Breaking News

ఉపాధి కూలీలకు 20 శాతం కూలీ పెంపు

 

బీర్కూర్‌, మార్చి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రస్తుత వేసవి కాలం సందర్భంగా 20 శాతం కూలీ వేతనం పెంచినట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామ పంచాయతీలోగల కొచ్చెర మైశమ్మ ఆలయం వద్ద జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. వేసవి కాలంలో రెగ్యులర్‌గా ఇచ్చే వేతనం కంటే 20 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నీడ, తాగునీరు, వైద్య సౌకర్యం కల్పించాలని సూచించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article