Breaking News

ముఖాన్ని కొరికేసిన ముస్లిం వ్యతిరేకి

అమెరికాలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేయకముందే.. అంటే గతేడాది నవంబరు 27న ముస్లిం వ్యతిరేక దాడి జరిగింది. ముస్లింలపై విద్వేషంతో రగిలిపోతున్న 35 ఏళ్ల అమెరికన్‌ ఓ వ్యక్తిని ముఖంపై కొరికేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని సోమవారం అరెస్ట్‌ చేశారు. వర్జీనియా రాష్ట్రంలోని మెక్‌లీన్‌లో ఓ పార్కింగ్‌ స్థలం వద్ద రాబిన్‌ మెక్‌ గ్రీర్‌ అనే వ్యక్తి 31 ఏళ్ల వ్యక్తి వద్దకు వెళ్లి బెదిరించాడు. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో గ్రీర్‌ ఎదుటి వ్యక్తి ముఖాన్ని కొరికేసి పారిపోయాడు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *