Breaking News

కోడిగుడ్ల సరఫరాకు టెండర్ల ఆహ్వానం

 

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లాలోని 5 ఐసిడిఎస్‌ల ప్రాజెక్టుల పరిధిలోని 1193 అంగన్‌వాడి కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం నెక్‌ రిజిష్టర్ట్‌ పౌల్ట్రీ ఫారాలనుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సంవత్సర కాలపరిమితికి గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బిడ్‌ ఆఖరి తేదీ ఈనెల 18 వరకు ఉండగా మరో ఐదురోజులు పొడిగించినట్టు తెలిపారు. ఈనెల 23 వరకు బిడ్‌లుస్వీకరిస్తామని తెలిపారు. జిల్లాలోని ఐదు ఐసిడిఎస్‌ ప్రాజెక్టులకు కందిపప్పు సరఫరాచేసేందుకు సంవత్సరం కాలపరిమితితో టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 23లోగా బిడ్‌లు అందజేయాలని ఆయన కోరారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article