Breaking News

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

 

వర్ని, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అంగన్‌వాడి టీచర్లకు వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ వర్ని మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి అంగన్‌వాడి టీచర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ శ్రమను గుర్తించి 7 వేలుగా ఉన్న వేతనాన్ని రూ. 10,500 లకు పెంచడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తమను కార్యకర్తలుగా కాకుండా టీచర్లుగా పిలవడం హర్షనీయమన్నారు. గత ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్‌ ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగులకు గౌరవం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్‌వాడి టీచర్లు సుజాత, గంగామణి, పద్మ, సునీత, ప్రతిమ, లక్ష్మి, సావిత్రి, అనసూయ, తదితరులున్నారు.

Check Also

2021-22 సంవత్సరానికి పిఎల్‌పికి ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ...

Comment on the article