Breaking News

Daily Archives: March 4, 2017

వ్యక్తిగత మరుగుదొడ్లు నెలాఖరులోపు పూర్తిచేయాలి

  గాంధారి, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలం మాతుసంగం గ్రామంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను ఎండివో సాయాగౌడ్‌ శనివారం పరిశీలించారు. గ్రామంలో ఇదివరకే 400 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 80 మరుగుదొడ్లకు మంజూరు చేశామన్నారు. వీటిని ఈనెలాఖరులోపు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఎండివో అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండలంలో వివిధ గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మరుగుదొడ్ల వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు నిర్మించే విధంగా చూడాలని ఆయా ...

Read More »

మొక్కలకు నీరుపోయండి

  నిజాంసాగర్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయం ఆవరణలో ఎంపిడివో రాములు నాయక్‌ శనివారం మొక్కలకు నీరుపోశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు పెంచడం జరిగిందని, ఎండాకాలం వస్తున్నందున మొక్కలు ఎండిపోకుండా ప్రతి ఒక్కరు మొక్కకు నీరందించి సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతిరోజు ఒక్కమొక్కకు నీరందిస్తే అది పెద్దదిగా మారి గాలినిస్తుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎపివో సుదర్శన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ, సర్పంచ్‌ బేగరి రాజు, ...

Read More »

బేడీలమ్మ మైసమ్మ జాతర

  నిజాంసాగర్‌. మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామ శివారులోగల బేడీల మైశమ్మ ఆలయం వద్ద ఈనెల 5వ తేదీన ఆదివారం బోనాల పండగ నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ పట్లోల్ల లక్ష్మి తెలిపారు. అదేవిధంగా సోమవారం కుస్తీ పోటీలు ఏర్పాటుచేశామని సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి తెలిపారు. పోటీలకు మల్లయోధులు తరలిరావాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు.

Read More »

విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

  నిజాంసాగర్‌. మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో 10వ తరగతి విద్యార్థులు 89 మందికి అదే గ్రామానికి చెందిన రాజన్న యువసేన ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి, పరీక్షలు రాసి మండలానికి ప్రథమ స్థానం తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమర్‌సింగ్‌, యువసేన సభ్యులు నాయకులు వాజిద్‌ అలీ, దఫేదార్‌ విజయ్‌ ఉన్నారు.

Read More »

ఉపాధి పనుల పరిశీలన

  నిజాంసాగర్‌. మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. 17 గ్రామ పంచాయతీల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 6300 మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తికావడంతో ఉపాధి హామీ పనులకు కూలీలు వస్తున్నారని అధికారులు అంటున్నారు. అడవుల్లో కందకాలు తవ్వే పనులు చేస్తున్నారు. హసన్‌పల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపిడివో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మస్లర్ల ప్రకారం కూలీల హాజరు సేకరించాలని, బినామి కూలీలకు ...

Read More »

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

  నిజాంసాగర్‌. మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. 7వ తరగతి చెందిన 16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థులకు 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్‌బిహెచ్‌ మేనేజర్‌ సౌరబ్‌కుమార్‌, సిఆర్‌పిలు భాస్కర్‌గౌడ్‌, సంతోష్‌ ...

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో రెండోరోజు బ్రహ్మోత్సవాలు

  బీర్కూర్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లోని తెలంగాణ తిరుమల ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండోరోజు శనివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చినజీయర్‌ స్వామివారిచే తీర్థగోష్టి, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దంపతులు, ఆలయ కమిటీ ఛైర్మన్‌ శంబురెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి పల్లకీసేవ, హారతి, తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ...

Read More »

చేతులెత్తేసిన ప్రతిపక్ష ఎంపిటిసి అభ్యర్థులు

  నందిపేట, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని వెల్మల్‌ – 1 ఎంపిటిసి స్థానానికి ఈనెల 7 న జరగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పొలాస సునీత, టిడిపి అభ్యర్థి సాదుల రాజమణి అనూహ్య పరిణామాల మధ్య పార్టీ కండువాలు మార్చి శనివారం ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తెరాసలో చేరడంతో తెరాస అభ్యర్థి ఐలి లక్ష్మికి పోటీ ...

Read More »

అగ్నిప్రమాద బాధితునికి చెక్కు అందజేత

  బీర్కూర్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌ గ్రామనికి చెందిన సింగన్‌వార్‌ భూదేవికి ప్రమాదవశాత్తు బీమా పథకం కింద నసురుల్లాబాద్‌ తహసీల్దార్‌ డేవిడ్‌ రూ. 4 వేల చెక్కు అందజేశారు. గత ఫిబ్రవరిలో భూదేవి పెంకుటిల్లు ప్రమాదవశాత్తు పాక్షికంగా కాలిపోవడంతో నష్టపరిహారం కింద ఆర్థిక సాయం అందించినట్టు తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో బుడ్డె గంగాధర్‌, మిర్జాపూర్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

  బీర్కూర్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పురుషులతో సమానంగా పోటీపడాలని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నసురుల్లాబాద్‌ మండలంలోని పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారతకు కృషి చేయాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు గ్రామ ప్రధాన వీధుల గుండా మహిళల అభివృద్ది గురించి నినాదాలు పలికారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమంలో భాగంగా నసురుల్లాబాద్‌ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు ...

Read More »

అభివృద్ది పనులకు శంకుస్థాపన

  జగిత్యాల, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల మండలంలో తక్కళ్లపల్లిలో రూ. 2 కోట్ల వ్యయమయ్యే చెక్‌డాం కమ్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. తరువాత ఎమ్మెల్యేకార్యాలయ నిర్మాణం రూ. కోటి వ్యయంతో, ఎంపిడివో కార్యాలయ నిర్మాణ పనులకు కూడా ఎంపి శంకుస్థాపన చేశారు. తరువాత పోరండ్ల, థరూర్‌, మోడపల్లి గ్రామ పంచాయతీల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షలు వ్యయం అవుతాయని, రూ. 40 లక్షల ...

Read More »

కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్దికి కృషి చేస్తా

  – నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత జగిత్యాల, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమయిన కొండగట్టు ఆంజనేయస్వామిని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ, కరీంనగర్‌ జడ్పి ఛైర్మన్‌ తుల ఉమతో కలిసి ఎంపి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అబివృద్దికి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా అవసరమయ్యే సుమారు 12 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆలయ ఈవో, ఎమ్మెల్యే శోభలు ఎంపి కవితకు అందజేశారు. బంగారు తెలంగాణ సాధనకు ...

Read More »

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  మోర్తాడ్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉత్సాహంతో పనిచేయాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, ఏపిఎంల రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, మోర్తాడ్‌ ఎపిఎం ప్రమీల అన్నారు. మోర్తాడ్‌లో శనివారం ఐకెపి ఆధ్వర్యంలో మండల వివోలు, సిఎలు, సిసిలతో సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు ఐకెపి అధికారులు, సిబ్బంది, విఓ, సిఎలను పట్టించుకోలేదన్నారు. తెరాస సిఎం కెసిఆర్‌ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ...

Read More »

గోదావరి, కృష్ణ జలాలతో రైతు పాదాలు కడుగుతాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని, గోదావరి, కృష్ణ జలాలతో తెలంగాణ రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ యేడాది కురిసిన వర్సాలకు నిజాంసాగర్‌లో పూర్తిస్తాయి నీటిమట్టం వచ్చిందన్నారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ కూడా యాసంగిలో ఇంత ఆయకట్టుకు ...

Read More »