Breaking News

Daily Archives: March 3, 2017

సిపిఎస్‌ అంతమే లక్ష్యంగా పనిచేయాలి

  గాంధారి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానం అంతమే లక్ష్యంగా ఉద్యోగులు ఉద్యమం చేపట్టాలని టిఎస్‌సిపిఎస్‌ఇఎ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు మహేశ్‌లు అన్నారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో సిపిఎస్‌ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2004 నుంచి ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి భవిష్యతు లేదన్నారు. సర్వీస్‌ పూర్తి అంధకారంలో ఉందన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా సాయిలు, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్‌ రాథోడ్‌, ...

Read More »

రైతులకు అవగాహన కార్యక్రమం

  గాంధారి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయంలో చేపట్టాల్సిన మెళకువలపై జిల్లా వ్యవసాయ సహాయ అధికారి బీన అవగాహన కల్పించారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్‌ గ్రామంలోని ఎస్‌సి కమ్యూనిటీ హాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు శిక్షణా కేంద్రం నిజామాబాద్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో యాదగిరి, టెక్నికల్‌ ఎవో శ్వేత, రైతులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  బీర్కూర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ ఛైర్మన్‌ శంబురెడ్డి దంపతులు హాజరయ్యారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, పూర్ణకుంభం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వారంరోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అదికారులకు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిల వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు శుక్రవారం అంగన్‌వాడి కార్యకర్తలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంగన్‌వాడి టీచర్ల, ఆయాల వేతనాలు పెంచి ముఖ్యమంత్రి తమ పాలిట దైవంలా నిలిచారన్నారు. తాము జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, అంగన్‌వాడిలు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వైద్యాధికారులను, హెల్త్‌, అంగన్‌వాడి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబరులో జరిగిన హెల్త్‌ కన్వర్జెన్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణీలను ప్రోత్సహించి తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గర్భిణీల వివరాలు సేకరించి అనుగుణంగా వారితో మాట్లాడి అక్కడే ప్రసవాలు చేయించాలన్నారు. ఎటువంటి ప్రసవాలు జరగని హన్మాజిపేట, డోంగ్లీ, అన్నారం, మత్మల్‌, ...

Read More »

చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలి

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు రబీ పంటకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలని ప్రబుత్వ ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదల శాఖ ఎస్‌.ఇ. జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రాజెక్టులు, నీటి పారుదలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయాధికారులు సమన్వయంతో పనిచేసి నీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు నీరందుతున్న తీరుపై ...

Read More »

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ప్రతి శుక్రవారం హరితహారం కింద నాటిన మొక్కలకు నీరు పోసి అవి చనిపోకుండా చర్యలు తీసుకునేందుకు వాటర్‌ డే పాటించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయన కలెక్టరేట్‌ ప్రాంగణంలోని మొక్కలకు స్వయంగా నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీరు పోయడమే గాకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యాలయాలు, ...

Read More »

వెల్మల్‌ ఎంపిటిసి స్థానానికి ముక్కోణపు పోటీ

  నందిపేట, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని వెల్మల్‌ -1 ఎంపిటిసి స్థానానికి ముగ్గురు అభ్యర్థిలు బరిలో ఉన్నారు. బిసి మహిళ రిజర్వు ఉన్న స్తానానికి తెరాస తరఫున ఐలి లక్ష్మి, కాంగ్రెస్‌ తరఫున పొలాస సునీత, టిడిపి నుంచి సాదుల రాజమణి పోటీలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల నాయకులు ఈ ఎన్నికను ప్రతిస్టాత్మకంగా తీసుకుంటున్నారు. అధికార తెరాస పార్టీకి చెందిన మహిళా ఎంపిటిసి మృతి చెందడంతో ...

Read More »

పంటపొలాలకు నీరందించాలని తహసీల్దార్‌ ఘెరావ్‌

  బీర్కూర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రధాన కాలువ నుండి నీటిని వదలడంతో తమ ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయని నీటిని బీర్కూర్‌, బైరాపూర్‌ మల్లించాలని తహసీల్దార్‌ను ఘెరావ్‌ చేశారు. బీర్కూర్‌ ఆయకట్టు ప్రాంతంలో చెరువులో నీటి నిలువ లేదని, పొలాలు ఎండిపోతున్నాయని, కాలువ ద్వారా బీర్కూర్‌కు ముందుగా వదలాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరడంతో తహసీల్దార్‌కు ఈ విషయాన్ని వివరించారు. బైరాపూర్‌ గ్రామస్తులు బీర్కూర్‌కు వదలకుండా అడ్డుకుంటున్నారని తహసీల్దార్‌కు వివరించారు. స్థానికంగా చెరువు ...

Read More »

ప్రభుత్వ విప్‌ను కలిసిన ట్రస్మా ప్రతినిదులు

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రయివేటు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా ప్రతినిధులు) శుక్రవారం ప్రభుత్వ విప్‌, కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలిశారు. నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ప్రయివేటు పాఠశాలలో యజమానుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, ప్రతినిధులు రాజశేఖర్‌, చారి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి ధర్నా

  కామారెడ్డి, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఏఐటియుసి ఆద్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కన్వీనర్‌ బాల్‌రాజు మాట్లాడుతూ గత మూడునెలలుగా ఆసుపత్రి కాంట్రాక్టు పారిశుద్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం శ్రమ దోపిడికి పాల్పడుతుందని ఆరోపించారు. పారిశుద్య కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచి చెల్లించాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

ఉద్యోగమేళ సద్వినియోగం చేసుకోండి

  నందిపేట, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈనెల 5వ తేదీన ఆర్మూర్‌లో నిర్వహించనున్న ఉచిత ఉద్యోగ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జీవన్‌రెడ్డి యువసేన ఆర్మూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్‌ పత్రికా ప్రకటనలో కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ అంతర్జాతీయ సంస్థలతో మేళ నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. 8వ తరగతి నుంచి పిజి, ఇంజనీరింగ్‌, డిగ్రీ చదివిన వారు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. ఆర్మూర్‌లోని నరేంద్ర కళాశాలలో ...

Read More »

చివరిఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలి

  బీర్కూర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ కెనాల్‌ ద్వారా అందించే నీటిని బీర్కూర్‌ మండలంలోని చివరి ఆయకట్టు వరకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని 25, 26, 27 డిస్ట్రిబ్యూటరీ కాలువలపై మంత్రి శుక్రవారం పర్యటించారు. అన్ని డిస్ట్రిబ్యూటర్లను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తు రైతులు, అధికారులు, ప్రజాప్రతినిదులతో స్థానికంగా సమావేశమవుతూ నీటిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. నీరు వృదా కాకుండా ఆయా ...

Read More »

పాఠశాలకు వాటర్‌ఫ్రిజ్‌ అందజేత

  బీర్కూర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ జడ్పిహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బీర్కూర్‌ బ్యాంక్‌ క్యాషియర్‌ విజయ్‌కుమార్‌ వాటర్‌ ఫ్రిజ్‌ను విరాళంగా అందజేశారు. వేసవి సమీపిస్తున్నందున పాఠశాల విద్యార్థులకు చల్లని నీటిని అందించాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌ను అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, బ్యాంకు మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉచిత పశువైద్య శిబిరం

  బీర్కూర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మల్లాపుర్‌ గ్రామంలో అధికారులు శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశు వైద్య శిబిరంలో పశువులకు నట్టల నివారణ కోసం మందులు పంపిణీ చేశారు. మొత్తం 88 పశువులకు వైద్య చికిత్సలు చేసినట్టు వైద్యాధికారి సురేశ్‌కుమార్‌ తెలిపారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  నిజాంసాగర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో విఎఓల వేతనాలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండివో కార్యాలయం ముందు శుక్రవారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. గ్రామాల్లో సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మండల అధ్యక్షురాలు రాధ, విఏఓలు శ్రీకాంత్‌, రాజు, సిబ్బంది ఉన్నారు.

Read More »

కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌

  నిజాంసాగర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో ఇంటి పన్ను వసూలు కోసం చేపట్టిన కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా రెండు మినహా మొత్తం గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలు కోసం పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. మండలంలో పంచాయతీ కార్యదర్శి రఘుపతిరెడ్డి ఆద్వర్యంలో రూ. 10,700 వసూలు చేసినట్టు తెలిపారు. కార్యదర్శి క్యాసప్ప ఆద్వర్యంలో సుంకిపల్లి గ్రామంలో పన్ను వసూలు చేశారు. రూ. 8,342 వసూలైనట్టు ఆయన ...

Read More »

స్వయం పరిపాలన దినోత్సవం

  నిజాంసాగర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జక్కాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో స్వయంపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 53 మంది విద్యార్థులుండగా 5వ విద్యార్తిని, విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా చక్కగా పాఠాలు బోధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాశీనాథ్‌, సాయిప్రసాద్‌ ఉన్నారు.

Read More »

బాధిత కుటుంబానికి సిఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు

  మోర్తాడ్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోంచంద గ్రామానికి చెందిన నర్సుబాయి అనే బాధిత కుటుంబానికి సిఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. లక్ష ఆర్తిక సహాయం మంజూరుచేసినట్టు తెరాస రైతు విభాగం అధ్యక్షుడు సోంరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పేట నర్సుబాయి ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ పోషణకై గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే లక్ష రూపాయలు మంజూరు చేయించారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

జలవిద్యుత్‌ కేంద్రంలో సాంకేతిక లోపం

  – విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం నిజాంసాగర్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్లకు అనుసంధానంగా ఉన్న హెర్తులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో 2వ టర్బయిన్‌ ఆయిల్‌ పంపులో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్‌ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడింది. దీంతో జెన్‌కో ఎడిఇ శ్రీకాంత్‌ వెంటనే సిబ్బందితో మరమ్మతులు రాత్రికి రాత్రే చేసే ప్రయత్నం చేసినా సాంకేతిక లోపం సరికాలేదు. జెన్‌కో సిబ్బందితోపాటు ఎడిఇ అక్కడే ఉండి హుటాహుటిన మరమ్మతులు చేయించడంతో సమస్య పరిష్కరించి ఉత్పత్తి ...

Read More »