Breaking News

Daily Archives: March 11, 2017

బిజెపి గెలుపుతో సంబరాలు

  గాంధారి, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి మెజార్టీతో గెలవడంతో గాంధారి మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి స్పష్టమైన మెజార్టీ సాధించడంతో పాటు మణిపూర్‌, గోవాలో ప్రభుత్వం చేపట్టే దిశగా ఎన్నికల ఫలితాలు రావడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. మోడిప్రభంజనంతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, ...

Read More »

ఆదివారం హోలీ పండగ

  గాంధారి, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఆదివారం హోలీ పండగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి గాంధారి మండలంలో కామదహనం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీదుల్లో ఏర్పాటు చేసిన కామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దహనం చేశారు. ఆదివారం మండల వ్యాప్తంగా హోళీ పండగ జరుపుకోనున్నారు. పండగ ఉత్సాహంగా జరుపుకోవడానికి యువత, చిన్నా, పెద్ద సన్నాహాలు చేస్తున్నారు.

Read More »

ఘనంగా కామదహనం

  బీర్కూర్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళీ పండగను పురస్కరించుకొని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామల్లో శనివారం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయా కుల సంఘాలు, యువ సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆద్వర్యంలో గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళలో భక్తి శ్రద్దలతో, సంప్రదాయబద్దంగా కామదహన కార్యక్రమం నిర్వహించారు. మనిషిలోని చెడు తొలగి వెలుగు వైపు పయనించాలని పలువురు పేర్కొన్నారు.

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆద్వర్యంలో శనివారం మహాఅన్నదానం నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఆలయంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ జ్ఞాపిక, శాలువాతో ఎస్‌ఐని సన్మానించారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Read More »

ఏర్గట్లలో బిజెపి విజయోత్సవ సంబరాలు

  మోర్తాడ్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోఎన్డీయే ఆద్వర్యంలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుపొంది విజయం సాధించిన నేపథ్యంలో శనివారం ఏర్గట్ల మండల బిజెపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రమైన ఏర్గట్లతోపాటు పలు గ్రామాల్లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడి అవినీతి నిర్మూలనే ధ్యేయంగా అన్ని వర్గాల, అన్ని గ్రామాల సంక్షేమమే ద్యేయంగా కృసి చేస్తున్నందుకు ఆయా రాష్ట్రాల్లో ...

Read More »

ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలి

  మోర్తాడ్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ప్రభుత్వ వైద్యులు వైద్య శిబిరాలు నిర్వహిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌ అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కమ్మర్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వైద్యులు అజయ్‌కుమార్‌, స్నేహలు గ్రామస్తులకు వైద్య పర్షీలు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా అవసరమగు మందులు పంపిణీ చేశారు. సర్పంచ్‌ మాట్లాడుతూ ...

Read More »

కల్తీని అరికట్టే నాధుడేడీ?

కల్తీని అరికట్టేవిషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదు.కల్తీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటా మని కల్తీదారులపై అవసరమైతే పీడి చట్టాన్ని కూడా ప్రయోగించి కటకటాల వెనక్కి పంపుతామని పదేపదే ప్రకటిస్తున్నా కల్తీమాత్రంఅంతకంతకు విజృంభించిపోతు న్నది. తాగే నీటిలో కల్తీ. ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంలో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఎరువ్ఞల్లో కల్తీ, చివరకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడే అత్య వసర మందుల్లో కల్తీ.అదీఇదీ అని లేకుండా మొత్తం కల్తీ మయమైపోతున్నది.రానురాను కల్తీతోమనిషి మనుగడకే ...

Read More »

నాకు నాన్నే గుండు గీశారు

‘‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక–నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నారు కమల్‌హాసన్‌ చిన్న కూతురు అక్షరా హాసన్‌. ప్రశ్నించడమే కాదండోయ్‌… పక్కా స్క్రిప్ట్‌తో వస్తే గుండు గీయించుకుంటానని స్పష్టం చేశారామె. సాధారణంగా అమ్మాయిలు గుండు చేయించుకోవడం అరుదు. కొందరు హీరోలు పాత్రలో పర్‌ఫెక్షన్‌ కోసం గుండు గీయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్లు అలా చేయడం మహా అరుదు. ఈ నేపథ్యంలో అక్షర వ్యాఖ్యలు తండ్రి కమల్‌హాసన్‌ తరహాలో నేనూ ప్రయోగాలకు సిద్ధమనే సంకేతం అనుకోవాలేమో! అక్షరా హాసన్‌ ...

Read More »

జస్టిస్‌ కర్ణన్‌పై అరెస్ట్‌ వారెంట్‌

కోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన సుప్రీంకోర్టు ► రాజ్యాంగ విరుద్ధమన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ►  సీజేఐపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు న్యూఢిల్లీ/కోల్‌కతా: కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్ కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. ఈ నెల 31 ఉదయం కర్ణన్ ను కోర్టు ముందు హాజరు పరచాలని పశ్చిమబెంగాల్‌ డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఆదేశించింది. రూ.10 వేల ...

Read More »

రెజ్యూమ్‌లో ఈ 10 పదాలు వాడకపోవడమే మంచిదట..!

బీటెక్, డిగ్రీ, పీజీ.. ఎడ్యుకేషన్ ఏదయినా సరే.. అందరి అంతిమ లక్ష్యం ఓ మంచి జాబ్. ‘ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలి’ అనే సామెతలాగే… రెజ్యూమ్ చూడు.. ఆ తర్వాతే అభ్యర్థిని చూడు అనేది ఇంటర్వ్యూ పరిభాషలా మారింది. అందుకే తన లక్షణాలు, విద్యార్హతలు, గుణగణాలు, సాధించిన విజయాలన్నింటినీ సీవీలో ఏకరువు పెడుతుంటారు కొందరు. కొందరు సింపుల్‌గా ఒక పేజీలో సీవీని పూర్తి చేస్తే.. మరికొందరు రెండు పేజీల్లో తమ రెజ్యూమ్‌ను రూపొందిస్తారు. పదో తరగతి నుంచి మొదలుకుని.. చివరి విద్యాభ్యాసం వరకూ అన్ని ...

Read More »

28 ఏళ్ల క్రితం ఇంట్లో పనిచేసిన మహిళ కోసం ఓ సౌదీ కుటుంబం..

సౌదీఅరేబియా: సౌదీలో ఇంట్లో పనిమనుషులుగా చేసేవారు చిత్రహింసలను ఎదుర్కొంటున్నట్లు ఎన్నో వార్తలు చదివి ఉంటారు. అక్కడ చట్టాలు కూడా సౌదీ పౌరులకు అనుకూలంగానే ఉంటాయి. యజమాని ఒప్పుకోనిదే వేరే చోట పనిచేయకూడదు. అసలు దేశం కూడా దాటనివ్వరు. చాలామంది యజమానులయితే పనిమనుషులను ఓ బానిసలా చూస్తుంటారు. వీళ్లలాగానే.. పనిమనుషులను తమ ఇంటివారిలాగా చూసుకునేవారు కూడా ఉంటారు. తమ ఇంట్లో పనిచేసిన మహిళను గుర్తు పెట్టుకుని మరీ చూసేందుకు వెళ్లింది. యోగక్షేమాలను కనుక్కుంది. అయితే ఆమె ఏ పక్క ఊరికో వెళ్లిందనుకుంటే పొరపాటే.. కేవలం పనిమనిషిని చూసేందుకు ...

Read More »

భార్య నుంచి ఫోన్.. భర్తకు కాదు అతడి స్నేహితుడికి

దుబాయ్: ఒక వ్యక్తి భార్య తన భర్తతో కలిసి పనిచేస్తోన్న మరో వ్యక్తితో చనువుగా ఉంటోంది. ఇది గమనించిన ఆమె భర్త జాగ్రత్తగా ఉండమని వారిద్దరిని హెచ్చరించాడు. అయిన వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో కోపం పెంచుకున్న భర్త తన స్నేహితుడిని చంపేశాడు. ఇది ఎలా జరిగిందంటే పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి దుబాయ్‌లోని ఒక ఫుడ్‌కోర్టులో పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి అసిస్టెంట్‌గా మరో వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. అయితే అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న వ్యక్తి, పాకిస్తాని వ్యక్తి భార్యతో సానిహిత్యం పెంచుకున్నాడు. ...

Read More »