Breaking News

ప్రభుత్వ పథకాలపై కళాజాత

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, మల్లూరు జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో కళాకారులు కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, హరితహరం, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర సంక్షేమ పథకాలపై కళాబృందం విద్యార్థులకు అవగాహన కల్పించారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కళాకారులు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్లు, కళాకారులు ఆకుల మహేందర్‌, రాములు, సవిత, భూంరెడ్డి, సతీష్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article