Breaking News

Daily Archives: February 27, 2017

మార్చి 8 నుంచి కుటుంబ స్నేహిత్‌ ప్రారంభం

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నచిన్న కారణాలతో కుటుంబాల్లో కలహాలు జరిగి విచ్చిన్నమవుతున్నాయని వారి కుటుంబాలు కలిపి ఆనందం నింపేందుకు మార్చి 8వ తేదీ నుంచి కుటుంబ స్నేహిత్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ శ్వేత, జేసి సత్తయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 మహిళా దినోత్సవం పురస్కరించుకొని కుటుంబ స్నేహిత్‌ ...

Read More »

ఇంటర్మీయడిట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించి చేరుకునేందుకు మొట్టమొదటిసారిగా సెంటర్‌ లొకేషన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. పరీక్షా కేంద్రాల్లో గట్టి భద్రత కల్పించాలని, ఎవరు ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం తహసీల్దార్‌కు వినతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని బీడీ కాలనీ, డ్రైవర్స్‌ కాలనీ, గుమాస్తా కాలనీ, గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్లులేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని సోమవారం కాలనీవాసులు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళకోసం తహసీల్‌ కార్యాలయానికి తరలివచ్చి తమ గోడును వెల్లబుచ్చారు. గతంలో కూడా అధికారులకు పలుమార్లు విన్నవించామన్నారు. అప్పటి విఆర్వో విచారణ జరిపి 73 మంది అర్హులను గుర్తించారన్నారు. ప్రభుత్వ స్థలం గుర్తించి ఎమ్మెల్యే శంకుస్తాపనచేసినా ఇంతవరకు ...

Read More »

మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులను చేర్పించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని మైనార్టీ సంక్షేమ విభాగం అధికారులు కోరారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మకుంటలో వార్డు కౌన్సిలర్‌ పద్మ రాంకుమార్‌తో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గురుకుల పాఠశాలలో బాలబాలికలను చేర్పించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. పాఠశాలలో చక్కటి వసతి, నాణ్యమైన ఆహారం, విద్యార్థులకు అందిస్తారని పట్టణంలోని అన్ని వార్డులప్రజలు తమ పిల్లల్ని మైనార్టీ గురుకులాల్లో చేర్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ...

Read More »

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి కాంగ్రెస్‌ నాయకులు సోమవారం చేయూతనందించారు. శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం, బట్టలు, దుప్పట్లు, రూ. 4 వేల నగదు అందించారు. ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ...

Read More »

హోలియా దాసరి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోలియా దాసరి కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జివి.దాస్‌ తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా చిన్నపోశయ్య, గౌరవ అధ్యక్షునిగా రాములు, ఉపాధ్యక్షునిగా గంగారాం, ప్రధాన కార్యదర్శిగా పోశయ్య, సహాయ కార్యదర్శిగా సాయిలు, సలహాదారులుగా రాములు, ప్రచార కార్యదర్శిగా శ్రీరాం, గంగయ్య, కోశాధికారిగా పెద్ద సాయిలు, జిల్లా కార్యవర్గ సబ్యులుగా రాజు, మోహన్‌, మధు, నర్సింలు, శ్రీనివాస్‌ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలియా దాసరుల ...

Read More »

సిపిఎస్‌ అంతమయ్యే వరకు పోరాటమే శరణ్యం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానం అంతమయ్యేవరకు పోరాటమే శరణ్యమని సిపిఎస్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ట మల్లికార్జున్‌ అన్నారు. సిపిఎస్‌ శంఖారావాన్ని ఆదివారం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌ అంటేనే ఉద్యోగుల శ్రమదోపిడి అని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ సమయంలో అందాల్సిన ప్రయోజనాలు అందకపోతే ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు. ఈ చర్య ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకోవడమేనని ...

Read More »

విద్యార్థులకు గోరుముద్దలు…

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ 10 విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఆకలికి గురికాకుండా ఉండేందుకు గోరుముద్దలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం నందిపేట మండలంలోని అయిలాపూర్‌ పాఠశాలలో సొసైటీ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ, ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌, విద్యార్థులకు అరటిపండ్లు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వందశాతం ఉత్తీర్ణత దిశగా విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడి కార్యకర్తలకు, కేంద్ర సహాయకులకు వేతనాలు పెంచినందుకు గాను నసురుల్లాబాద్‌ మండలంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వాణి ఆధ్వర్యంలో అంగన్‌వాడి కార్యకర్తలు సోమవారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు అంగన్‌వాడిలకు రెండుసార్లు వేతనం పెంచిందని, ఇందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నారని, కెసిఆర్‌ ఆధ్వర్యంలో ...

Read More »

నందిపేటలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్ధంతి

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం శాంతివాదులే కాదు క్రాంతికారులు కూడా పాల్గొన్నారని, ప్రాణాలు సైతం త్యాగంచేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు గంగాదర్‌ అన్నారు. ఈ మేరకు నందిపేట మండలంలోని గీతహైస్కూల్‌లో సోమవారం చంద్రశేఖర్‌ ఆజాద్‌ 86వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పండిత సీతారాం తివారీ, జరాణీదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అని, 1906లో జన్మించారని తెలిపారు. బ్రిటీష్‌ వారి నుంచి దేశ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగంచేసిన ...

Read More »

పసుపు కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోండి

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో రైతులనుంచి నేరుగా పసుపు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ పత్రికా ప్రకటనలో కోరారు. మండలంలో పండించిన పసుపు పంటను రైతులు వ్యయ ప్రయాసల కోర్చి మహారాష్ట్రలోని సాంగ్లికి తీసుకెళ్లడం మానుకోవాలని, మనకు దగ్గర్లో ప్రభుత్వంఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో గిట్టుబాటు ధర ఇవ్వనుందని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ...

Read More »

రోడ్డు బాగుచేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం నందిపేట సేవాసమితి సభ్యులు వినతి పత్రం సమర్పించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చెడిపోయిన రోడ్డునుబాగుచేయాలని కోరారు. రోడ్డు కంకర తేలడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డుపై కంకరతేలడంతో వాహన టైర్లు చెడిపోతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు బాగుచేయించాలని కోరారు. దుమ్ము, ధూలితో వాహనదారులకు, రోడ్డు పక్కనగల దుకాణదారుల సమస్య వర్ణనాతీతంగా ఉందన్నారు. అదేవిధంగా గ్రామంలో పారిశుద్యం సరిగాలేకపోవడంతో దోమల బెడద చాలా ...

Read More »

ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు ప్రతి యేడు దళారుల చేతుల్లో మోసపోతున్నారని, రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 28న మంగళవారం ఆర్మూర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీ, ధర్నాకు మండలంలోని రైతులు అధిక ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు 10,500 లకు వేతనం పెంచినందున సోమవారం మండలంలోని విఆర్‌ఏలు తహసీల్‌ కార్యాలయం ఎదుట సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచడమే గాకుండా తమ డిమాండ్లు పరిష్కరించడానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సొంత ఊళ్ళలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేముల ...

Read More »

పొలాలు ఎండిపోతున్నాయి… నీళ్ళివ్వండి మహా ప్రభో!

  బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత రబీ కాలంలో చివరి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న పొలాలకు చెరువు నీరు అందడం లేదని, అట్టి పొలాలకు నీరు అందించాలని ప్రజావాణిలో బీర్కూర్‌ గ్రామస్తులు తహసీల్దార్‌ కృష్నానాయక్‌కు వినతి పత్రం అందించి నీటిని అందించాలని మొరపెట్టుకున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా నీరు సరిగా వదలడం లేదని, వదిలిన కాస్త నీరే చెరువుకు దగ్గర్లోని పొలాలకు అందుతుందని, చివరి ఆయకట్టు రైతులకు నీరందడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఒక్క ...

Read More »

ఎండాకాలం వస్తుంది – తాగునీటిపై శ్రద్ద వహించండి

  బీర్కూర్‌ ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరికొద్ది రోజుల్లో వేసవి కాలం సమీపిస్తుందని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోగల పంచాయతీ కార్యదర్శులు తాగునీటిపై శ్రద్ద వహించాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల అభివృద్ది కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్ట్యా ఆయా మండలాల్లోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వాటర్‌ ట్యాంకులు, చేతిపంపుల పనితీరుపై శ్రద్ద వహించాలని, మంచినీటి సౌకర్యం తక్కువగా ఉన్న ...

Read More »

సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోండి

  – ప్రజావాణిలో ఫిర్యాదు బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ మల్లికార్జున్‌పై చర్యలు తీసుకోవాలని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసినట్టు ఆయా మండలాల తహసీల్దార్లు డేవిడ్‌, కృష్ణానాయక్‌ తెలిపారు. బీర్కూర్‌ మండలంలో కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పీరయ్య అనే వ్యక్తి ఇసి కొరకు సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని బీర్కూర్‌ ప్రజావాణిలో పిర్యాదు చేశారు. అదేవిధంగా నెమ్లి గ్రామానికి చెందిన కె.హన్మాండ్లు అనే వ్యక్తి పొలం పట్టా రిజిస్ట్రేషన్‌ తదితర ...

Read More »

గ్రామాల అభివృద్దే తెరాస ధ్యేయం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో అన్ని గ్రామాల సమగ్ర అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నామని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రామన్నపేట్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా భవనం, గోదాము నిర్మాణం పనులకు , సుంకెట్‌లోని గ్రామ పంచాయతీ భవనం, దోన్‌పాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు, షెట్పల్లి, తడ్‌పాకల్‌ గ్రామాల్లో నూతనంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ ...

Read More »

ఓం శ్రీ గురుభ్యోనమ

ఓం శ్రీ గురుభ్యోనమః?? ఫిబ్రవరి 27, 2017 సోమవారం(ఇందువాసరే) శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం తిధి :పాడ్యమి రా7.04 తదుపరి విదియ నక్షత్రం : శతభిషం ఉ6.49 తదుపరి పూర్వాభాద్ర యోగం :సిద్ధం సా4.39 తదుపరి సాధ్యం కరణం :కింస్తుఘ్నం ఉ8.19 తదుపరి బవ రా7.5 సూర్యరాశి :కుంభం చంద్రరాశి :కుంభం సూర్యోదయం :6.22 సూర్యాస్తమయం :6.35 రాహుకాలం : ఉ8.03 – 9.31 యమగండం : మ11.00 – 12.28 వర్జ్యం : ...

Read More »