మీ దేశానికి పో!

  • న్యూయార్క్‌ రైల్లో భారతీయ మహిళకు బెదిరింపు
  • అసభ్యకరమైన భాషలో తిట్టిన ఆఫ్రో-అమెరికన్‌
  • భారతీయుల ఇంటి గోడకు విద్వేష పోస్టర్‌
  • గోడలపై గుడ్లు విసిరి.. అశుద్ధం రాసి అరాచకం
 అమెరికాలో భారతీయులకు జాతి వివక్ష పరీక్షలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి! తాజాగా న్యూయార్క్‌ మెట్రో రైల్లో ఎక్తా దేశాయ్‌ అనే భారతీయ మహిళ, పక్కనే కూర్చున్న మరో ఏసియన్‌ ఈ తరహా విద్వేషాన్ని చవి చూశారు. ఆఫీసు పని పూర్తి చేసుకొని రైల్లో ఇంటికి బయల్దేరిన ఎక్తా దేశాయ్‌పై…స్నేహితుల గుంపుతో వచ్చిన ఒక ఆఫ్రో అమెరికన్‌ జాతి వివక్ష ప్రదర్శించాడు. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్న ఆమె తన మొహం మీదకు అమెరికన్‌ వచ్చి అరుస్తున్నా తొలుత పట్టించుకోలేదు. ప్రవర్తన తీవ్రంగా ఉండటంతో హెడ్‌ఫోన్లు తీసేసింది.
అప్పుడు వాడు ‘మీ దేశానికి వెళ్లిపో’ అని హూంకరించాడు. వెక్కిరించాడు. ‘నన్ను తాకొద్దు’ అని హెచ్చరించినా వినకుండా బెదిరిస్తూ.. భయపెడుతూ.. మీది మీది కొచ్చి సభ్యసమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరమైన భాషలో బూతులు తిట్టాడు. ఎక్తా దేశాయ్‌ రియాక్ట్‌ కాకపోవడంతో అతను పక్కనున్న ఆసియన్‌ మహిళ మీద తన తిట్ల ప్రతాపం చూపించాడు. అతడి విద్వేషాన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించిన ఎక్తా దేశాయ్‌ మొదట దాన్ని బయట పెట్టలేదు. కాన్స్‌సలో జాతి విద్వేష దాడిలో శ్రీనివాస్‌ మరణం తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అతను అసభ్యంగా ప్రవర్తించిన పావు గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారని, వారేమీ అతనిపై చర్య తీసుకున్నట్లు కనబడటం లేదని ఎక్తా తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.
 

అందరూ అలాంటోళ్లు కాదు
మరోవైపు.. భారతీయులు నివసిస్తున్న ఒక ఇంటిపై విద్వేషకారులు కోడిగుడ్లు విసిరారు. మలాన్ని ఇంటి గోడలకు పూసి.. ‘గోధుమ రంగు చర్మం గలవారు/ఇండియన్స్‌ ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అని రాసి ఉన్న విద్వేష పోస్టర్లను అంటించారు. అయితే.. ఆ ఇంట్లో ఉంటున్న భారతీయులు తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘అమెరికన్లందరూ ఇలాంటివారు కాదు. వాళ్లెవరో ఇలా చేశారుగానీ.. మా పొరుగునే ఉన్న అమెరికన్లే మా ఇంటిని శుభ్రం చేసుకోవడంలో సహాయపడ్డారు’’ అని వారు పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇలాంటి దాడులు మళ్లీమళ్లీ జరిగే ప్రమాదం ఉన్నదని మాత్రం వారు భయపడుతున్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *