Breaking News

ట్రంప్‌కు మీడియా ఫోబియా!

దీనివల్ల ఉపాధి పెరుగుతుందని ట్రంప్‌ పాలకవర్గం వాదనగా ఉంది. ఇక తాజాగా మరోసారి మీడియాను శత్రువుగా భావిస్తూ ట్రంప్‌ మరోసారి వివాదాల్లోకి వ చ్చారు. అమెరికా ప్రజల శత్రువు మీడియా అన్న వ్యాఖ్య లు ట్విట్టర్‌లో పొందుపరచడం ద్వారా మరోసారి వార్తల కక్కారు. ఫ్లోరిడాలోని మారాలోగోలో విశ్రాంతి తీసుకుం టున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. వరుసగా మూడోవారాంతంలో ట్రంప్‌ తన విశ్రాంతి దినాలను గడుపుతున్న సందర్భంలో 140అక్షరాలతోకూడిన ట్విట్ట ర్‌ వ్యాఖ్యలో అమెరికా ప్రజల ప్రధాన శత్రువు మీడియా అని వ్యాఖ్యానించడం పెద్ద సంచలనమైంది. అబద్దాల వార్తలు ప్రచారంచేసే మీడియా తనకు మాత్రమే శత్రువు కాదని అమెరికా ప్రజలందరికీ శత్రువేనని డొనాల్డ్‌ట్రంప్‌ మీడియాపై ముద్రవేసారు. ఆదేశంలోని న్యూయార్క్‌ టైమ్స్‌, సిఎన్‌ఎన్‌, ఎన్‌బిసివంటి ప్రముఖవార్తా సంస్థల నుద్దేశించే ఈ వ్యాఖ్యలుచేసారని అంచనా. మరికొన్ని మీడియాసంస్థలు కూడా ఇదే దారిలో వస్తున్నాయంటూ ట్రంప్‌ మీడియాపై ధ్వజమెత్తారు.

మరికొన్ని సంస్థలు, వ్యక్తులను తన శత్రువుల జాబితాలో చేరుస్తానని ప్రక టించిమరీ విస్మయం కలిగించారు. గతంలో కూడా అనేకమంది అమెరికా అధ్యక్షులు పత్రి కలను, మీడియాను విమర్శించిన సందర్భాలున్నాయి. అయితే ట్రంప్‌ భాషాప్రయోగం ఈ విమర్శలకు గతం లోని అమెరికా అధ్యక్షుల విమర్శలకు భిన్నంగా ఉంది. ఘాటైన పదజాలంతో ట్రంప్‌ మీడియాను దునుమా డారు. ట్రంప్‌ విమర్శలకు ప్రపంచవ్యాప్తంగా అంతర్జా తీయ నిపుణుల నుంచి సైతం ఖండనలు వెలువడ్డాయి. ఆయన లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందున మీడియాపై ముందునుంచీ ట్రంప్‌ కత్తికట్టే ఉన్నారని ఈ సంఘటన మరోసారి రుజువుచేసింది. తనపై విమర్శలు ఎక్కుపెట్టిన మీడియా సంస్థలు, జర్నలిస్టులను సైతం ట్రంప్‌ వదిలిపెట్టలేదు.ఇటీవల నిర్వహించిన తన మీడి యా సమావేశంకూడా ఇందుకు కేంద్రబిందువు అయిం దనే చెప్పాలి. 70 ఏళ్లకు చేరిన ట్రంప్‌ తన ప్రచారంలో ఎక్కువ భాగం మీడియా పక్షపాతంతో వెళుతున్నదన్న విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నెలరోజుల వ్యవధి పూర్తిచేసుకున్న తన పాలనపైమీడియా పక్షపా తంగా వ్యాసాలు రాస్తున్నదంటూ ట్రంప్‌ స్వయంగా విమర్శించారు. అంతేకాదు తనదైనశైలిలో ఘాటైన పద జాలంతో విమర్శలుచేసారు. నాలుగువారాల సంక్లిష్టపా లనలో ట్రంప్‌ తన జాతీయభద్రతా సలహాదారును తొల గించారు. కేబినెట్‌ నామినీని ఉపసంహరించారు. కొత్త వలసల విధానం న్యాయస్థానాల్లో విఫలమైంది. వీట న్నింటినీ పరిగణనలోకి తీసుకుని తనకు ప్రధాన శతృవు మీడియాయేనన్న భావనకు వచ్చిన ట్రంప్‌ తన విధివి ధానాల లోపాలను ఎత్తిచూపే సంస్థలన్నింటినీ ఇదే గాటన కట్టేశారని స్పష్టమవుతోంది. పాలనపగ్గాలు చేప ట్టిన తర్వాత మొదటిగా ట్రంప్‌ చేపట్టిన వీసా ఆంక్షల పరంగా ముందు భారతీయ ఐటిరంగానికే పెనుప్రమా దం ఉందని అంచనావేసారు.150బిలియన్‌ డాలర్ల భార తీయ ఐటిరంగం వీసాఆంక్షలు,హెచ్‌వన్‌బి వీసా పునఃస మీక్షలవల్ల కంపెనీలు ఎక్కువ జీతభత్యాలు చెల్లించాల్సి న అవసరం కలుగుతోంది. వీసాహోల్డర్లకు జీతాలపెంపు వల్ల భారతీయ కంపెనీలకు మరింత ఆర్థికభారం కలుగు తుందన్న వాదన నెలకొంది.

దీర్ఘకాలికంగా సవాలుగా మారుతుందని అంచనా. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, దిగువస్థాయి సాఫ్ట్‌వేర్‌ సేవలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహంలేదు. సుమారుగా 3.5 మిలియన్లమంది భారతీయ ఐటి నిపు ణులపై ప్రభావంచూపిస్తుంది. దీనివల్ల ఆటోమేషన్‌వైపు ఐటి కంపెనీలు పరుగులు తీస్తున్నాయి. ట్రంప్‌ వీసా ఆంక్షల ప్రభావం మధ్యకాలికంగా అనిశ్చితిని కొనసాగి స్తుందని నాస్కామ్‌ వంటి సంస్థలు సైతం విశ్లేషించా యి.ఇక భారతీయ ఐటిరంగంపరిస్థితి ఇలాఉంటే ముస్లిం దేశాలపై విధించిన నిషేధిత ఆంక్షలు కూడా ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు తావిచ్చాయి. తాజాగా 15కరీబి యన్‌ దేశాల కూటమి సైతం ట్రంప్‌ వివాదాస్పద విధా నాలు పర్యాటకంపై ఆధారపడి ఉన్న దేశాల ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని విమర్శించింది.వాణిజ్య ఆంక్షలు వంటి వాటితో మరింత వివాదం కావడం కంటే వేచిచూసే ధోరణి అవలంభిద్దామని కూటమి అభిప్రాయపడింది. మిలియన్లకొద్దీ కరీబియన్‌ దేశాలప్రజలు అమెరికాలో శాశ్వత నివాసితులుగా ఉంటున్నారు. వీరిలో తరచూ స్వదేశాలకు వెళ్లివస్తున్నారు.వీరంతా డాలర్లకొద్దీ నిధులు తమ కుటుంబీకులకు జమచేస్తున్నారు. తాజాగా ట్రంప్‌ విధానాలవల్లపర్యాటకరంగం దెబ్బతింటుందని, అంతేకా కుండా అమెరికాలోని తమ దేశీయులకు ఎక్కువ ప్రభా వం ఉంటుందన్న వాదన కరీబియన్‌ కూటమి నుంచి వస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే ముందు మీడియాపై ట్రంప్‌ విరుచుకుపడటం ప్రపంచ దేశాల నుంచి సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఆయన ఒక్కడే నాదేశం ఫస్ట్‌, అమెరికన్లు ముందు ఆతర్వాతే ఎవరైనా, ఏదైనా అంటున్న ట్రంప్‌ మీడియాను తన గుప్పిట్లోకి తె చ్చుకోవాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తున్నదని భా వించడంలో ఎటువంటి అతిశయోక్తికాదని చెప్పవచ్చు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article