Breaking News

గాంధారిలో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

 

గాంధారి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ 63వ జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల తెరాసనాయకులు శివాజీరావు, శ్రీకాంత్‌రెడ్డి, ముకుంద్‌రావు, మోతిరాం నాయక్‌, కాశీరాం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో….

గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కెసిఆర్‌ 63వ జన్మదిన వేడుకలను స్థానిక సర్పంచ్‌ సత్యం విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో విద్యార్థుల సమక్షంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. దళిత, గిరిజనుల అభివృద్దికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాటుపడుతున్నారని, మరెన్నో జన్మదిన వేడుకలు ప్రజల సమక్షంలో జరుపుకోవాలని సత్యం అన్నారు. కార్యక్రమంలో తెరాసనాయకులు సంతోష్‌, సాయిలు, గోపాలకృష్ణ, మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article