Breaking News

Daily Archives: March 9, 2017

బీడీ కార్మికులందరికి జీవనభృతి కల్పించాలి

  కామారెడ్డి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఎఫ్‌ ఉన్న బీడీ కార్మికులందరికి జీవనభృతి కల్పించాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంగి సత్యం డిమాండ్‌ చేశారు. గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతితో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీడీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

నేడు తెలంగాణ బిసి కమీషన్‌ ఛైర్మన్‌ రాక

  కామారెడ్డి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బిసి కమీషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు శుక్రవారం కామారెడ్డికి రానున్నట్టు కలెక్టర్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బిసి-ఇ కులాలకు చెందిన వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి స్థితిగతులపై నమూనా సర్వే రూపొందించేందుకు కామారెడ్డి రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ, బర్కత్‌పుర, ఇస్లాంపుర, గొల్లవాడ ప్రాంతాల్లో పర్యటించి బిసి-ఇ కులాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడతారన్నారు. బిసి-ఇ కులాలకు చెందినవారు కమీషనర్‌ను కలిసి తమ ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో గురువారం సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. కామరెడ్డిలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రామ్మోహన్‌, వార్డు వాసులు పాల్గొన్నారు.

Read More »

మహిళల పట్ల ప్రభుత్వ ప్రోత్సాహం అభినందనీయం

  కామారెడ్డి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని భారతమాత సమాఖ్య గ్రూప్‌ మహిళలు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామరెడ్డిలో జరిగిన సమాఖ్య సమావేశంలో మహిళా హక్కులపై చర్చించారు. మహిళా హక్కులను ఎలా సమకూర్చుకోవాలి, జరుగుతున్న అత్యాచారాలు, భ్రూణ హత్యలు, మహిళా సమస్యలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై మాట్లాడారు. మహిళల్లో మార్పు రావాలని, తమకోసం ఉన్న చట్టాలు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ఆర్‌పి రితేశ్వరి, అధ్యక్షురాలు ...

Read More »

శ్రీవారి హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లో గల తెలంగాణ తిరుమల ఆలయ హుండీని ఆలయ కమిటీ ఆద్వర్యంలో గురువారం లెక్కించారు. ఒక లక్ష 20 వేల 940 రూపాయల నగదు ఆదాయం వచ్చినట్టు తెలిపారు. గత వారంరోజులుగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించినట్టు తెలిపారు.

Read More »

వాసవీ క్లబ్‌ ఆద్వర్యంలో మహిళలకు సన్మానం

  కామారెడ్డి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవీక్లబ్‌, వాసవీ వనిత క్లబ్‌, యూత్‌ క్లబ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో గురువారం పలువురు మహిళలను సన్మానించారు. వైద్యులు విజయలక్ష్మి, రాధారమణతోపాటు కానిస్టేబుళ్ళు వెంకటలక్ష్మి, నాగలక్ష్మితో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ మహిళలు చిన్ననాటి నుంచి సమాజం పట్ల గౌరవం చూపుతూ ధైర్యంగా ఉండి మగవారితో పోటీపడి చదువుకొని ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమత, శ్రీనివాస్‌, హరిదర్‌, నాగేశ్వర్‌రావు, ...

Read More »

నైతిక విజయం కాంగ్రెస్‌దే

  నందిపేట, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ అభ్యర్థి ప్రలోభాలకు గురై తెరాసలో చేరినప్పటికి ప్రజలు కాంగ్రెస్‌పై ఆదరాభిమానాలతో 453 ఓట్లు వేయడం చాలా సంతోషకరమని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ అన్నారు. నైతికంగా విజయం కాంగ్రెస్‌దేనన్నారు. పార్టీ పరంగా జరుగుతున్న ఎంపిటిసి ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయగా తెరాస వారు ఓడిపోతామనే భయంతో స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పోటీల్లో ఉన్న పొలాస సునితను భయభ్రాంతులకు గురిచేసి తెరాసలో చేర్చుకున్నారన్నారు. అయినప్పటికి వెల్మల్‌ ...

Read More »

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలి

  బీర్కూర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత వేసవి కాలం సమీపిస్తున్నందున మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బీర్కూర్‌ అధ్యక్షుడు ప్రసాద్‌, డిఇవో మదన్‌మోహన్‌కు వినతి పత్రం సమర్పించారు. 2008 డిఎస్సీ, ఎస్‌జిటి, 2012 డిఎస్సీ ఉపాధ్యాయులకు సర్వీసు రెగ్యులరైజేషన్‌ చేయాలని,పాఠశాల ప్రారంభం నుంచి ఏకరూప దుస్తులు అందజేయాలని, విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందజేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ...

Read More »

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  బీర్కూర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బీర్కూర్‌ మండల మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు ఎల్లపుడు పాటుపడుతుందని తెలిపారు. నిజాంసాగర్‌ ఆయకట్టు కిందగల బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో రైతులకు నీరందించారని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ 25,26,27 పై ప్రత్యేక ...

Read More »

విద్యార్థులు ఎదిగిన కొద్ది ఒదగాలి

  – డిఇవో మదన్‌మోహన్‌ బీర్కూర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు తాము ఉన్నత చదువులు చదువుకుంటూ వెళ్లిన కొద్ది ఇతరులతో సత్ప్రవర్తనతో, క్రమశిక్షణతో ఒదిగి ఉండాలని కామారెడ్డి డిఇవో మదన్‌మోహన్‌ అన్నారు. మండల కేంద్రంలో జడ్పిహెచ్‌ఎస్‌ 70వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల బహుమతి ప్రదాన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, స్నేహితుల పట్ల, సహాయం చేసిన వారి పట్ల ఎదిగిన కొద్ది ఒదిగి ...

Read More »

నేడు మండల ముదిరాజ్‌ కులస్తుల సమావేశం

  గాంధారి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి ముదిరాజ్‌ కులస్తుల సమావేశం ఉంటుందని ముదిరాజ్‌ అధ్యక్షుడు తూరుపు రాజులు తెలిపారు. ఈ సమావేశంలో ముదిరాజ్‌ కులస్తుల అభివృద్ది, మండల కమిటీతో పాటు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మండలానికి చెందిన ముదిరాజ్‌ కులస్తులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Read More »

గాందారి విజిలెన్స్‌ దాడులు

  గాంధారి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గురువారం విజిలెన్సు అధికారులు దాడులు చేపట్టారు. విజిలెన్స్‌ డిఎస్పీ ప్రతాప్‌ ఆద్వర్యంలో మండలంలోని పలు వ్యాపార సముదాయాలపై దాడులు చేపట్టారు. ఇటీవల వ్యాపారులు రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కామారెడ్డి, నిజామాబాద్‌, సిద్దిపేట్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో దాడులు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »

నల్లమడుగు సురేందర్‌ అరెస్టు దారుణం

  గాంధారి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకుడు నల్లమడుగు సురేందర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టుచేయడాన్ని గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు స్పందించారు. ఎల్లారెడ్డి కేంద్రంలో గత ఏడాదిగా సిసి రోడ్డు పనులు కొనసాగుతున్నప్పటికి మూడునెలల్లో పూర్తిచేస్తామని ఆరునెలలు గడిచినా ఇప్పటికి పూర్తికాకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు ధర్నాకు దిగారు. సిసి రోడ్ల పనులపై స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేయడానికి శాంతియుతంగా వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులు నల్లమడుగు సురేందర్‌తోపాటు ...

Read More »

ఇందూరు గడ్డ ఎవరి జాగీరు కాదు

  – కామారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి గాంధారి, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు గడ్డ ఎవరి జాగీరు కాదని, తెలంగాణలో అన్ని జిల్లాల్లో తిరిగే ప్రజాస్వామ్య హక్కు ప్రతి రాజకీయ నాయకుడికి ఉందని కామారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రేవంత్‌రెడ్డిని ఇందూరు గడ్డపై అడుగుపెట్టనివ్వమని రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడాన్ని ...

Read More »

ఉత్సాహంగా.. ఉల్లాసంగా…

  నిజాంసాగర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎంపిపి సునంద మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆట, పాటలతో పాఠశాల ఆవరణలో సందడి చేశారు. ఉపాధ్యాయులు సైతం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నాకర్‌, తదితరులున్నారు.

Read More »

మోదుగ విరగబూస్తే కనువిందే…

  నిజాంసాగర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి ఆగమనంతో అన్ని చెట్ల ఆకులు రాలి దిగాలుగా కనిపిస్తే మరోవైపు ఎర్ర ఎర్రని పూలతో మోదుగ చెట్టు ప్రకృతి అందాలను ఒలకబోస్తూ కనువిందు చేస్తున్నాయి. ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని అడవిలింగాల్‌, లక్ష్మాపూర్‌, నిజాంసాగర్‌, నర్సింగ్‌రావుపల్లి, ఒడ్డేపల్లి గ్రామ శివారులోని మోదుగచెట్లు ఎర్రని పూలతో వసంతానికి స్వాగతం పలుకుతున్నట్టు ఆనందంగా కనువిందు చేస్తున్నాయని ప్రజలు అంటున్నారు. గోగుపూవుతో రంగులు తయారుచేసుకొని చల్లుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగరాదని, చర్మవ్యాధులు కూడా దూరమవుతాయని ...

Read More »

ఉపాధి పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరిస్తామని ఏపివో సుదర్శన్‌ అన్నారు. మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీల సమస్యలు ఏపివో దృష్టికి తెస్తే ఉపాధి పనులు జరుగుతున్న చోట తాగునీటి సదుపాయం లేదని, నీడ కోసం టెంట్ల సౌకర్యం కల్పించాలని వాపోయారు. ఎండలు మండుతుండడంతో పనులు చేయడం ఇబ్బందికరంగా మారిందని, పనుల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఏపివోను కోరారు. ...

Read More »

బట్టాపూర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బట్టాపూర్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల కార్యదర్శులతో గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మండల కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాలని సూచించారు. తద్వారా గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టవచ్చని, గ్రామస్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు. బట్టాపూర్‌లో 25 వేలు, ఆయా గ్రామాల పరిధిలో లక్ష 20 వేలు ఇంటి పన్ను బకాయిలు వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. మండల ...

Read More »

పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

  మోర్తాడ్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, ఏర్గట్ల 10వ తరగతి పరీక్షా కేంద్రాల కోసం మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంఇవో రాజేశ్వర్‌లు గురువారం ఆయా పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల నేపథ్యంలో గదులను పరిశీలించి విద్యార్థులు సక్రమంగా పరీక్షలు రాసేలా విద్యుత్తు, తాగునీరు, ప్యాన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యం, ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి లోపాలు ...

Read More »

తిమ్మాపూర్‌ ప్రధానోపాధ్యాయునిపై గ్రామస్తుల ఆగ్రహం

  మోర్తాడ్‌, మార్చి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శంకర్‌పై స్థానిక సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ నీరడి రాజుబాయి, వైస్‌ ఛైర్మన్‌ సుదర్శన్‌, పాఠశాల యాజమాన్య అభివృద్ది కమిటీ, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాద్యాయులు పాఠశాలకు సరిగా హాజరు కాకపోవడం, ప్రార్థనా సమయానికి రాకపోవడం పట్ల సర్పంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను సైతం దుర్వినియోగం చేస్తు అభివృద్దికి ఆటంకపరుస్తున్నాడని ప్రధానోపాధ్యాయున్ని నిలదీశారు. అంతేగాకుండా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుని ...

Read More »