Breaking News

ముదిరాజ్‌లను బిసి-ఎలో చేరిస్తే ఉద్యమం

 

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి-బిలో ఉన్న ముదిరాజ్‌లను బిసి-ఎలోకి చేరుస్తు ప్రభుత్వం ప్రతిపాదించడం గర్హణీయమని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని బిసి-ఎ 43 కులాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. మంగళవారం దీన్ని నిరసిస్తూ కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టరేట్‌ కార్యాలయం చేరుకొని ధర్నా చేపట్టారు. కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్‌లను బిసి-ఎలోకి మార్చడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో బిసి-ఎకు సంబంధించి చాలా కులాలు, ఎస్సీ, ఎస్టీలుగా పరిగణిస్తే తెలంగాణ ప్రభుత్వం బిసి-ఎకు సంబంధించిన 43 కులాలకు అన్యాయం చేస్తుండడం ఎంతవరకు సమంజసమన్నారు. ముదిరాజ్‌లను బిసి-ఎలో కలపడాన్ని అంగీకరించమన్నారు. కార్యక్రమంలో వైద్యులు రమేశ్‌బాబు, పుట్టమల్లికార్జున్‌, జేఏసి ప్రతినిదులు మల్లేశ్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, జొన్నల నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article