Breaking News

Daily Archives: February 23, 2017

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట మౌన ప్రదర్శన

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా నిర్బందాలు, అరెస్టులను నిరసిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు విద్యార్థి యువజన సంఘాల నాయకులు మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్లబట్టలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించబోగా ప్రభుత్వం దాన్ని అడ్డుకొని ప్రొఫెసర్‌ కోదండరామ్‌తోపాటు నిరుద్యోగులందరిని ఎక్కడికక్కడ ...

Read More »

శుక్రవారం ధర్మోరాకు ఉద్యానవనశాఖ కమీషనర్‌ రాక

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దర్మోరా గ్రామంలోగల శివాలయంలో ప్రత్యేకపూజలు చేసేందుకు ఉద్యానవనశాఖ రాష్ట్ర కమీషనర్‌ వెంకటరాఘవ కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో స్వామివారి దర్శనం అనంతరం స్వచ్చభారత్‌ కింద ఎంపికైన గ్రామంలో రైతుల పంటలను, అభివృద్ది పనులను పరిశీలించనున్నారు.

Read More »

ప్రొజెక్టర్‌ ద్వారా ఏజెన్సీ నిర్వాహకులకు శిక్షణ

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని కస్తూర్బా విద్యాలయంలో మధ్యాహ్న భోజన పథకంపై ఏజెన్సీ నిర్వాహకులతోపాటు ప్రధానోపాధ్యాయులకు ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. పౌరసరఫరాల గిడ్డంగి భవనం నుంచి విద్యార్థులకు ప్రత్యేకంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని పరిశీలించి సరఫరా చేయించుకోవాని, అంతేగాకుండా సంచులను నిలువ చేయకుండా పురుగు పట్టకుండా కాపాడాలని రిసోర్సు పర్సన్‌ ఏడుకొండలు సూచించారు. వంటగది పరిశుభ్రంగా ఉంచాలని, వంటశాలకు విద్యార్థులు రాకుండా చూడాలన్నారు. వండిన పదార్థాలపై మూతలు ఉంచాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వివరించారు. కార్యక్రమంలో ఎంఇవో ...

Read More »

అక్రమంగా మొరం తరలిస్తే వాహనాల సీజ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో రెవెన్యూ, ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారుల అనుమతులు లేకుండా మొరం, మట్టి అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్‌ చేసి కఠిన చర్యలు చేపడతామని ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చినట్టు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత…. మండలంలోని సుంకెట్‌ పెదవాగు ఇసుక పాయింట్‌ నుంచి మోర్తాడ్‌ మండలంలో అభివృద్ది పనులకు ...

Read More »

విద్యార్థుల అభివృద్దే ధ్యేయంగా కృషి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా వేముల ప్రశాంత్‌రెడ్డి యువసేన కృషి చేస్తుందని నాయకులు అన్నారు. మండలంలోని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు పోశెట్టి ఉపాధ్యాయ బృందం సమక్షంలో 117 మంది 10వ తరగతి విద్యార్థులకుగాను 125 పరీక్ష అట్టలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సంక్షేమం కోసం యువసేన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా తమ ...

Read More »

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామనికి చెందిన భువనగిరి రాజయ్య (50) గురువారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. రాజయ్య గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడన్నారు. దుడ్డెలను కడిగేందుకు చెరువులోకి దిగిన రాజయ్య ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు తెలిపారు. మృతునికి భార్య, కుమారులు రంజిత్‌, మహేశ్‌ ఉన్నట్టు పోలీసులు వివరించారు.

Read More »

మార్చి 15 నుంచి కామారెడ్డిలో పాదయాత్ర

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 33 వార్డుల్లో మార్చి 15 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్టు బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణా ల లక్ష్మారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షులు చింతల రమేశ్‌ అధ్యక్షతన జరిగిన పట్టణ కార్యవర్గ సమావేశానికి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలోని 33 వార్డుల్లో 61 బూత్‌కమిటీలు వారంరోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. మండల కమిటీలు, యువ మోర్చా కమిటీలు సైతం పూర్తిచేయాలన్నారు. ...

Read More »

వైభవంగా శివపార్వతుల కళ్యాణం

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని శివాలయంలో గురువారం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పూజారి శశికాంత్‌ శర్మ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారనల నడుమ కళ్యాణం జరిపించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు, శివస్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శివభక్త కమిటీ ప్రతినిధులు నీలం పెద్ద రాజులు, శివాజీ గణేష్‌ యాదవ్‌, లక్ష్మిపతి యాదవ్‌, నిట్టు నారాయణరావు, రాజుపాటిల్‌, గోపాల్‌రావు, మల్లయ్య, రమణ తదితరులు ...

Read More »

ఆకట్టుకున్న విజ్ఞాన్‌ మేళా

  కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవీ పబ్లిక్‌ స్కూల్లో గురువారం నిర్వహించిన విజ్ఞాన్‌ మేళ ఆకట్టుకుంది. విజ్ఞాన్‌ మేళాతోపాటు గణిత్‌ మేళ ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ మేళ నిర్వహించారు. మేళాలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సృజనాత్మకత, నైపుణ్యం, భాషా పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలను అభివృద్ది పరచడానికి ఇలాంటి మేళాలు ఉపకరిస్తాయని పాఠశాల కరస్పాండెంట్‌ హన్మంత్‌రావు అన్నారు. మేళాలో మొత్తం 253 నమూనాలు విద్యార్థులు ప్రదర్శించారు.

Read More »

కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలోని బోగేశ్వర ఆలయంలో 29వ అఖండ హరినామ సప్తాహ కొనసాగుతుంది. ఈనెల 18వ తేదీన ప్రారంభమైన సప్తాహ కార్యక్రమం 25వ తేదీతో ముగియనుంది. శుక్రవారం శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం దర్శనం, మధ్యాహ్నం కీర్తన, సాయంత్రం భజన, అర్ధరాత్రి వరకు ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జాగరణ ఉంటుందని, శనివారం ఉదయం ...

Read More »

శుక్రవారం పార్థివ లింగ ప్రతిష్టాపన

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మండల కేంద్రంలోని లక్ష్మమ్మ ఆలయంలో శుక్రవారం పార్థివ లింగం ప్రతిష్టించనున్నట్టు మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ తాన్‌సింగ్‌ తెలిపారు. భక్తుల దర్శనార్థం లింగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, శివ లింగ దర్శనంతో సర్వపాపాలు తొలగిపోతాయన్నారు. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తాన్‌సింగ్‌ కోరారు.

Read More »

మరో 5 వేల క్వింటాళ్ల కందుల కొనుగోళ్ళు

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రం ద్వారా మరో 5 వేల క్వింటాళ్ళ కందుల కొనుగోలుకు అనుమతి లభించిందని ఏఎంసి ఛైర్మన్‌ గీతా శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంతకుముందు కొనుగోలు కేంద్రం ద్వారా 5 వేల క్వింటాళ్ళ కొనుగోలుకు అనుమతి ఉండగా, రైతుల ఇబ్బందుల దృష్ట్యా వారి వద్ద ఇంకా కందులున్నాయని నివేదికల అనంతరం నాఫెడ్‌ ద్వారా మరో 5 వేల క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి ...

Read More »

నల్ల బ్యాడ్జీలతో నిరసన

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గురువారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కృష్ణ, ప్రేమ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. దీనికి విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు. దీనికి తెరాస భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ...

Read More »

నాణ్యమైన భోజనం అందించాలి

  గాంధారి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని గాంధారి ఎంఇవో సేవ్లానాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని సమయానికి అరగంట ముందే పదార్థాలు సిద్దంగా ఉంచాలన్నారు. మెను ప్రకారం ప్రతిరోజు కూరగాయలు, పూర్తిగా ఉడికిన కోడిగుడ్లు, మజ్జిగ అందజేయాలన్నారు. ఇటీవల కాలంలో ...

Read More »

ఉపాధి హామీ పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపిడివో రాములు నాయక్‌ గురువారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ ఉపాధి పనులు చేసిన వారికి మాత్రమే హాజరు వేయాలని సూచించారు. మస్టర్ల ప్రకారం కూలీల హాజరు పరిశీలించారు. బినామి హాజరువేస్తే కూలీ డబ్బు తక్కువ వస్తుందన్నారు. మండలంలో ప్రస్తుతం 13 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో కందకాలు, ఇంకుడు గుంతల పనులు జరుగుతున్నాయన్నారు. ఆయన ...

Read More »

మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో మహాశివరాత్రి ఉత్సవాలకోసం శివాలయాలు అందంగా ముస్తాబు చేశారు. మండల కేంద్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఒడ్డేపల్లి, అచ్చంపేట, నర్వ, మహ్మద్‌నగర్‌, కోమలంచ, సింగీతం గ్రామాల్లో శివాలయాలకు రంగులతో అలంకరించి విద్యుత్‌ కాంతులతో అందంగా తీర్చిదిద్దారు. ఒడ్డేపల్లి గ్రామంలోని పరమేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Read More »

పూర్వవైభవం ఇదేనా…

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో మొట్టమొదటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం నిజాంసాగర్‌ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 1986లో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని 11 ఎకరాల స్థలంలో కార్యాలయ భవనాలతో పాటు ఫిష్‌ పౌండ్స్‌ కల్చర్‌ ఫౌండ్‌ నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుండేవారు. అధికారుల నిర్వహణ కొరవడి చేప పిల్లల ఉత్పత్తికి నోచుకోవడం లేదు. ఇప్పటివరకు ...

Read More »

శివరాత్రి సందర్భంగా ముస్తాబవుతున్న ఆలయాలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ నసురుల్లాబాద్‌ మండలాల్లో శివాలయాలు, మండలంలోగల ప్రసిద్ద ఆలయాలు కొత్త కొత్త రంగులతో, విద్యుత్‌ కాంతులతో ముస్తాబవుతున్నాయి. బీర్కూర్‌లోని జోడు లింగాల శివాలయం, మైలారం గ్రామంలోని రాజన్న ఆలయం, సోమేశ్వర్‌లోని సోమలింగాల దేవాలయం, నెమ్లి సాయిబాబా ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్దమయ్యాయి. గురువారం ఆయా ఆలయాల్లో విద్యుత్‌ కాంతులతో స్వామివారు దర్శనమిస్తున్నారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని ...

Read More »

మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు తప్పనిసరి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వారానికి మూడు కోడిగుడ్లు తప్పకుండా అందించాలని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. మండల పరిధిలోని 26 పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో గురువారం విద్యావనరుల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం విద్యార్థులకు బోజనం అందించాలని, తాజా కూరగాయలు, పప్పులతో వండాలని సూచించారు. విద్యార్థుల పౌష్టిక పోషణ నిమిత్తం ప్రభుత్వం గుడ్లు అందజేస్తుందని, తప్పకుండా వారానికి మూడు సార్లు ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక

  బీర్కూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణాలకు ఇసుక ఉచితంగా తరలిస్తామని బీర్కూర్‌ తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. మండలంలోని బైరాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని గుత్తేదారుకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సరైన సమయంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు లబ్దిదారులకు అందించాలని ఆయన అన్నారు. ఇళ్లకు అవసరమగు ఇసుక మండలంలోని ...

Read More »