Breaking News

మైనార్టీలకు పెద్దపీట

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు కరీం అన్నారు. పిట్లం మండల పరిషత్‌ కార్యాలయంలో రెసిడెన్షియల్‌ పాఠశాల క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిచ్కుంద మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందలో రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుచేసినట్టయితే నిరుపేద విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ప్రతాప్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article