Breaking News

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్దం కండి

 

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ చాంబరులో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోమొదటి సంవత్సరం 10 వేల మంది, రెండో సంవత్సరం 8500 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు.

ఇందుకోసం జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో డుయల్‌ డెస్క్‌ బెంచీలు ఏర్పాటు చేయాలని అవకతవకలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఐడి కార్డులు లేకుండా అనుమతించవద్దని, అన్ని సౌకర్యాలు కల్పించాలని, పోలీసునిఘా ఏర్పాటు చేయాలని డిఎస్పీని ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీయడిట్‌ పరీక్షలు జరుగుతున్నందున నిరంతర విద్యుత్‌ ఉండేలా చూడాలని విద్యుత్‌ శాఖాధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఎస్పీ ప్రసన్నరాణి, ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ నోడల్‌ అధికారి నాగరాజు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article