Breaking News

ఘనంగా సైన్స్‌ దినోత్సవం

 

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్‌పిఆర్‌ పాఠశాలలో మంగళవారం సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రముఖ వైజ్ఞానిక వేత్త సర్‌ సి.వి.రామన్‌ జయంతి పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్‌ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాతావరణంలో మార్పులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం లాంటి అంశాలపై నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సైన్స్‌ సంబంధిత అంశాలపై క్విజ్‌, ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు ప్రదానంచేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ మారుతి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article