Breaking News

Daily Archives: February 28, 2017

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఒలంపియాడ్‌లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో సైన్స్‌ ఒలంపియాడ్‌, మ్యాథ్స్‌ ఒలంపియాడ్‌ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి విజేతలకు మంగళవారం హైదరాబాద్‌లో బహుమతి ప్రదానం చేశారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవిత మాంటిస్సోరి పాఠశాలకు చెందిన సహన భరద్వాజ్‌, నందిని, నిఖిత, భానుప్రసాద్‌ యాదవ్‌లు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను రాష్ట్రస్థాయిలో ప్రశంసించారు. జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో మండలంలోని అంగన్‌వాడి కార్యకర్తలు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మూడు సంవత్సరాల పాలనలో రెండు సార్లు వేతనం పెంచడం హర్షణీయమని వారన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్‌ సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చికిత్స పొందుతూ ఒకరి మృతి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ గ్రామానికి చెందిన పోశయ్య (33) మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం మృతుడు చెడు వ్యసనాలకు బానిసై గత మూడురోజుల క్రితం క్రిమిసంహారక మందు సేవించాడని, చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ తరలించారన్నారు. అక్కడ చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్న తర్వాత గ్రామంలో మృతి చెందాడన్నారు. కాగా మృతునికి ఇద్దరు సంతానం ఉన్నారని అన్నారు. మద్యం ...

Read More »

ముదిరాజ్‌లను బిసి-ఎలో చేరిస్తే ఉద్యమం

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి-బిలో ఉన్న ముదిరాజ్‌లను బిసి-ఎలోకి చేరుస్తు ప్రభుత్వం ప్రతిపాదించడం గర్హణీయమని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని బిసి-ఎ 43 కులాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. మంగళవారం దీన్ని నిరసిస్తూ కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టరేట్‌ కార్యాలయం చేరుకొని ధర్నా చేపట్టారు. కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్‌లను బిసి-ఎలోకి మార్చడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో బిసి-ఎకు సంబంధించి ...

Read More »

జేవివి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమాజాభివృద్దిలో సైన్స్‌ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నట్టు జేవివి జిల్లా అధ్యక్షుడు ఉప్పునూతల నాగరాజు గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న మూడవిశ్వాసాలను, చాందస భావాలను అరికట్టడానికి ప్రజలను చైతన్యంచేసేందుకు జేవివి పనిచేస్తుందన్నారు. సమాజాభివృద్దిలో ...

Read More »

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట దర్నా

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట మంగళవారం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ఆర్టీసి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ డిపో కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు రంజిత్‌ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్‌పిఎస్‌ మూడో విడత ఏరియర్స్‌ను లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను డిఎ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెం. 1/2017ను వెంటనే రద్దుపరచాలని అన్ని క్యాటగిరీల్లో ఖాళీలు భర్తీచేయాలని, కార్మికులకు పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్లు చేశారు. మార్చి ...

Read More »

బ్రిలియంట్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బ్రిలియంట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని టిఎన్‌ఎస్‌ఎప్‌ జిల్లా ఇన్‌చార్జి బాలు డిమాండ్‌ చేశారు. గతంలో సైతం ఈ కళాశాల అధ్యాపకులపై ఇటువంటి ఆరోపణలు వచ్చినా యాజమాన్యం స్పందించకపోవడం వల్లే అవి పునరావృతమయ్యాయన్నారు. మార్కులు, ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను మానసికంగా హింసిస్తు చలగాటమాడిన కళాశాల గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిదులు ...

Read More »

ఉపాధి హామీ పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గాలిపూర్‌, మగ్దుమ్‌పూర్‌ గ్రామాల్లోని ఉపాధి హామీ పనులను ఎంపిడివో రాములు నాయక్‌ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూలీలందరికి వందరూపాయల పనిచేస్తే 20 రూపాయలను ప్రభుత్వం కలిపి 120 రూపాయలు ఇస్తుందని అన్నారు. బినామి హాజర్లు వేస్తే కూలీలు నష్టపోతారని స్పష్టం చేశారు. ఎండాకాలంలో కూలీలకు జాగ్రత్త కోసం టెంట్లు, తాగునీరు, వైద్య సౌకర్యం కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి వందరోజులు పూర్తయినవారు తిరిగి ...

Read More »

ఘనంగా సైన్స్‌ దినోత్సవం

  కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్‌పిఆర్‌ పాఠశాలలో మంగళవారం సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రముఖ వైజ్ఞానిక వేత్త సర్‌ సి.వి.రామన్‌ జయంతి పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్‌ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాతావరణంలో మార్పులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం లాంటి అంశాలపై నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సైన్స్‌ సంబంధిత అంశాలపై క్విజ్‌, ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు ప్రదానంచేశారు. కార్యక్రమంలో ...

Read More »

నాలుగోవిడత నీటి విడుదల

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు హెర్తులుస్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ గేట్లద్వారా నాలుగోవిడత నీటి విడుదల చేస్తున్నట్టు ఇఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న లక్ష 15 వేల ఎకరాల్లో పంట సాగుచేసుకుంటున్నారని, పంటలు కాపాడేందుకోసం నీటి విడుదల చేస్తున్నామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని రైతులు నీటిని వృధా చేయకుండా పంటకు నీటిని అందజేయాలని సూచించారు. నాలుగోవిదత నీటిని పదిరోజుల పాటు విడుదల చేయడం జరుగుతుందని, పొదుపుగా ...

Read More »

జవహార్‌ నవోదయలో వైద్య శిబిరం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జవహార్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్తిని విద్యార్థులకు వైద్యురాలు స్పందన మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెలకోసారి విద్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 78 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగతా వారికి మందులను ఇవ్వడం జరిగిందన్నారు. ఆహారం తీసుకునేటపుడు చేతులు శుభ్రంగా కడుక్కొని పదార్థాలు తినాలని విద్యార్థులకు సూచించారు. శిబిరంలో ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు, ...

Read More »

మైనార్టీలకు పెద్దపీట

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు కరీం అన్నారు. పిట్లం మండల పరిషత్‌ కార్యాలయంలో రెసిడెన్షియల్‌ పాఠశాల క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిచ్కుంద మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందలో రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుచేసినట్టయితే నిరుపేద విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ...

Read More »

పరిశుభ్రత పాటించకుంటే రోగాల బారినపడతారు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పారిశుద్యం లోపించకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపిడివో రాములు నాయక్‌ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, కుళాయి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లోని మురికి కాలువలు ఎప్పటికప్పుడు పారిశుద్య సిబ్బంది శుబ్రం చేసి, తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. గ్రామాల్లో ...

Read More »

ధర్మోరాలో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం మండల కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో ఇంటింటికి తిరుగుతు ఇంటి పన్ను బకాయిలు చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలంటూ 41 వేల రూపాయలు వసూలు చేసినట్టు మండల కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, సాజన్‌కుమార్‌, కేశవనాథ్‌ స్వామి, రమేశ్‌, తిరుపతిరెడ్డి, కారోబార్‌ సాయన్న ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ బృందానికి కానిస్టేబుల్‌ను ...

Read More »

ప్రభుత్వ పథకాలపై కళాజాత

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, మల్లూరు జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో కళాకారులు కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, హరితహరం, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర సంక్షేమ పథకాలపై కళాబృందం విద్యార్థులకు అవగాహన కల్పించారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కళాకారులు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు ...

Read More »

వర్నిలో స్పెషల్‌డ్రైవ్‌

  వర్ని, ఫిబవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న బకాయిలన్ని చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. ఈ మేరకు వర్ని మండలంలోని శ్రీనగర్‌ కాలనీలో మంగళవారం కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటికుళాయి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా రూ. 17,500 వరకు పన్ను వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో కార్యదర్శులు అబ్బాగౌడ్‌, రాజేశ్‌, భాస్కర్‌, దీపిక, మోహన్‌రెడ్డి, పరిపూర్ణ పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ కస్తూర్బా విద్యాలయంలో 32 మంది 10వ తరగతి విద్యార్థినిలకు మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌ స్వచ్చందంగా పరీక్ష అట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్దిలో బాగంగా తనవంతుగా విద్యార్థులకు సేవలందిస్తున్నామన్నారు. విద్యార్థుల సమస్యల్ని తమ దృష్టికి తెస్తే ప్రశాంత్‌రెడ్డి యువసేన దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తామని ఉపసర్పంచ్‌ జెడి. గంగారెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ...

Read More »

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  – ఆర్డీవో వినోద్‌కుమార్‌ ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిలు అభివృద్ది సాధించాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆద్వర్యంలో తహసీల్దార్‌ పదవి నుంచి ఆర్డీవోగా పదోన్నతి పొందిన వినోద్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వివిధ వృత్తిదారులకు లబ్దిచేకూరుస్తుందని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని వృద్దిలోకి రావాలన్నారు. ఉద్యమ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన సూచించారు. ఉద్యోగ ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  వర్ని, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అంగన్‌వాడి టీచర్లకు వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ వర్ని మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి అంగన్‌వాడి టీచర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ శ్రమను గుర్తించి 7 వేలుగా ఉన్న వేతనాన్ని రూ. 10,500 లకు పెంచడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తమను కార్యకర్తలుగా కాకుండా టీచర్లుగా పిలవడం హర్షనీయమన్నారు. గత ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని, తెలంగాణ ...

Read More »

యోగాతో ఆరోగ్యం, ఆనందం

  నిజామాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు యోగాభ్యాసం చేయాలని, తద్వారా ఆరోగ్యాన్ని పొందాలని యోగ ప్రచారక్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు నిజామాబాద్‌ మండలంలోని ముదక్‌పల్లి గ్రామంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉచిత యోగా శిబిరం నిర్వహించినట్టు పేర్కొన్నారు. పతంజలి యోగ్‌పీఠ్‌ హరిద్వార్‌ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య నియమాల గురించి, స్వదేశీ వస్తువుల వాడకం గురించి తెలియజేస్తు మంగళవారం ...

Read More »