Breaking News

Daily Archives: March 8, 2017

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున రాథోడ్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలు నేడు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడి నెగ్గుకొస్తున్నారన్నారు. ఇటీవల రియో ఒలింపిక్స్‌లో పి.వి.సిందు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌ అద్భుత ఆటతీరుతో దేశ ప్రతిష్టను నిలిపారన్నారు. మహిళలు సామాజిక, ...

Read More »

మహిళలపై దాడులకు పాలకవర్గాలే కారణం

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలపై జరుగుతున్న దాడులకు, లైంగిక వేదింపులకు పాలకవర్గాలే కారణమని వక్తలు అన్నారు. తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రముఖ రచయిత సుమిత్రానంద్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భూస్వామ్య, సామ్రాజ్యవాద భావజాలాలే స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు కారణమన్నారు. నాడు స్త్రీని శృంగార సాధనంగా చూస్తే, నేటి సంస్కృతిని స్త్రీని సరుకుగా మార్చిందని ...

Read More »

భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తు చనిపోయిన వారి కుటుంబాలకు బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ చెక్కులు పంపిణీ చేశారు. ఏడుగురు బాధిత కుటుంబాలకు పి.లక్ష్మి, బాలరాజవ్వ, డి.లక్ష్మి, ఎం.రాధ కుటుంబాలకు ఒక్కొక్కరికి 80 వేలు, శోభకు 30 వేలు, జి. లింగం కుటుంబానికి 2 లక్షలు, కె.ధర్మయ్య కుటుంబానికి లక్ష చొప్పున అందజేశారు. కార్యక్రమంలో సహాయ కార్మిక కమీషనర్‌ దేవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 10వ వార్డులో బుధవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2.50 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కైలాష్‌ లక్ష్మణ్‌రావు, నిమ్మ దామోదర్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావు, ఎంఇ భూమేశ్వర్‌, ఎ.ఇ. జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలి

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, వివేకానంద, పిఆర్‌టియు టిఎస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ స్త్రీ ఔన్నత్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభివృద్దికి చేయాల్సిన పనులు తదితర అంశాలపై మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీతోపాటు పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిఇవో ...

Read More »

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌ పాఠశాలలో బుధవారం విద్యార్థులే ఉపాధ్యాయులై స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఇతర విద్యార్థులకు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ ఆనంద్‌రావు, ప్రధానోపాధ్యాయులు గంగరాజం, పర్యవేక్షకుడు యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

కుటుంబ జీవితంలో బేషజాలు వద్దు

  కామారెడ్డి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ జీవితంలో బేషజాలు ఉండొద్దని, కలిసికట్టుగా ఐకమత్యంతో జీవితాలు కొనసాగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం సొసైటీ ఫర్‌ రిహాబిలిటేషన్‌ కౌన్సిలింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కుటుంబ స్నేహిత డివిజనల్‌ కౌన్సిలింగ్‌ కేంద్రాల ద్వారా ఆనందమయ కుటుంబాలను పునర్‌నిర్మించే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు, పెళ్లి చేసుకోబోయే దంపతులకు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్దిదారులకు ఆనందమయ జీవితం గడిపేందుకు ...

Read More »

మహిళ సాధికారత సాధించాలి

  ఆర్మూర్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంటింటికే పరిమితమైన మహిళ నేటి ప్రపంచంలో తాను ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్‌ అన్నారు. బుధవారం ఆర్మూర్‌ మండలం మిర్దాపల్లిలో బిసి మహిళ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా విజయం సాధిస్తున్నప్పటికి భర్తచాటు భార్యగానే వ్యవహరిస్తున్నారని, స్వతహాగా మహిళ తన హక్కులను తెలుసుకొని ముందడుగు వేస్తుందో అప్పుడే మహిళ ...

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు వ్యాయామ చికిత్సలు అందజేశారు. ఇందులో భాగంగా స్థానిక భవిత సెంటర్‌లో డాక్టర్‌ మహేశ్‌ దివ్యాంగులైన విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడిపించడం, బోర్ల పడుకోబెట్టడం, గోడకు ఒరగ కూర్చొబెట్టడం లాంటి సూచనలు తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి రాంకిషన్‌, అంగన్‌వాడి టీచర్లు కమల, బీమాబాయి, రిసోర్సు టీచర్లు పెంటయ్య, సాయన్న పాల్గొన్నారు.

Read More »

ఘనంగా మహిళా దినోత్సవం

  నందిపేట, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిపేట మండలంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం గంగమ్మ, ఎలిజబెత్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపిటిసి పాల్గొన్నారు. అదేవిధంగా గీతాకాన్వెంట్‌ స్కూల్‌ యాజమాన్యం మండల కేంద్రంలో మహిళలను సన్మానించి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ గంగాసాగర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు వంటగదికే పరిమితం కాదని, అన్ని రంగాల్లో రాజకీయంగా రాణిస్తున్నారని ...

Read More »

ఘనంగా మహిళా దినోత్సవం

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. స్థానిక విజేత పాఠశాలలో విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మహిళా సర్పంచ్‌లు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళా అభివృద్దే తెరాస ప్రభుత్వ ధ్యేయమని స్థానిక జడ్పిటిసి తానాజీరావు అన్నారు. ఈసందర్భంగా ...

Read More »

నర్సరీలను పరిశీలించిన ఎండివో

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ నర్సరీలను ఎండివో సాయాగౌడ్‌ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని పోతంగల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్‌ గడ్డ వద్దగల నర్సరీని ఆయన పరిశీలించారు. జూన్‌ చివరి నాటికి మొక్కలు సిద్దంగా ఉంచాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఎప్పటికప్పుడు మొక్కలకు నీరందించాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆయన వెంట ఉపాధి హామీ సిబ్బంది, తదితరులున్నారు.

Read More »

ఘనంగా హనుమాన్‌ స్వాముల మండల పూజ

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో హనుమాన్‌ స్వాములు మండల పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం ఆలయంలో ఆంజనేయస్వామికి సింధూరం పూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో సారంగాపూర్‌ పీఠాధిపతి నాగభూషణం హనుమాన్‌ గురుస్వామి పాల్గొన్నారు. గాంధారి మండల బిజెపి అధ్యక్షుడు సాయిబాబా స్వామి ఇంట్లో మండల పూజ నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గాంధారి, లింగంపేట్‌, తాడ్వాయి మండలాలకు చెందిన 200 మంది హనుమాన్‌ స్వాములు పాల్గొన్నారు.

Read More »

మహిళ ఉపాధ్యాయులకు సన్మానం

  బీర్కూర్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని రోటరీ క్లబ్‌లో పిఆర్‌టియు, లయన్స్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులను సన్మానించారు. ఇందులో భాగంగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాలకు చెందిన రజిత, చంద్రకళ, నాగమణి తదితరులను శాలువాతో ఘనంగా సన్మానించినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు విఠల్‌ యాదవ్‌ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేత, డిఇవో తదితరులున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లయన్స్‌ క్లబ్‌ ...

Read More »

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

  – ఎంపిపి మల్లెల మీణ హన్మంతు బీర్కూర్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ హన్మంతు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల అభివృద్ది కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నపుడే మహిళ సాధికారత సాధ్యమవుతుందని ఆమె అన్నారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషులతో పోటీ పడుతూ ప్రతీ రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్నారన్నారు. ...

Read More »

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

  బీర్కూర్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని అన్నారం గ్రామ శివారులోగల ప్రధాన కాలువలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించినట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు కాలువ నుంచి శవాన్ని బయటకు తీసినట్టు తెలిపారు. మృతుని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

కన్నుల పండువగా స్వామివారి జాతర

  మోర్తాడ్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం గ్రామంలో గల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కన్నుల పండువగా స్వామివారి జాతర నిర్వహించారు. గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా వేద పండితులతో వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివారి ఆలయం నుంచి గ్రామప్రధాన వీదులగుండా రథోత్సవం నిర్వహించారు. బుధవారం జాతర సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. స్థానిక ...

Read More »

ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం

  మోర్తాడ్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌, బట్టాపూర్‌ గ్రామాలను మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య అన్నారు. బుధవారం దొన్కల్‌, బట్టాపూర్‌ గ్రామాల్లో 5 లక్షల 60 వేల నిధులతో దోబీఘాట్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఒక్కో దోబీఘాట్‌కు 5 లక్షల 60 వేల నిధులు మంజూరుచేశారని, తడపాకల్‌, ఏర్గట్ల గ్రామాలకు కూడా దోబీఘాట్‌లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ...

Read More »

బిసి-ఎ మండల జేఏసి ఏర్పాటు

  మోర్తాడ్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల బిసి-ఎ మండల జేఏసి బుధవారం ఏర్పాటు చేసినట్టు జేఎసీ కన్వీనర్‌ ఆర్‌.విఠల్‌ తెలిపారు. మోర్తాడ్‌లోని గంగపుత్ర సంఘ భవనంలో మండలంలోని బిసి-ఎ అన్ని కుల సంఘాల సభ్యులు సమావేశమై మండల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. కన్వీనర్‌గా ఆర్‌.విఠల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు. కో కన్వీనర్లుగా ప్రవీణ్‌- న్యాయవాది, మహేశ్‌, నర్సయ్య, సుభాష్‌, రాజేశ్వర్‌, గంగారాం, సలహాదారులుగా రవి, రామకృష్ణ, వినోద్‌, తిరుపతిలను ఎన్నుకున్నట్టు తెలిపారు. అనంతరం ...

Read More »

నంబర్‌ 1 ముకేశే…

 సంపద విలువ 1.74 లక్షల కోట్లు.. 132 మంది దగ్గర రూ.26.26 లక్షల కోట్ల ఆస్తులు న్యూఢిల్లీ :ఒక పక్క కోట్లాది మంది దరిద్ర నారాయణులు. మరోపక్క కుబేరులను తలదన్నే శ్రీమంతులు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి ఇది. ఇప్పటికిపుడు లెక్కిస్తే మన దేశంలోనూ వంద కోట్ల డాల ర్లు (సుమారు రూ.6,700 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులన్న 132 మంది బిలియనీర్ల సంపద విలువ 39,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,26,499 కోట్లు) వరకు ఉంటుందని తాజాగా వెలువడిన ‘హురున్‌ ...

Read More »