Breaking News

కల్తీని అరికట్టే నాధుడేడీ?

కల్తీని అరికట్టేవిషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదు.కల్తీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటా మని కల్తీదారులపై అవసరమైతే పీడి చట్టాన్ని కూడా ప్రయోగించి కటకటాల వెనక్కి పంపుతామని పదేపదే ప్రకటిస్తున్నా కల్తీమాత్రంఅంతకంతకు విజృంభించిపోతు న్నది. తాగే నీటిలో కల్తీ. ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంలో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఎరువ్ఞల్లో కల్తీ, చివరకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడే అత్య వసర మందుల్లో కల్తీ.అదీఇదీ అని లేకుండా మొత్తం కల్తీ మయమైపోతున్నది.రానురాను కల్తీతోమనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే సూచనలు కన్పిస్తున్నాయి.

కల్తీ ఇంత ప్రమాదకరంగా తయారవ్ఞతున్నా పొగమంచులా అంత టావ్యాపిస్తున్నా నిరోధించలేకపోతున్నారు.అసలు అవినీ తికి కల్తీకి అవినాభావ సంబంధం ఉంది. ఒకటిని విడిచి మరొకటి ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి రెట్టింపుస్థాయిలో పెరిగిపోతున్న ది. దీనిని అరికట్టేందుకు అటు కేంద్ర పాలకులు, ఇటు రాష్ట్రపాలకులు ఎన్నోచర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నారు. ఎంతో మంది అధికారులను నియమించారు. ఆ అధికారులు కానీ, సదరు చట్టాలు కానీ ఈ కల్తీని నిరోధించలేకపోతున్నా యి. ఇంకొందరి ప్రాణాలు ఈ కల్తీకి బలైపోతున్నాయి. ఇంత తీవ్రంగా విలయతాండవం చేస్తున్నా అవసరం మేరకు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించవ్ఞ. అప్పుడప్పుడు జనం కన్నీరు తుడవడానికి, తమ ఉనికిని గుర్తు చేయడానికి మొక్కుబడిగా దాడులు చేస్తున్నారే తప్ప ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న కల్తీని నిరోధించడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టి కల్తీని పునరావృతం కాకుండా చేయలేకపోతున్నారు. ఈ కల్తీ ఎక్కడో మూడోకంటికి తెలియకుండా జర గడంలేదు.అందులో రహస్యం ఏమీ లేదు. పరిశోధించి, రాత్రింబవళ్లు శ్రమించి మాటు వేసి పట్టుకోవాల్సిన పని అంతకంటే లేదు. కల్తీ అమ్మకాలు రహస్యంగా జరగడం లేదు.

ఇందులో దొంగచాటు అసలే లేదు. పబ్లిక్‌గా ప్రద ర్శించి మరీ అమ్ముకుంటున్నారు. పోనీ ఇదెక్కడో మారు మూల గ్రామాల్లో జరగడం లేదు. అంతటా విస్తరించి ఉంది. నగరాల్లో, పట్టణాల్లో మరి ఉధృతంగా ఉంది. అమాయక ప్రజలు నిలువ్ఞదోపిడీకి గురవ్ఞతున్నారు. ఆర్థికపరంగా నష్టపోతేపోయారు కానీ అనారోగ్యం పాల వ్ఞతున్నారు. క్షయ, కేన్సర్‌ వంటి రోగాలపాలై ఏళ్ల తర బడి మంచానికి అంకితమై కృంగికృశించి అసువ్ఞలు బా స్తున్నారు.ఉదాహరణకు నిరుపేదల దగ్గర నుండికోటీశ్వ రుల వరకు నిత్యం వాడే కాఫీ, టీ పొడులను తీసుకుం దాం. దేశవ్యాప్తంగా ఏటా టీ పొడి నలభైకోట్ల కిలోలకు పైగా వాడుతుండగా అందులో తెలుగురాష్ట్రాల్లో మూడు కోట్ల కిలోలకుపైగా వినియోగిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున కల్తీ జరుగుతున్నది. జీడిమామిడికాయల పైపొర తోపాటు ఆకులను ఎండబెట్టి పొడిచేసి కలుపుతున్నారు. జీడిమామిడితోటలు విస్తారంగా ఉండే ఉత్తరకోస్తా ప్రాం తంలో ఈ కల్తీ కార్యక్రమం ఒక కుటీరపరిశ్రమగా వర్ధిల్లు తున్నది.దీనికితోడు కొన్నిప్రాంతాల్లో ఇనుపరజను కూడా కలుపుతున్నట్లు సమాచారం. ఇందువల్ల తూకం కూడా బాగా పెరిగే అవకాశంఉంది.అస్సాం, తదితర ప్రాంతాల నుంచి వచ్చే టీ పొడిలో కూడా క్యాష్యుహస్క్‌ కలుపుతు న్నారు.ఇలాంటి కల్తీ టీపొడిని వాడితే తొలిదశలో అజీర్ణ సమస్య ప్రారంభమై అల్సర్‌గా మారి తుదిదశలో క్యాన్స ర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్లే చెబుతున్నారు.

అలాగేప్రజలు నిత్యంవాడే కారంపొడిలో రంపపుపొట్టు, కందిపొట్టుతోపాటు మరికొన్ని రసాయనికాలుకూడా కలు పుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఖమ్మం జిల్లాలో లారీల కొద్దీ కల్తీ కారాన్ని నిర్మానుష్యప్రాంతాల్లో రోడ్లపక్కన పడేశారు.అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తయారు చేశారు? తదితర వివరాలన్నీ ఆప్రాంతం అంతా కోడైకూస్తున్నా సంబంధి త అధికారులు మాత్రం చేతులు ముడుచుకొని కూర్చు కున్నారు. ఇక చీప్‌ లిక్కర్‌లో కల్తీ ప్రమాదకరస్థాయిలో ఉంది.చీప్‌ లిక్కర్‌, గుడంబా, కల్తీ కల్లుకు ఎంతో మంది నిరుపేదలు బలైపోతున్నారు.ఇవన్నీ ప్రభుత్వానికి అధికా రులకు తెలియందికాదు. కల్తీ జరగకుండా చూసేందుకు వేలాది రూపాయలు జీతభత్యాలు తీసుకుంటున్న అధికా రులు కల్తీసామ్రాజ్యానికి కాపలాదారులుగా వ్యవహరించ డం దురదృష్టకరం. కల్తీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రబలిపోతున్నది. ఈ కల్తీ సామ్రా ట్లకు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కొందరురాజకీయ నా యకులతో సంబంధాలున్నాయి. దీనికితోడు మరికొంద రు అవినీతి అధికారుల అండదండలున్నాయి. అందుకే ఇది రోజురోజుకు పెరిగిపోతూ ప్రజాజీవితాన్ని నరకప్రా యంగా చేస్తున్నా నిరోధించలేకపోతున్నారు. ఫలితంగా కల్తీబారిన పడి వేలాది మంది అమాయక ప్రజలు రోగా లపాలవ్ఞతున్నారు. వైద్యం ఎంత ఖరీదైపోయిందో వేరే చెప్పక్కర్లేదు. ఆ మందుల్లో కూడా కల్తీ ఉండడంతో కొత్త కొత్తరోగాలకు కారణాలవుతున్నాయి.

పరిమితి లేని ఆదా యంగలవారికి వైద్యఖర్చుగూర్చి అంతపెద్ద చింతనఉండ కపోవచ్చు కానీ కూలీనాలీ చేసుకునే వారు రెక్కాడితేకాని డొక్కాడనివారు, నెలజీతగాళ్లు వంటి పరిమితి ఆదాయం గల వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంతటి విప త్కర పరిస్థితులకు దారితీస్తున్న కల్తీని నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే చట్టంలో మార్పులు చేసి మరింత పదును పెట్టాలి. –

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article