Breaking News

Daily Archives: March 2, 2017

నెడ్ క్యాప్‌ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన స‌య్య‌ద్ అబ్దుల్ అలీం

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను నెడ్ క్యాప్‌ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన స‌య్య‌ద్ అబ్దుల్ అలీం క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎంపి క‌విత నివాసంలో అలీం త‌న అనుచ‌రుల‌తో క‌విత‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న నియామ‌కానికి కృషి చేసిన క‌విత‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసిఆర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని, నెడ్‌క్యాప్‌ను బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌న్నారు.అలీం.

Read More »

వ‌రంగ‌ల్‌లో పాస్ పోర్టు సేవా కేంద్రం

-ఎంపి క‌విత విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్రం మంజూరు వ‌రంగ‌ల్ లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేసింది. నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత విజ్ఙ‌ప్తి మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఎంపి క‌విత‌కు లేఖ రాశారు సుష్మ‌.వ‌రంగ‌ల్‌లో పాస్ పార్టు సేవా కేంద్రం అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ క‌విత ఇటీవ‌ల సుష్మాస్వారాజ్ కు లేఖ రాశారు. ప్ర‌ధాన పోస్టాఫీసు లో ఈ సేవా కేంద్రం ప‌నిచేయ‌నుంది. ఎంపి లేఖ వ‌ల్ల ...

Read More »

దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి

  గాంధారి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసీల్‌ కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌ అన్నారు. గురువారం గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో రికార్డులను ఆయన పరిశీలించారు. ఇదివరకు వచ్చిన సాదా బైనామ దరఖాస్తు విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులను గ్రామాల్లోకి వెళ్లి కుటుంబ సబ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలన్నారు. నకిలీ పాసుపుస్తకాల విసయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల్లో, నకిలీ పాసుపుస్తకాలపై ...

Read More »

మొబైల్‌ చెరుకు రసం

  నందిపేట, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్టకూటికోసం కోటి విద్యలు అన్నచందంగా వినూత్న రీతిలో మధ్యతరగతి నిరుద్యోగ యువకులు వ్యాపారం చేస్తున్నారు. ఏ వ్యాపారం చేసినా అందులో లాభం ఉంటే ఆ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి తరహాలోనే నందిపేటలో కొందరు నిరుద్యోగులు చేస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఓ నిరుద్యోగి రెండు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఆటో ఇంజన్‌తో తయారుచేసిన చెరుకు బండిపై గ్రామంలోని వాడవాడ తిరుగుతూ చెరుకు రసం విక్రయిస్తున్నాడు. అతని వ్యాపారాన్ని గమనించిన మరో నలుగురు ...

Read More »

మైనార్టీలకు పదవులకు కల్పించడం పట్ల హర్షం

  నందిపేట, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ బుధవారం ప్రకటించిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవుల్లో ఐదుగురు మైనార్టీ ఛైర్మన్లను నియమించడంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లానుంచి ఎస్‌.ఎ.అలీంను నెడ్‌ క్యాప్‌ (సంప్రదాయ ఇంధన వనరులశాఖ) ఛైర్మన్‌గా, మల్లిక్‌ మోసెసిమ్‌ఖాన్‌ను వక్ప్‌బోర్డు మెంబరుగా నియమించడంతో జిల్లాలోని మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిరోజులు నిర్లక్ష్యానికి గురైన ముస్లిం సమాజానికి తెలంగాణ ప్రభుత్వం సముచిత స్తానం ఇవ్వడం ఆనందదాయకమని జమాతె ...

Read More »

సిలిండర్‌ ధర పెంపు – ఇవేనా అచ్చేదిన్‌

  నందిపేట, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 8, 2016 నాడు కేంద్రంలోని మోడి ప్రభుత్వం ఒక్కసారిగా 500, 1000 నోట్లను రద్దుచేసిన ప్రభుత్వం, ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 90 పెంచి ప్రజలపై భారం వేసిందని ప్రజలు మండిపడుతున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పాతనోట్లను రద్దుచేశామని, మూడు, నాలుగు నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అచ్చేదిన్‌ వస్తాయని చెప్పిన ప్రభుత్వం తాజాగా సిలిండర్‌ ధర పెంచిందన్నారు. నల్లధనం బయటకు వస్తే బంగారం, భూముల దరలు తగ్గి పేద ...

Read More »

పరిమితికి మించి రవాణాపై డిటివోకు ఫిర్యాదు

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని లయోలా పాఠశాలకు సంబంధించిన బస్సులో పరిమితికి మించి విద్యార్థులను రవాణా చేయడంపై ఎన్‌ఎస్‌యుఐ నాయకులు గురువారం డిటివో దుర్గాప్రమీలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 నుంచి 35 సీట్ల పరిమితిగల బస్సులో 55 మంది విద్యార్థులను ఇరికించి తరలిస్తున్నారని పేర్కొన్నారు. బస్సులు ఆర్టీవో నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. అలాంటి బస్సులపై, యాజమాన్యలపై చర్యలుతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి సందీప్‌ ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 4వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుస్మ సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. నాన్‌ ప్లాన్‌ నిధులు రూ. 3.50 లక్షలతో ప్రగతి పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ జ్యోతి, అరికెల ప్రభాకర్‌ యాదవ్‌, ఎ.ఇ. గంగాదర్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు ఒత్తిడిలేని విద్య అందించాలి

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యనందించాలని కామారెడ్డి విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ అన్నారు. కామారెడ్డి ఐఎంఎ కార్యాలయంలో గురువారం ట్రస్మా జిల్లా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన మదన్‌మోహన్‌ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలు డిజిటల్‌ విద్యనందించడంలో ముందుండడం పట్ల వారిని అభినందించారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎన్‌.రెడ్డి, గౌరవాధ్యక్షుడు పాపిరెడ్డిలు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు నాణ్యమైన విద్యనందిస్తు మంచి సమాజాన్ని నిర్మించడంలో తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. ...

Read More »

గ్యాస్‌ధర పెంపుపై కాంగ్రెస్‌ నిరసన

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి సిలిండర్‌ ధరను మరోసారి పెంచడాన్ని నిరసిస్తు గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కట్టెల పొయ్యిపై వంటచేసి నిరసన వ్యక్తం చేశారు. మోడి గారు ఇక మాకు కట్టెల పొయ్యే దిక్కా అని ప్రశ్నించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతంగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ పద్మ, నాయకులు ...

Read More »

గాంధీ విగ్రహం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ధర్నా

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్తినిలపై ఏబివిపి దాడులు చేయడం గర్హణీయమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హెచ్‌సియు మొదలుకొని ఓయు వరకు తమ భావజాలవ్యాప్తి కోసం యూనివర్సిటీల్లో ఏబివిపి కార్యకర్తలతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలో దాడులు ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఏఓల వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తంచేస్తు గురువారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 500 వేతనంతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరి చేస్తున్నామని తమ బాధలను గుర్తించిన సిఎం కెసిఆర్‌ వేతనాలు పెంచడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, కౌన్సిలర్‌ రేణుక, తదితరులు ...

Read More »

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8,126 మంది విద్యార్థులకు గాను 327 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 7799 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు.

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలోని తెలంగాణ తిరుమల ఆలయంలోశుక్రవారం నుంచి వారంరోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి దివ్య మంగళాశాసనములతో వారంరోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణం, ఉత్సవ అనుజ్ఞ, శ్రీవిశ్వక్సేనారాధన, ఫుణ్యాహవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలుంటాయన్నారు. శనివారం చినజీయర్‌ స్వామివారిచే తీర్థగోష్టి, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట ఉంటాయన్నారు. ఆదివారం శాంతిపాఠం, ద్వార ...

Read More »

విద్యావనరుల కేంద్రంలో ఫిజియో థెరఫి

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం అంగవైకల్య, మానసిక విద్యార్థిని విద్యార్థులకు ఫిజియో థెరఫి వైద్యం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు వ్యాయామ అంశాలను నేర్పించారు. మానసిక, చెవిటి, మూగ విద్యార్థుల కొరకు ఆరోగ్య సూచనలు చేశారు. ప్రతినెల, ప్రతి వారం ఫిజియో థెరఫి వైద్యం అందజేస్తున్నట్టు ఎంఇవో గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో వైద్యుడు లక్ష్మణ్‌, బాలమణి, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధి కూలీలకు పని దినాలు కల్పించండి

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కూలీలకు పని దినాలు కల్పించాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ప్రతిరోజు పని కల్పించాలని అందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను తమ గ్రామంలో పనులు గుర్తించాలన్నారు. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తున్నందున ఉపాధి కూలీలు పనిచేసే చోట తాగునీరు, టెంట్లు, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉపాధి కూలీల ...

Read More »

జీవన్‌జ్యోతి చెక్కు అందజేత

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామ సహకార సంఘంలో పురం గాండ్ల అంజవ్వకు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకం కింద రూ. 2 లక్షల చెక్కును సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ అందజేశారు. అంజవ్వ భర్త సహకార సంఘంలో సభ్యుడై ఉన్నాడని గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో, సహకార సంఘం బీమా పథకం కింద 2 లక్షలు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డిసిసి మేనేజర్‌ శ్రీనివాస్‌, గోపి, మధు, తదితరులు ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి రుణపడి ఉంటా

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీకి రుణపడి ఉంటానని యువజన కాంగ్రెస్‌ నాయకుడు అబ్దుల్‌ హైమద్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సోషల్‌ మీడియా బాన్సువాడ అసెంబ్లీ కో ఆర్డినేటర్‌గా నియమించినందుకు కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకొరకు కృషి చేస్తానన్నారు. గురువారం టిపిసిసి కార్యదర్శి దీపక్‌జెన్‌ సోషల్‌ మీడియా బాన్సువాడ అసెంబ్లీ కో ఆర్డినేటర్‌గా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు మాట్లాడుతూ పార్టీకి సేవలందించిన ...

Read More »

చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బైరాపూర్‌ గ్రామానికి చెందిన కుర్మ సునీత (27) అనే వివాహిత బుధవారం సాయంత్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బైరాపూర్‌ గ్రామానికి చెందిన మృతురాలు బుధవారం ఇంట్లో గొడవల కారణంగా బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి రాత్రి వరకు తిరిగి రాలేదన్నారు. మృతురాలి తల్లిదండ్రులైన పోతంగల్‌ గ్రామానికిఫోన్‌ చేయగా ఇంటికి రాలేదని చెప్పగా మృతురాలి భర్త బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌లో ...

Read More »

మైనార్టీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

  బీర్కూర్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ గురుకుల పాఠశాలలో 5,6,7 వ తరగతుల ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌ కుమార్‌ అన్నారు. కామారెెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో కలిపి 12 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయని మొత్తంగా 3120 సీట్లు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 5,6,7 తరగతుల ప్రవేశానికి మైనార్టీ విద్యార్థిని, విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని , ఈ అవకాశాన్ని ...

Read More »