Breaking News

Daily Archives: March 16, 2017

ఇష్టపడి పరీక్షలు రాయాలి

  మోర్తాడ్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మోర్తాడ్‌ ఎంఇవో రాజేశ్వర్‌ అన్నారు. గురువారం మండలంలోని పాలెం, రామన్నపేట్‌, ఏర్గట్ల, మోర్తాడ్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అనంతరం పాలెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేసి వారినుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు 11 రోజుల పాటు జరిగే పరీక్షల్లో ప్రతిరోజు రాత్రి 11 గంటల వరకు చదువుకుంటూ ప్రశ్నపత్రాల్లో వచ్చిన వాటిని ...

Read More »

ఘనంగా తెరాస పార్టీ సభ్యత్వ నమోదు

  బీర్కూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నసురుల్లాబాద్‌ గ్రామంలో పోచారం సురేందర్‌ రెడ్డి ఆద్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీలోకి ప్రజలు అధికంగా ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బడుగు, బలహీన వర్గాలకు ఉద్దేశించి చేసిన బడ్జెట్‌ గురించి మండలంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. సభ్యత్వ నమోదు గతం కంటే ఎక్కువ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ...

Read More »

ఉపాధి కూలీలకు 20 శాతం కూలీ పెంపు

  బీర్కూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రస్తుత వేసవి కాలం సందర్భంగా 20 శాతం కూలీ వేతనం పెంచినట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామ పంచాయతీలోగల కొచ్చెర మైశమ్మ ఆలయం వద్ద జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. వేసవి కాలంలో రెగ్యులర్‌గా ఇచ్చే వేతనం కంటే 20 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి ...

Read More »

మండలంలో పాఠశాల దత్తత తీసుకుంటాం

  – పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌ బీర్కూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆయా మండలాల్లో ఓ పాఠశాలను దత్తత తీసుకొని మండలంలో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌ అన్నారు. మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం పిఆర్‌టియు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కాలంలో 16 రోజుల ఇఎల్స్‌కు వేతనాలు మంజూరు చేయించామని, మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి, చైల్డ్‌ కేర్‌ సెలవులు సాధించామన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ...

Read More »

పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు

పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు! నిజామాబాద్ న్యూస్.ఇన్: బండిపోట్ల ముఠాలు అనునిత్యం కొత్త తరహాలో దోచుకునే పన్నగాలు పన్నుతున్నారు. ఇటీవల చిన్న పిల్లల రోదన తో కూడిన శబ్దాలను తలుపుల వద్ద చేసి, ఇంట్లఉన్నవాళ్లను తప్పుదారిపట్టించి తలుపులు తీయగానే చితకబాది దోచుకొని పోతున్నారు. ఇక ఫై జాగ్రత్త ఉండమని పోలీసులు తెలుపుతున్నారు.

Read More »