Breaking News

Daily Archives: February 22, 2017

ముగిసిన యోగా శిబిరం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో ఆరురోజుల పాటు కొనసాగిన యోగా శిబిరం బుధవారంతో ముగిసింది. బాన్సువాడకు చెందిన యోగా గురువు రఘువీర్‌ ఆరురోజులపాటు ఉదయం పురుషులకు, విద్యార్థులకు, సాయంత్రం మహిళలకు పాఠశాల ఆవరణలో యోగా నేర్పించారు. మానసిక ఉల్లాసం కోసం యోగా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం సమయాన్ని కేటాయించి యోగాభ్యాసం చేయాలని, యోగావల్ల రోగాల బారి నుంచి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Read More »

పంచాయతీలో జోరుగా పన్ను వసూళ్ళు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా, బూర్గుల్‌, నర్సింగ్‌రావుపల్లి, వెల్గనూరు గ్రామాల్లో పన్ను వసూళ్ళు జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్యదర్శులు క్యాసప్ప, సుధాకర్‌, రఘుపతిరెడ్డి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. నర్వా గ్రామంలో 32 వేలు, బూర్గుల్‌లో 9,564 రూపాయలు, సుంకిపల్లిలో 11,260 రూపాయలు, నర్సింగ్‌రావుపల్లిలో 3,452 రూపాయలు, వెల్గనూరులో 4,658 రూపాయలు వసూలు చేసినట్టు ...

Read More »

మధ్యాహ్న భోజనం పరిశీలన

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో స్కూల్‌ యాజమాన్యం కమిటీ ఛైర్మన్‌ రఫీ బుధవారం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం భోజనం అందించాలని, వారానికి మూడు కోడిగుడ్లు తప్పకుండా అందించాలని నిర్వాహకులను కోరారు. నిర్వాహకులు సేవాభావంగా, బాధ్యతగా రుచికరమైన భోజనం అందించాని సూచించారు. ఆయనతోపాటు ప్రధానోపాధ్యాయులు ఇలియాస్‌, ప్రైమరీ స్కూల్‌ ఛైర్మన్‌ బిలాల్‌ ఉన్నారు.

Read More »

ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు

నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పుణ్యాహవాచనం, ధ్వజారోహణం అభిషేకం నిర్వహించారు. బుధవారం 550 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేపట్టారు. 24వ తేదీన జాగరణ, 25న మహాజాతర నిర్వహించి 20 వేల మందికి అన్నదానం చేయనున్నట్టు ఆశ్రమ కమిటీ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని వారు కోరారు. అదేవిధంగా మండలంలో ...

Read More »

ముస్తాబైన శివాలయాలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌, మోర్తాడ్‌, షెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లోగల శివాలయాలను గ్రామాభివృద్ది కమిటీలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందంగా అలంకరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా రంగులు అద్ది, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేయించారు. చెత్త, చెదారం తొలగించి ముళ్ల పొదలు తొలగించి చదును చేయించారు. గురువారం నుంచి ఆలయాల్లో దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించినట్టు ఆయా గ్రామాల సర్పంచ్‌లు దడివె ...

Read More »

గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయిస్తే చర్యలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో, తాండాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలుతీసుకుంటామని మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవు తెలిపారు. బుధవారం మండలంలోని బట్టాపూర్‌ తాండాలో ఆకస్మికంగా దాడులు జరిపినట్టు ఆయన తెలిపారు. గతంలో సారా విక్రయదారులను, తయారీదారులను తహసీల్దార్ల ముందు బైండోవర్‌ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అయినా తయారీదారులు, విక్రయదారులు తమ తీరు మార్చుకోకుంటే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. విక్రయాలను మానుకొని ప్రభుత్వం ...

Read More »

పాలెంలో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని పాలెం గ్రామంలో బుధవారం మండల కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 51 వేల ఇంటి పన్ను బకాయిలను వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలో 1 లక్ష 20 వేలు ఇంటి పన్ను బకాయిలు వసూలైనట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, రమేశ్‌, తిరుపతిరెడ్డి, కేశవనాథ్‌ స్వామి, గంగాదాసు, సాజన్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Read More »

రైతుల భూముల్లో ఫాంఫౌండ్‌ నిర్మాణాలు చేపట్టండి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని రైతుల భూముల్లో ఉపాధి హామీ పథకం కింద ఫాంఫాండ్‌ నిర్మాణాలు వేగవంతం చేయాలని బాన్సువాడ ఇన్‌చార్జి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. బుధవారం నిజాంసాగర్‌ ఎంపిడివో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. రైతులు ఫాంఫౌండ్‌ నిర్మాణాలు చేపడితే ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. వర్షపు నీటి ప్రవాహాన్ని అరికట్టి సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా కాపాడేందుకు పాంఫాండ్‌ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పాంఫాండ్‌ చుట్టు మామిడి, జామ, సీతాఫలం తదితర పండ్ల ...

Read More »

దోన్‌పాల్‌లో 5వ వార్డు ఎన్నికకు నామినేషన్లు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోన్‌పాల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 5వ వార్డు సభ్యుడు మృతి చెందడంతో ఈనెల 27న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎంపిడిఓ శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. బుధవారం నుంచి 25 వ తేదీ వరకు పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను మండల పరిషత్‌ కార్యాలయంలో దాఖలు చేసుకోవాలని సూచించారు. 26న నామినేషన్ల స్క్రూటినీ, 27న ఎన్నిక చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్నికరోజే ఓట్ల లెక్కింపు, అభ్యర్తి ప్రకటన, ప్రమాణ దృవీకరణ పత్రం అందజేయడం ...

Read More »

26 నుంచి మోర్తాడ్‌లో క్రికెట్‌ టోర్ని

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో ఈనెల 26వ తేదీ నుంచి రైతు బాంధవుడు దివంగత నాయకుడు వేములసురేందర్‌రెడ్డి స్మారకార్థం వేముల ప్రశాంత్‌ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు యువసేన ప్రతినిధులు బుధవారం తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు టోర్నిలో పాల్గొనాలని అన్నారు.

Read More »

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వస్తే దర్నాలు ఉండవు… రాస్తారోకోలు ఉండవు… మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్లు మనకు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేడు నిరుద్యోగులను అరెస్టు చేయించడం సరికాదని నందిపేట అఖిలపక్షం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం అక్రమ అరెస్టులకు నిరసనగా, అదేవిధంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. శాంతియుతంగా చేపట్టిన నిరుద్యోగ నిరసన ...

Read More »

ఉన్నత శిఖరాలకు మొదటి అడుగు 10వ తరగతి

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రానున్న బోర్డ్‌ ఎగ్జామ్స్‌ బాగా రాసి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని బీమ్‌గల్‌కు చెందిన న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవరం యూత్‌ ఆధ్వర్యంలో 117 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. భవిష్యత్తు జీవితంలో ఎటువంటి విజయాలు, లక్ష్యాలు సాధించాలన్నా 10వ తరగతి మొదటి మెట్టు అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ...

Read More »

నిరాదరణలో విజ్ఞాన నిలయాలు

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలు నిరాదరణ నీడలో నడుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా మండలంలోని 3 గ్రంథాలయాలు అద్దెభవనాలలో కొనసాగడమే సరైన నిర్వహణ లేక పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు జారీచేస్తున్న తరుణంలో స్థానిక గ్రంథాలయాలు తమ అవసరాలకనుగునంగా లేవని ఉద్యోగ అశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నందిపేట, ఖుదావన్‌పూర్‌, వెల్మల్‌ శాఖా గ్రంథాలయాలు కొంతకాలంగా అభివృద్దికి నోచుకోకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులకు ...

Read More »

బిజెపి నసురుల్లాబాద్‌ మండల కమిటి ఎన్నిక

  బీర్కూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నసురుల్లాబాద్‌ మండల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అర్సపల్లి సాయిరెడ్డి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వడ్ల సతీష్‌, ఉపాధ్యక్షులుగా గంగాధర్‌ గుప్త, ఆకుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులుగా కమ్మరి సత్యనారాయణ, తిప్పని సత్యనారాయణ, కార్యదర్శిగా చాకలి భూమయ్య, పురం ప్రవీణ్‌, కోశాధికారిగా గోపాల్‌ యాదవ్‌ నియమితులయ్యారు. కార్యక్రమంలో నిఖిల్‌, చిన్న, ప్రణయ్‌, వెంకట్‌రెడ్డి, ...

Read More »

కామన్‌వెల్త్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్‌ సదస్సుకు జిల్లా ఎంపి కవిత

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24వ తేదీ నుంచి 27 వరకు లండన్‌లో జరగనున్న కామన్‌ వెల్త్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్‌ సదస్సుకు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. కామన్‌ వెల్త్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్‌ను ప్రోత్సహించడంపై, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. లింగపరమైన వివక్ష లేకుండా మహిళల అభ్యున్నతికోసం, రాజకీయ సాధికారత కోసం అవసరమైన విద్య, సమాచార మార్పిడి తదితర విషయాలపై సమావేశంలో చర్చిస్తారు. కామన్‌ వెల్త్‌ దేశాల ...

Read More »

మధ్యాహ్న భోజనం తనిఖీ

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెను ప్రకారం భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైస్‌ ఎంపిపి గోగుల పండరి అన్నారు. నిజాంసాగర్‌ పాఠశాలలో వైస్‌ ఎంపిపి సర్పంచ్‌ రాజు, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షల్లో ప్రతిఒక్కరు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు.

Read More »

కామారెడ్డిలో ఆదర్శ పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీన జరగనున్న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు కామారెడ్డిలో నిర్వహిస్తున్నట్టు నిజాంసాగర్‌ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ చంద్రకళ తెలిపారు. ఆదర్శ పాఠశాలలో 6,7,8,9,10 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న పరీక్ష కేంద్రం వివరాలు విద్యార్థుల హాల్‌టికెట్‌పై పొందుపరచడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.

Read More »

గుంతలమయంగా ఎన్‌హెచ్‌ 161

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ శివారులోగల నల్లవాగు మత్తడి వంతెనకు నాందేడ్‌, అకోలా, సంగారెడ్డి 161 జాతీయ రహదారిపై గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత సెప్టెంబరు మాసంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. వంతెనపై పెద్ద పెద్ద గుంతలు పడి అన్ని రకాల వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి జాతీయ రహదారి విభాగం అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వాహన ...

Read More »

సోమేశ్వర ఆలయ సందర్శన

  బీర్కూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోగల 14వ శతాబ్దానికి చెందిన పురాతన చారిత్రక స్వయంభూలింగం వెలసిన సోమేశ్వర ఆలయాన్ని మంగళవారం బాన్సువాడ డిఎస్పీ నర్సింహారావు సందర్శించారు. మరికొన్ని రోజుల్లో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపికి సూచించారు. శివరాత్రి సందర్భంగా సోమేశ్వర ఆలయంలో రథోత్సవం, కుస్తీపోటీలు, జాతర తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడతాయని, కావున గట్టి నిఘాతో ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీసు ...

Read More »

యువకుని అదృశ్యం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ తాండాలో ఓ యువకుడు అదృశ్యమైనట్టు ఎస్‌ఐ గోపి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… అంకోల్‌ గ్రామ పంచాయతీలోగల అంకోల్‌ తాండాకు చెందిన అంజయ్‌కుమార్‌ (25), ఈనెల 19వ తేదీ నుంచి కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు బందువులు, స్నేహితుల ఇంట్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు తెలిపారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ వివరించారు.

Read More »