Breaking News

Daily Archives: March 10, 2017

గాంధారికి చేరిన పాఠ్యపుస్తకాలు

  గాంధారి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు గాంధారి మండలానికి చేరుకుంటున్నాయి. శుక్రవారం స్థానిక ఎంఇవో కార్యాలయానికి పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు ఎంఇవో సేవ్లానాయక్‌ తెలిపారు. అయితే మండలానికి మొత్తం 30 వేల పుస్తకాలు అవసరముండగా ఇప్పటివరకు 17 వేల పుస్తకాలు మాత్రమే వచ్చాయన్నారు. మిగతా పుస్తకాలు వారం రోజుల్లోపు చేరుకుంటాయని సేవ్లానాయక్‌ అన్నారు.

Read More »

కేంద్ర గిరిజన శాఖా మంత్రిని కలిసిన తెలంగాణ గిరిజన నాయకులు

  గాంధారి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర గిరిజన శాఖామంత్రి జోస్వార్‌, సహాయమంత్రి జెస్వంత్‌ సింఘ్‌ బాబూర్‌ను అఖిలబారత లబాన్‌ లంబాడ తెలంగాణ అధ్యక్షుడు తాన్సింగ్‌ కలిశారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి లబాన్‌ లంబాడాల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా లబాన్‌ లంబాడాలను బిసి నుంచి ఎస్టీ జాబితాలో మార్చడానికి కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా ఎస్టీల కొరకు గాంధారి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని కామారెడ్డి ...

Read More »

నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలి

  గాంధారి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎండిపోకుండా చూడాలని కామారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. శుక్రవారం వాటర్‌డే సందర్భంగా మండలంలోని పోతంగల్‌ కలాన్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరందించారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న పిల్లలతో మాట్లాడారు. కరణం గడ్డ తాండాకు చెందిన విద్యార్థులు తాండాలో నెలకొన్న సమస్యలపై జేసికి వివరించారు. స్పందించిన జేసి సత్తయ్య విద్యార్థులతో కలిసి ...

Read More »

ముదిరాజ్‌లను బిసి-ఎలో చేర్చాలి

  గాంధారి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజ్‌ కులస్తులను బిసి డి నుండి బిసి -ఎలోకి చేర్చాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్‌ సంఘం ప్రతినిధి విఠల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్‌ బాలబాలికలను ప్రత్యేకంగా గురుకుల పాఠశాల నిర్మించాలన్నారు. మెరిట్‌ విద్యార్థులను గుర్తించి పారితోషికం అందజేయాలన్నారు. ముదిరాజ్‌ ప్రజాప్రతినిధులకు నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలన్నారు. సిఎం, పిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేయాలన్నారు. ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలని ...

Read More »

విద్యాభివృద్దికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

  నిజాంసాగర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యాభివృద్ది పట్ల తమవంతు కృషిచేయాలని ఎంపిపి సునంద అన్నారు. ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనికీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజన స్టాక్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు శాతం తగ్గకుండా చూడాలన్నారు. మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాలన్నారు. ఆమె వెంట సర్పంచ్‌ బేగరి రాజు, మండల కో ఆప్షన్‌ సబ్యుడు హైమద్‌ హుస్సేన్‌, నాయకులు గంగారెడ్డి, బుక్యా, తదితరులున్నారు.

Read More »

ఉపాధి పనుల్లో హాజరుశాతం పెంచండి

  నిజాంసాగర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి ఎండలు మండడంతో ఉపాధి పనుల వద్ద కూలీలకు కావాల్సిన వసతులు కల్పించాలని ఎంపిడివో రాములు నాయక్‌ కోరారు. ఇజిఎస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు జరగుతున్న చోట కూలీలకు తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలన్నారు. వడదెబ్బ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీల హాజరు నమోదులో మస్టర్లు ...

Read More »

పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

  నిజాంసాగర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి మంగుళూరు, ఆరేడు, హసన్‌పల్లి, కోమలంచ గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు కోసం పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించాలంటూ ఇంటింటా తిరుగుతూ కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ చేశారు. ఇందులో భాగంగా గ్రామ పరిధిలో 24,502 రూపాయలు వసూలు చేసినట్టు వారుతెలిపారు.

Read More »

10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

  నిజాంసాగర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశలో వీడ్కోలు సమావేశం మరువలేనిదని, మరిచిపోలేనిదని విద్యార్థులు, ఉపాద్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యక్రమన్ని నిర్వహించారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం పాఠశాలలో చదువుకుంటున్నపుడు చేసిన అల్లరి పనులను, ఉన్నత విద్యాబ్యాసం, తదితర విషయాలపై మనోభావాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ...

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని చదువుతోపాటు ఆటలు, పాటలు, సామాజిక సేవా లాంటి కార్యక్రమాలు చేపట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అటవీశాఖాధికారి బాలమణి, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను, ...

Read More »

బిసి-ఇ స్థితిగతులపై అధ్యయనం

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని బిసి-ఇ కులాలకు చెందినవారి స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో భాగంగానే కామారెడ్డి పట్టణంలో శుక్రవారం పర్యటించినట్టు తెలంగాణ బిసి కమీషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీ, బర్కత్‌పుర, ఇస్లాంపుర, గొల్లవాడల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో బిసి-ఇ కులాలకు చెందిన ప్రజలవద్దకెళ్లి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి స్థితిగతులను అధ్యయనం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసి-ఇ ...

Read More »

33 శాతం అటవీ పెంపుదల లక్ష్యం

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 33 శాతం అటవీశాతం పెంచేలక్ష్యంగా పనిచేస్తున్నామని కామారెడ్డి జిల్లా ఫారెస్టు అధికారిణి బాలమణి అన్నారు. ప్రతి శుక్రవారం చెట్లకు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ఆమె అటవీ శాఖ సిబ్బందితోకలిసి రోడ్ల మధ్య డివైడర్‌లోగల చెట్లకు నీరుపోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల పెంపుదల లక్ష్యంగా సిబ్బందితో కలిసి పనిచేస్తున్నామన్నారు. హరితహరంలో భాగంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటామని, ప్రజాప్రతినిదులు, అధికారులు అందరు కలిసి ...

Read More »

పాఠశాల కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్దం

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యంగ్‌ మాస్టర్‌ మైండ్‌ పాఠశాలకు గుర్తింపు లేదని పేర్కొంటూ శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో పాఠశాలకు చెందిన ఫ్లెక్సీలు, కరపత్రాలు దగ్దం చేశారు. పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి సందీప్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి భానుప్రసాద్‌లు మాట్లాడుతూ గుర్తింపులేని పాఠశాలలు, ఇష్టానుసారంగా ప్రచారాలుచేస్తు విద్యాసంవత్సరం ముగియక ముందే అక్రమంగా ప్రవేశాలు జరిపిస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గర్హణీయమన్నారు. ...

Read More »

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

  కామారెడ్డి, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులుపలు సినీ నేపథ్య, జానపద, ప్రయివేటు గేయాలపై చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థులకు సూచించారు.

Read More »

భూమి అమ్మకాలపై చీటింగ్‌ కేసు నమోదు

  నందిపేట, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని బైపాస్‌రోడ్డు పక్కనగల ప్లాట్ల అమ్మకాలను ఆపి, కట్టడాలను నిలిపివేయాలని కోరుతూ చేసిన ఫిర్యాదు స్వీకరించినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… నిజామాబాద్‌కు చెందిన రావెల్ల ఝాన్సీ లక్ష్మిబాయికి ఆర్మూర్‌ బైపాస్‌ పక్కనగల సర్వేనెంబరు 685/1/2/3/4/5, 686/2 భూమియొక్క పవర్‌ ఆఫ్‌ ఆటర్ని కలదు. అట్టి భూమికి సంబంధించిన కేసు 2003 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉంది. పవర్‌ ఆఫ్‌ అటర్ని చేసిచ్చిన పట్టాదారు బంధువులు ...

Read More »

ఇసుక ట్రాక్టర్‌ అడ్డుకున్న గ్రామస్తులు

  బీర్కూర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులకు బీర్కూర్‌ గ్రామ మంజీర నదీపరివాహకం నుంచి తరలుతున్న ఇసుక ట్రాక్టర్లను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అభివృద్ది పనులకు ఇసుక రవాణా అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని, మంజీర ప్రాంతం నుంచి గ్రామ ట్రాక్టర్లే కాకుండా మండలంలోని పలు గ్రామాల ట్రాక్టర్లు సైతం అధిక సంఖ్యలో వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణా చేసే సమయంలో పంట పొలాలపై పడుతుందని, పోచారం, వైఎస్‌ఆర్‌, ఇందిరా ...

Read More »

హరితహారం మొక్కల సంరక్షణకు నీరు అందజేత

  బీర్కూర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం వాటర్‌డే సందర్భంగా మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో హరితహరం మొక్కలకు నీటిని అందజేశారు. మొక్కల సంరక్షణలో భాగంగా ప్రతి శుక్రవారం విద్యార్థులచే గ్రామస్తుల సహాయం మొక్కలకు నీరందిస్తున్నామని ఉపాధ్యాయులు శ్రీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

కులవృత్తుల కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ ద్యేయం

  – పోచారం సురేందర్‌రెడ్డి బీర్కూర్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తిదారుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ ద్యేయమని, తద్వారా బంగారు తెలంగాణకు బాటలు వేసినట్టు అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం తనయుడు తెరాస బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌ గ్రామంలో పలు అభివృద్ది పనుల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. పదిలక్షల వ్యయంతో నిర్మించనున్న గంగపుత్రుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల ...

Read More »