Breaking News

భారతీయులకు డబ్బులెలా వచ్చాయ్‌?

  • ఇక్కడున్న అమెరికన్లందరికీ ఏమైంది?
  • భారత గుంపు అమెరికాను ఆక్రమిస్తోంది
  • ఓహియోలో అమెరికన్‌ వీడియో!
 అమెరికాలో భారతీయులకు మరో ఆందోళనకర పరిణామం. ఓ అమెరికన్‌.. ‘‘ఇక్కడ భారతీయులు తమ ఉద్యోగులను కొల్లగొట్టేస్తున్నారని’’ పేర్కొంటూ.. ఓ పార్కులో ఉన్న భారతీయ కుటుంబాలను రహస్యంగా వీడియో తీసి ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వెలుగులోకి రావడం.. ఇందులో అతను భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం.. తదితర పరిణామాలు ఇక్కడున్న భారతీయులను మరింత ఆందోళనలోకి నెట్టేశాయు. గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్న భారతీయులపై విద్వేష దాడులు పెరిగిన నేపథ్యంలో అక్కడున్నవారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
    ఈ నేపథ్యంలో బజ్‌ఫీడ్‌ న్యూస్‌.. భారతీయుల పై తీసిన వీడియోను వెలుగులోకి తెచ్చింది. ఈ వీడియో సేవ్‌అమెరికన్‌ఐటీజాబ్స్‌.ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసి ఉన్నట్లు వివరించింది. ఓహియో పార్క్‌లో భారతీయ కుటుంబాలు ఆడుకుంటుండగా.. 66 ఏళ్ల అమెరికన్‌ రహస్యంగా ఈ వీడియో తీశాడు. భారతీయులు అమెరికాను కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో నిడివి 2:49 నిమిషాలు. ఈ వీడియో తీసిన వ్యక్తిని వర్జీనియాకు చెందిన కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ స్టీవ్‌ పుషర్‌గా గుర్తించారు. ఈ వీడియోలో… పార్కులో ఆడుకుంటున్న పిల్లలు, ఇండియన్‌ కుటుంబాలను చూపిస్తూ ‘‘ఈ ఇండియన్‌ గుంపు అమెరికాలో మధ్య పశ్చిమ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటోంది. నేనిప్పుడో ప్రశ్న అడుగుతాను.. వీరికి (ఇండియన్స్‌కి) డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్‌.. ఇక్కడ జీవించే అమెరికన్లందరికీ ఏమైంది… అని ప్రశ్నించాడు.
   ‘‘ఇది మంచో చెడో నేను చెప్పదలచుకోలేదు. ఇక్కడ ఉద్యోగాలు సాధించి.. పని చేస్తున్న వీరిని చూస్తుంటే.. నాకు చాలా ఆవేదన కలుగుతోంది.’’ అని పేర్కొన్నాడు. కొందరు ఇండియన్స్‌ వాలీబాల్‌ ఆడుతుండగా.. దాన్ని షూట్‌ చేస్తూ.. ‘‘ఈ ఇండియన్‌ గుంపు గతేడాది వరకు క్రికెట్‌ ఆడేది. ఇప్పుడు వాలీబాల్‌ ఆడుతోంది. వీరు అమెరికన్ల జీవన విధానంవైపు మళ్లుతున్నారు. వీరు గతేడాది.. అంతకు ముందు ఏడాది ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కొల్లగొట్టేశారు. ’’ అని వ్యాఖ్యానించాడు. పుషర్‌ బజ్‌ఫీడ్‌ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఓహియోలో ఉన్న ఐటీ ఉద్యోగులు, నిపుణులు తమ ఉద్యోగాలను ఈ విదేశీయుల వల్ల కోల్పోయారు… దాన్ని ఎత్తి చూపాలనుకున్నాను’’ అని వెల్లడించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *