Breaking News

మండలంలో పాఠశాల దత్తత తీసుకుంటాం

 

– పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌

బీర్కూర్‌, మార్చి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆయా మండలాల్లో ఓ పాఠశాలను దత్తత తీసుకొని మండలంలో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్‌ అన్నారు. మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గురువారం పిఆర్‌టియు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కాలంలో 16 రోజుల ఇఎల్స్‌కు వేతనాలు మంజూరు చేయించామని, మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి, చైల్డ్‌ కేర్‌ సెలవులు సాధించామన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమని, సమస్యలుంటే పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుషాల్‌, రవిందర్‌జెట్టి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article