Breaking News

ఉపాధి హామీ పనుల పరిశీలన

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గాలిపూర్‌, మగ్దుమ్‌పూర్‌ గ్రామాల్లోని ఉపాధి హామీ పనులను ఎంపిడివో రాములు నాయక్‌ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూలీలందరికి వందరూపాయల పనిచేస్తే 20 రూపాయలను ప్రభుత్వం కలిపి 120 రూపాయలు ఇస్తుందని అన్నారు. బినామి హాజర్లు వేస్తే కూలీలు నష్టపోతారని స్పష్టం చేశారు. ఎండాకాలంలో కూలీలకు జాగ్రత్త కోసం టెంట్లు, తాగునీరు, వైద్య సౌకర్యం కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి వందరోజులు పూర్తయినవారు తిరిగి పనిలోకి రావచ్చన్నారు. ఆయనవెంట టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాల్‌రాజు ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article