Breaking News

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

– ఆర్డీవో వినోద్‌కుమార్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిలు అభివృద్ది సాధించాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆద్వర్యంలో తహసీల్దార్‌ పదవి నుంచి ఆర్డీవోగా పదోన్నతి పొందిన వినోద్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వివిధ వృత్తిదారులకు లబ్దిచేకూరుస్తుందని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని వృద్దిలోకి రావాలన్నారు. ఉద్యమ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంక్షేమ సంఘం బలోపేతం చేసి బిసి ఉద్యోగుల పక్షాన నిలుస్తామన్నారు. కార్యక్రమంలో టిబిసి జిల్లా కార్యదర్శి నడ్కుడ రవి, జిల్లా కోశాధికారి రాంగిరి నర్సయ్య, యూత్‌ జిల్లా అధ్యక్షుడు గుడాల అరుణ్‌, సలీం, గగ్గుపల్లి శ్యామ్‌, ఆలూర్‌ రాము, రాజేశ్వర్‌, నర్సుబాయి, లావణ్య, అశోక్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ...

Comment on the article