Breaking News

ఘనంగా తెరాస పార్టీ సభ్యత్వ నమోదు

 

బీర్కూర్‌, మార్చి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నసురుల్లాబాద్‌ గ్రామంలో పోచారం సురేందర్‌ రెడ్డి ఆద్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీలోకి ప్రజలు అధికంగా ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బడుగు, బలహీన వర్గాలకు ఉద్దేశించి చేసిన బడ్జెట్‌ గురించి మండలంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. సభ్యత్వ నమోదు గతం కంటే ఎక్కువ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article