Breaking News

Daily Archives: March 13, 2017

మత్స్యకారులు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాఇ

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యపారిశ్రామిక సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమలు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మత్స్యపారిశ్రామిక సంఘాలకు బ్లూ రెవెల్యూషన్‌పై అవగాహన కల్పించారు. పథకం కింద చేపల చెరువుల నిర్మాణం, చేపల హాచరీల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, కేజ్‌లలో చేపల పెంపకం, మినీ దాణా ఉత్పత్తి పాంల్లు, వలలు, తెప్పలు, మోపెడ్‌లు, ఇన్సులేటెడ్‌ వాహనాలు, నర్సరీలు, చేపల దుకాణాలు, చేప పిల్లల సరఫరాల ...

Read More »

యువతి ఆత్మహత్య

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన రజిత (23) అనే యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. రజితకు ఇటీవలే పెళ్ళి కుదిరింది. ఇంటి పక్కనే నివాసముంటున్న శ్రీకాంత్‌, ఆయన భార్యలక్ష్మిలు రజితతో గొడవపడ్డారు. నీకు పెళ్ళి ఎలా జరుగుతదో చూస్తామని గొడవకు దిగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రజిత సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాంత్‌, లక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ ...

Read More »

మహిళా సర్పంచ్‌లకు సన్మానం

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించి వచ్చిన మహిళా సర్పంచ్‌లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సన్మానించారు. దోమకొండ సర్పంచ్‌ శారదతో పాటు గూడెం సర్పంచ్‌ సుష్మలను సన్మానించారు. ఐదుగురు సర్పంచ్‌లు కామారెడ్డి జిల్లా నుంచి గుజరాత్‌ రాష్ట్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచ్‌లను సన్మానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, అధికారులు పాల్గొన్నారు.

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి వందకోట్లు కేటాయించాలి

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల సంక్షేమానికి కెసిఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు వంద కోట్లు నిధులు కేటాయించాలని టిడబ్ల్యుజెఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమం కోసం కేవలం 30 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. గతంలో వందకోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 30 కోట్లు మాత్రమే కేటాయించడం గర్హణీయమన్నారు. జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, హెల్త్‌కార్డులు, పిల్లలకు విద్యారాయితీలు, ...

Read More »

ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌కు సన్మానం

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.జి.గౌడ్‌ను కామారెడ్డి గౌడ సంఘం ప్రతినిదులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తంచేస్తు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. శాసనమండలిలో గౌడ కులస్తుల సమస్యలు ప్రస్తావించి పరష్కరించాలని కోరారు. గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు గోపి గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌, మోతె బాల్‌రాజ్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఎంపి కవిత జన్మదిన వేడుకలు

  నందిపేట, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెరాస నాయకులు సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఎంపి జన్మదిన వేడుకలు యువకులు, ఆడపడుచులు పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన కవిత కామన్‌ వెల్త్‌ పార్లమెంటేరియన్‌ సభ్యురాలిగా కామన్‌వెల్త్‌ దేశాల్లో పర్యటించారని, చట్టసభల్లో ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడ్జెట్‌లో గంగపుత్రుల కోసం ప్రభుత్వం 300 కోట్లనిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గంగపుత్రులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గంగపుత్రులను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి కార్పొరేషన్‌ నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి, ఆర్థికశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో సంఘ భవనానికి నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గంగపుత్రులను ...

Read More »

మట్టిలో కూరుకుపోయిన స్వచ్ఛభారత్‌

  గాంధారి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫోటోలో కనబడుతున్నది స్వచ్చభారత్‌ ఏ మేరకు పనిచేస్తుందో తెలపడానికి నిదర్శనం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చభారత్‌ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా అవి గ్రామీణ ప్రాంతాల్లో, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో మట్టిలో కూరుకుపోతుంది. స్వచ్చభారత్‌ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త సేకరించే రిక్షాలు పంపిణీ చేసినప్పటికి అధికారులు వాటిని కన్నెత్తి కూడా చూడడం లేదనడానికి ఇది ఒక నిదర్శనం. గాంధారి మండలం చెద్మల్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో మట్టిలో ...

Read More »

యాదవ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు

  కామారెడ్డి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యాదవుల అభివృద్ది కోసం 4 వేల కోట్ల నిధులు కేటాయించడం పట్ల అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల కుర్మలకు బడ్జెట్‌లో ప్రాతినిధ్యం కల్పిస్తు ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు ...

Read More »

క్రమశిక్షణతోనే ఉన్నతస్థాయికి…

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగిన నాడే ఉన్నత స్థితిలో ఉంటారని నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు సమాజం పట్ల, ఉపాధ్యాయులు, పెద్దల పట్ల గౌరవ, మర్యాదలతో, క్రమశిక్షణ అలవరుచుకున్నపుడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారన్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు.

Read More »

ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కారం

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల తహసీల్దార్లు కృష్ణానాయక్‌, డేవిడ్‌లు అన్నారు. గతంలో జిల్లాస్థాయిలో ప్రజావాణి నిర్వహించేవారని, ప్రస్తుతం మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు ఆయా శాఖాధికారుల దృష్టికి తెస్తే త్వరితగతిన పరిష్కారం కొరకు వీలుంటుందని తెలిపారు. సోమవరం నిర్వహించిన ప్రజావాణిలో రెండు మండలాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.

Read More »

ఘనంగా ఎంపి కవిత జన్మదిన వేడుకలు

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి, తెరాస పార్టీ ఆద్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. తెలంగాణలో మరుగున పడుతున్న సంప్రదాయ పండగలను ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎంపి కవితదేనన్నారు. దేశ, విధేశాల్లో బతుకమ్మ విశిష్టతను చాటిచెప్పారన్నారు. నిండూనూరేల్ళు వర్దిల్లాలని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, తెలంగాణ ...

Read More »

ఘనంగా హోళీ

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సోమవారం ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనంగా హోలీ పండగ జరుపుకున్నారు. ఉదయం నుంచే ఒకరినొకరు రంగులు జల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో లంబాడాలు సంప్రదాయబద్దంగా హోలీ పండగ జరుపుకున్నారు. బీర్కూర్‌లో పోచారం సురేందర్‌రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రకృతిలో వివిధ రంగులు మనిషికి ఆనందాన్ని ఎలా కలిగిస్తున్నాయో జీవితం కూడా రంగుల మయం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

ఫ్రెండ్లీ పోలీసులకు ప్రజాప్రతినిధులు సహకరించాలి

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌లో సోమవారం బీర్కూర్‌ మండల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని, పోలీసు సిబ్బందితో స్నేహభావంతో మెలగాలని సూచించారు. ప్రధానంగా గ్రామంలో నెలకొన్న పేకాట, బెల్టుసాపులు, క్రికెట్‌ బెట్టింగ్‌లపై దృష్టి సారిస్తు గ్రామస్తుల్లో అవగాహన ...

Read More »

అణగారిన వర్గాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

  బీర్కూర్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారి అభ్యుదయం కొరకే తెలంగాణ బడ్జెట్‌ ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన హోళీ పండగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోళీ పండగరోజున రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ 2017-18 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రతి బడుగు, బలహీన వర్గాల జీవితంలో ఆనందం ...

Read More »

ఐదు గ్రామాలకు సిసి రోడ్లు

  మోర్తాడ్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, సుంకెట్‌, షెట్పల్లి, తాళ్లరాంపూర్‌, తడపాకల్‌ గ్రామాల అభివృద్ది దృష్టిలో పెట్టుకొని సిసి రోడ్ల నిర్మాణానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మోక్షం కల్పించారని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అనిత, శ్రీనివాస్‌, మధుసూదన్‌గౌడ్‌, లింబన్న, తుమ్మల మారుత, లోలం లావణ్యలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు అందజేశామని, త్వరలోనే సిసి రోడ్ల కు నిధులు మంజూరుకాగానే ఎమ్మెల్యేచే ప్రారంభింపజేస్తామన్నారు.

Read More »

నాలుగు గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు పూర్తి

  మోర్తాడ్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ -47, ధర్మోరాలో -112, ఒడ్యాట్‌లో-107, తడపాకల్‌-103 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణలను వందశాతం పూర్తిచేసినట్టు ఆయా గ్రామాల సర్పంచ్‌లు రాజేశ్వర్‌, దుగ్గెర రాజేందర్‌, నాగం పోశన్న, లోలం లావణ్య, చిన్నరెడ్డిలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఒడ్యాట్‌ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ధర్మోరా గ్రామాన్ని స్వచ్చభారత్‌ కింద ఎంపిక చేసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పరుస్తున్నారని వారన్నారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగానే జిల్లా కలెక్టర్‌ ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద ...

Read More »

గొల్లకుర్మల అభివృధ్దే ధ్యేయంగా తెరాస కృషి

  మోర్తాడ్‌, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస సిఎం కెసిఆర్‌ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మ, యాదవుల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నారని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. సోమవారం మోర్తాడ్‌ మండల గొల్ల, కుర్మ, యాదవ సంఘం ఆద్వర్యంలో తెరాస పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ...

Read More »

బడ్జెట్‌ కేటాయింపులపై తెరాస సంబరాలు

  గాంధారి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసినందుకు తెరాస శ్రేణులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సోమవారం ఉదయం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, యాదవుల సంక్షేమం, అంగన్‌వాడిల వేతనాల పెంపు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు నిధుల పెంపుతోపాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, గాంధారి తెరాస నాయకులు ...

Read More »

ప్రజావాణికి రెండు ఫిర్యాదులు

  గాంధారి, మార్చి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ ఎస్‌.వి. లక్ష్మణ్‌ తెలిపారు. 65 సంవత్సరాలు నిండినా పింఛన్‌ రాకపోవడంతో పింఛన్‌ ఇప్పించాలని ఒకరు, భూమికి సంబందించిన వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని మరొకరు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి సమస్య వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎండివో సాయాగౌడ్‌, సర్వేయర్‌ నరేందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »