Breaking News

Daily Archives: March 15, 2017

అగ్ని ప్రమాదాల నుంచి అడవులను కాపాడాలి

  కామారెడ్డి, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడవులను అగ్నిప్రమాదాల బారినుండి రక్షించాలని కామారెడ్డి అటవీశాఖ ఆద్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ జిల్లా అధికారిణి బాలమణి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎఫ్‌వో మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడంతో అడవులు క్షీణించిపోతున్నాయన్నారు. అడవులపట్ల ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలన్నారు. అడవులను కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందన్నారు. ర్యాలీ కామారెడ్డి అటవీశాఖ కార్యాలయం నుంచి ప్రారంభమై గర్గుల్‌, రామారెడ్డి, రెడ్డిపేట్‌, అన్నారం వరకు సాగింది. ...

Read More »

కామారెడ్డిలో కత్తిపోట్లు.. వ్యక్తి మృతి, కేసు నమోదు

  కామారెడ్డి, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి కత్తులతో దాడిచేసుకున్న సంఘటన కలకలం రేపింది. పాత కక్షలతో కత్తులతో దాడిచేసుకోగా ఒకరు మృతి చెందారు. కామారెడ్డికి చెందిన అన్వర్‌, అక్బరుద్దీన్‌లకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే వీరి గొడవ విషయంలో పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని మంగళవారం రాత్రి రైల్వేస్టేషన్‌కు పిలవడం జరిగింది. కౌన్సిలర్‌ అంజద్‌, మరికొందరు కలిసి అక్బర్‌, అన్వర్‌లను పిలిచి ...

Read More »

ప్రభుత్వ పథకాలను చిత్తశుద్దితో నిర్వహించాలి

  మోర్తాడ్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న హరితహారం మూడోవిడత మొక్కలు నాటేందుకు అన్నిశాఖల అధికారులు చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలని ఎంపిడివో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో అభివృద్ది పనులపై సమీక్షించారు. ఎక్సైజ్‌ అధికారులు, ఇజిఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారులు ఉపాధి హామీ కింద చేపట్టిన పాంఫౌండ్‌ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్‌ యార్డులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు గత ప్రభుత్వాలు అందించిన భూములను తహసీల్దార్‌ ...

Read More »

గురువారం ఎంఆర్‌పిఎస్‌ కార్యవర్గం ఏర్పాటు

  మోర్తాడ్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మోర్తాడ్‌లో గురువారం మాదిగ దండోరా మండల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల కమిటీ ఇన్‌చార్జి నాయకుడు భూమన్న బుధవారం తెలిపారు. ఈనెల 16న మోర్తాడ్‌లో మండల కమిటీ ఎన్నుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకుమార్‌ మాదిగ విచ్చేస్తున్నట్టు తెలిపారు. మండలంలోని మాదిగ కులస్తులందరు సమావేశానికి హజరు కావాలని వారు సూచించారు.

Read More »

అనుమతులున్న చోటికి ఇసుక తరలించాలి

  – తహసీల్దార్‌ కృష్ణనాయక్‌ బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మంజీర నది పరివాహక ప్రాంతం నుంచి నియోజకవర్గంలోని అభివృద్ది పనులకు తరలుతున్న ఇసుక విఆర్వో ఇచ్చే అనుమతుల ప్రకారం రవాణా చేయాలని తహసీల్దార్‌ కృష్ణా నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని మంజీర నది పరివాహకంలో ఇసుక రవాణా జరుపుతున్న ప్రాంతంలో వేబిల్లులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అనుమతులున్నచోటనే ఇసుక పోయాలని, లేనిచో ట్రాక్టర్లను సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ...

Read More »

సమర సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ

  గాంధారి, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర ముగింపు సభ ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్నామని దీనికి సంబంధించి సమర సమ్మేళనం గోడప్రతులను బుధవారం గాంధారి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణలో సిపిఎం ఆద్వర్యంలో తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు మహాసభ సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సిపిఎం నాయకులు మోతిరాం నాయక్‌ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, దళితులకు మూడెకరాల భూమి, పోడు భూముల పరిష్కారం, డబుల్‌ బెడ్‌రూం, ఎన్నికల హామీలు ...

Read More »

నెత్తురోడుతున్న నందిపేట రోడ్లు…

  నందిపేట, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన తల్వేద శశికుమార్‌ (17), కొండి శశాంక్‌ (17) ఇంటర్మీయడిట్‌ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన మరువకముందే అదేరోజు మంగళవారం రాత్రి నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని విజయ్‌నగర్‌ సమీపాన కారు, ట్రాక్టర్‌ ఢీకొని ఉమ్మెడ గ్రామానికి చెందిన తెరాస జిల్లా నాయకుడు మనోజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన సంఘటనల నుంచి మండల ప్రజలు తేరుకోకముందే బుధవారం ఉదయం మండలంలోని ఐలాపూర్‌ ...

Read More »

గండివేట్‌లో సిసి రోడ్డు ప్రారంభం

  గాంధారి, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో బుధవారం సిసి రోడ్డు పనులను సర్పంచ్‌ విశ్వనాథ్‌ పటేల్‌ ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధుల నుంచి 4 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. గ్రామంలోని పెద్దబజార్‌ కాలనీలో ఈ పనులను చేస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు సూచించారు. సిసి రోడ్డుకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సర్పంచ్‌ విశ్వనాథ్‌ పటేల్‌ అన్నారు.

Read More »

దివ్యాంగులకు ఫిజియోథెరఫి వైద్యం

  గాంధారి, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆద్వర్యంలో బుధవారం దివ్యాంగులకు పిజియోథెరఫి వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు 8 మందికి డాక్టర్‌ మహేశ్‌ చికిత్స నిర్వహించారు. ఒక్కో విద్యార్తికి అరగంట పాటు వ్యాయామం చేయించారు. ప్రతిరోజు ఇంటివద్ద వ్యాయామం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో రిసోర్సు టీచర్లు పెంటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

పది పరీక్షలకు సర్వం సిద్దం

  బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు బీర్కూర్‌ మండలంలో పరీక్షా కేంద్రాలు సిద్దంగా ఉన్నాయని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. బీర్కూర్‌ మండలంలో బీర్కూర్‌, మిర్జాపూర్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మండల కేంద్రంలో 236 మంది విద్యార్థులు, మిర్జాపూర్‌ సెంటర్‌లో 286 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు ఆయన తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటుచేశామని ఎంఇవో పేర్కొన్నారు. వేసవి కాలం సందర్భంగా ...

Read More »

గ్రామాల్లోనే చిన్నారులకు ఆధార్‌కార్డులు  

మోర్తాడ్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు కల్పిస్తున్న ఆధార్‌ కార్డులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌లు గుర్జాల లింబన్న, తోగేటి అనిత, శ్రీనివాస్‌లు అన్నారు. బుధవారం మండలంలోని పాలెం, షెట్పల్లి గ్రామ పంచాయతీల్లో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడునెలల చిన్నారుల నుంచి ఐదు సంవత్సరాల వరకు చిన్నారులకు ఉచితంగానే ఆధార్‌కార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు. అంగన్‌వాడి టీచర్లు చిన్నారులకు ఆధార్‌కార్డులు అందేలా ...

Read More »

ఉత్తమ ఫలితాలు సాధిస్తే నగదు ప్రోత్సాహకాలు

  మోర్తాడ్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. బుధవారం మోర్తాడ్‌లోని ఉర్దూ మీడియం, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హాల్‌ టికెట్లతో పాటు పరీక్ష అట్లలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పరీక్ష అట్టలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి, మండలానికి మంచి పేరు ...

Read More »

బస్సు, లారీ ఢీ – పదిమందికి గాయాలు

  బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మలుపు చౌరస్తా వద్ద లారీ, బస్సు ఢీకొని నలుగురికి తీవ్రగాయాలు, ఆరుగురికి స్వల్ప గాయాలైనట్టు నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసి బస్సు ఎపి 25 జెడ్‌ 0051 ను బాన్సువాడ నుంచి బోధన్‌ వెళుతున్న లారీ ఏపి 29 వి 6035 అకస్మాత్తుగా మలుపువద్ద ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బాన్సువాడ ...

Read More »

వచ్చే వర్షాకాలానికల్లా మొక్కలు సిద్దం చేయండి

  బీర్కూర్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు వర్షాకాలం కల్లా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో పెంచుతున్న నర్సరీ మొక్కలను సిద్దం చేయాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మిర్జాపూర్‌, దుర్కి, నాచుపల్లి నర్సరీలను ఆయన బుధవారం పరిశీలించారు. మండలంలో 3 లక్షల టేకు మొక్కలు నాటడానికి సిద్దంగా ఉంచాలని, వచ్చే వర్షాకాలం హరితహారం కార్యక్రమానికల్లా మొక్కలు పెంచేలా చర్యలుతీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుత వేసవి కాలం ...

Read More »