా తగ్గుతున్న స్వేచ్ఛ ఇంట్లో ఏది వండాలో నిర్ణయించేదీ ఆయనే బయటికెళ్లాలంటే శ్రీవారికి చెప్పక తప్పదు భర్తను ఎంచుకునే స్వేచ్ఛ 5 శాతం మందికే అక్షరాస్యత పెరిగినా అభివృద్ధి అంతంతే! తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి మరీ ఘోరం చదువుంది.. డబ్బులున్నాయి.. కానీ స్వేచ్ఛ లేదు. ఇదీ నేటి తరం మహిళల భావన. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా భర్తో.. అత్తమామలకు చెప్పివెళ్లాల్సిందేనని వీరు పేర్కొంటున్నారు. పోనీ నచ్చింది వండుకుని తిందామన్నా.. దానికీ ‘ఆయన’ ఒకే చెప్పాల్సిందేనని అంటున్నారు. పైగా పదేళ్ల కిందటితో పోల్చితే ...

Read More »