Breaking News

ఉపాధి హామీ పనుల పరిశీలన

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎపివో సుదర్శన్‌ శుక్రవారం పరిశీలించారు. అటవీ ప్రాంతంలో చేస్తున్న కందకాల తవ్వకం పనులను వారు పరిశీలించారు. పనులు నాణ్యతతో కొలతల ప్రకారం చేయాలని కూలీలకు సూచించారు. ఫిబ్రవరి నెలలో వందరూపాయల కూలీ పనులు చేసి ప్రభుత్వం 20 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. మార్చినెలలో 100 రూపాయలు పనులు చేస్తే 25 రూపాయలు అదనంగా చెల్లిస్తుందన్నారు. ఏప్రిల్‌, మే నెలలో 100 రూపాయల పనికి 30 రూపాయలు అదనంగా కూలీ చెల్లించడం జరుగుతుందని అన్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో గట్టినేల తగులుతుందని ఈ విసయాన్ని ఎపిఓ సుదర్శన్‌ దృష్టికి కూలీలు తెచ్చారు. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రోజువారి 100 రూపాయల పనిచేస్తే 20 అదనంగా చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట టెక్నికల్‌ అసిస్టెంట్లు జయశ్రీ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గంగారాం ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article