Breaking News

జాతివివక్షలా? జాత్యహంకారమా?

US
US

అగ్రరాజ్యంలో జాతివివక్షకు బీజం పడిందా? కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేపట్టిన విధివిధానాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నా యా?కేవలం అమెరికాఫస్ట్‌ నినాదంతో ముందుకుపో తున్న ట్రంప్‌ చివరకు ఆదేశ మీడియాపై కూడా నిషే ధాజ్ఞలు విధించేవరకూ వెళ్లారంటే తన పదవీకాలంలో ఏంచేసినా సహించాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది. పైగా అమెరికా ఫస్ట్‌ ముసుగులో ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యేకించి భారతీయులకే చేటుతెచ్చేవిగా ఉన్నాయి. ఈ విధానాలను వ్యతిరేకించిన వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పడేయడం ట్రంప్‌ పాలకవర్గానికి కొత్తేమీ కాదు. గతంలో కూడా అమెరికా అధ్యక్షులు కొందరు ఈ తరహా విధానాలు అవలంభించి పెద్దఎత్తున నిరసన వెల్లువ ఎగిసిపడటంతో ఉపసంహరించుకున్న సందర్భాలున్నా యి.ఇక తాజాగా ట్రంప్‌వ్యవహారశైలి జాత్యహంకార ధోరణినిసైతం పెంచేందుకు దోహదం చేసేదిగా ఉంది. వ్యాపార సామ్రాజ్యం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చిన ట్రంప్‌ దుందుడుకు విధానాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. విదేశీయులు వలసరావడం వల్లనే అమెరికా పౌరులకు ఉపాధి తగ్గిపోయిందని, వీరి వలసలపై ఆంక్షలు విధి స్తానని ముందునుంచీ చెపుతున్న ట్రంప్‌ ఖచ్చితంగా అదేపనిచేసి తాను ట్రంప్‌ అనిపించుకున్నాడు. చివరకు ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించిన మీడియా సంస్థలను సైతం శ్వేతసౌధం బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నదంటే మీడి యాను సైతం తన గుప్పిట్లోనికి తెచ్చుకోవాలన్న తహ తహ కనిపిస్తోంది.

తాజాగా శ్వేతసౌధంలో ప్రెస్‌సెక్రటరీ నిర్వహించిన సమావేశానికి కొన్ని పత్రికల ప్రతినిధులను రానీయకపోవడం ఇందుకు ఉదాహరణ. ది న్యూయార్క్‌ టైమ్స్‌,పొలిటికో,లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌, బజ్‌ఫీడ్‌ పాత్రి కేయులను రానీయలేదంటే ఆంక్షలేనని స్పష్టంఅవుతోం ది. ఆఫ్‌కెమేరా సంక్షిప్త సమావేశంగా అభివర్ణిస్తూ కొన్ని పత్రికలపై వేటు వేసేందుకే ట్రంప్‌ వర్గం నిర్ణయించిం దని రూఢిగా తెలుస్తోంది. రాయిటర్స్‌తో సహా పది వార్తాసంస్థల పాత్రికేయులను ఆఫ్‌కెమేరా సందేశంకోసం అనుమతించిన శ్వేతసౌధం బ్లూంబర్గ్‌, సిబిఎస్‌ పాత్రి కేయులు హాజరైన సమావేశంలో ట్రంప్‌కు షాకివ్వాలని నిర్ణయించిన మీడియాసంస్థలుమొత్తం వాకౌట్‌ చేశాయి. అయినా ఎక్కడా ట్రంప్‌ శ్వేతసౌధం చలించలేదు.

నిర్ది ష్టమైన అంశం వివరించదలిచిన సమయంలో ఎంపిక చేసిన మీడియాను పిలిచి ఇవ్వడం పరిపాటే. అయితే అన్ని వార్తాసంస్థల ప్రతినిధులు స్వేఛ్ఛగానే హాజరై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. నకిలీ వార్తలకు మూలం మీడియాయేనని, అమెరికా ప్రజలకు మీడియా యే ప్రధాన శత్రువని, కేవలం తనకు మాత్రమే కాదని ట్రంప్‌ పేర్కొని అమెరికన్లను సైతం రెచ్చగొట్టేప్రయత్నం చేసారని అంతర్జాతీయ నిపుణులు సైతం ఏకీభవి స్తున్నారు.ట్రంప్‌ వివాదాస్పద హెచ్‌వన్‌బి వీసాఆంక్షలు. ఏడు ముస్లిం దేశాల శరణార్ధులపై తాత్కాలిక నిషేధం, మెక్సికో సరిహద్దు వెంబడి గోడనిర్మాణం వంటివి ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా ట్రంప్‌ తన పనితాను చేసుకుపోతున్నారు. ప్రజలనుంచి వస్తున్న నిరసనను ఎత్తిచూపుతున్న మీడియాను అణగదొక్కే ప్రయత్నంగానే చెపుతున్నారు.

అమెరికాలోని కాన్సాస్‌ లో జరిగిన ఘటనపై కూడా ట్రంప్‌ స్పందించిన తీరు విచిత్రంగా ఉంది. తాను అమెరికాకు మాత్రమే అధ్యక్షు డినని, ప్రపంచానికి కాదని అన్నారు. అమెరికాలో పౌరు ల ఉపాధి కల్పనకు మరింతగా కృషిచేస్తామని చెపుతూ అంతకుముందు ఏడుగురు మృతిచెందిన సంఘటనపై విచారం వ్యక్తంచేసిన ట్రంప్‌ కాన్సాస్‌ సంఘటనలో భారతీయుని మృతి సంఘటనపై స్పందించకపోవడాన్ని ప్రవాసభారతీయుల్లోనే కాకుండా ఇతరదేశీయుల్లో కూడా ట్రంప్‌పై వ్యతిరేక వైఖరిని మరింతపెంచేటట్లు చేసింది. అమెరికా నావికాదళానికి చెందిన మాజీ ఉద్యోగి చేతిలో ప్రవాసాంధ్రుడు మృతిచెందిన సంఘటనకు ఎ లాంటి నిరసనను ప్రకటించలేదు. సరికదా ట్రంప్‌ అమె రికాపౌరుల రక్షణకోసం పనిచేస్తానని, అమెరికన్లకే ఉద్యో గాలు కల్పిస్తానని ప్రకటించారు. ప్రపంచం అంతా ఒకే గీతం, ఒకే కరెన్సీ, ఒకే జెండాలాంటివేమైనా ఉన్నాయా అంటూ ఎదురు ప్రశ్నలు వేసారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో జరిగిన తుపాకి కాల్పుల సంఘటనల్లో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన ట్రంప్‌ కాన్సాస్‌ సంఘటనను తేలిగ్గా తీసుకోవడంలో ట్రంప్‌ ఆంతర్యాన్ని అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తోంది.అసలు కాన్సాస్‌ ప్రాంతంలోనే హత్యలు ఎక్కువ. ఆదినుంచి కూడా వలస వచ్చినవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇక్కడి శ్వేతజాతీయులు గతంలో బ్రిటన్‌ ఇతర దేశస్తులపై అధికంగా దాడులు చేసేవారు ఇప్పడు ఇతర దేశాలపై సైతం దాడులకు పాల్పడుతు న్నారు. ప్రవాసాంధ్రునిపై జరిగిన కాల్పుల సంఘటనతో ఇపుడు శ్వేతజాతీయులు అక్కడి భారతీయులపైనే ఎక్కువ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.దీనికితోడు సమయం చిక్కినప్పుడల్లా ట్రంప్‌ నోటివెంట దురుసు వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడాకేవలం స్వదేశంలో ఒకవర్గాన్ని రెచ్చగొట్టేట్టు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక వలసలపై ఆంక్షల నేపథ్యంలో భారతీయులను అరెస్టులు చేయడం కూడా ప్రారం భించిన ట్రంప్‌ ప్రభుత్వం ప్రైవేటు జైళ్లపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. ఇదంతా వలసల ఆంక్షల నేపథ్యం లో వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రైవేటు జైళ్లు అవసరమన్న భావనతోనే ట్రంప్‌ ఈ నిషేధం ఎత్తి వేసినట్లు చెపుతున్నారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణ యాలు భారతీయులకు ఎంతచేటు తెస్తాయోనన్న ఆందో ళనలపై భారత్‌ సత్వరమే స్పందించాలి. లేని పక్షంలో జరిగే నష్టానికి మూల్యం కూడా చెల్లించుకోలేని పరిస్థి తులు ఎదురవుతాయనడంలో సందేహంలేదు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article