Breaking News

Daily Archives: March 17, 2017

పిస్కిల్‌ గుట్టను సందర్శించిన రామ్‌రావ్‌ మహారాజ్‌

  గాంధారి, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల గురువు రామ్‌రావ్‌ మహారాజ్‌ శుక్రవారం గాంధారి మండల పిస్కిల్‌ గుట్టపై గల జగదాంబ మందిరాన్ని సందర్శించారు. గుట్టపై గత నెలరోజుల క్రితం జగదాంబ దేవి ఆలయంతో పాటు సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయాన్ని గిరిజనులు నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ ఆలయాన్ని రామ్‌రావ్‌ మహరాజ్‌ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో యజ్ఞాన్ని ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్నారు. దేశంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని దానికి దైవానుగ్రహం ఎంతో ...

Read More »

మొక్కలను పెంచే బాధ్యత తీసుకోవాలి

  గాంధారి, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటిన మొక్కలను సంరక్షించి పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని గాంధారి ఎండివో సాయాగౌడ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలకు నీరందించారు. ప్రతి శుక్రవారం కార్యాలయం ఆవరణలోని మొక్కలకు నీరందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను పెంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. మండలంలోని ప్రతి కార్యాలయం ఆవరణలో నాటిన మొక్కలకు నీరందించి సంరక్షించాలని సాయాగౌడ్‌ సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది సాయిరెడ్డి, మోతిలాల్‌, తదితరులు ...

Read More »

50 శాతం సబ్సిడీపై పశుగ్రాస యంత్రాలు

  నందిపేట, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే వేసవి దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస కొరతను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్న పశుగ్రాస కోత మిషన్లను మండల రైతులు 50 శాతం సబ్సిడీతో పొందాలని మండల సంవర్దకశాఖాధికారి లక్కంప్రభాకర్‌ తెలిపారు. సుమారు 20 వేల విలువగల యంత్రాలు 50 శాతం సబ్సిడీతో కేవలం 10 వేలకే ప్రబుత్వం అందించనున్నట్టు, యంత్రాలు నందిపేట పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »

ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌

  నందిపేట, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పైప్‌లైన్ల కొరకు కాలువలు తవ్వుతున్న కారణంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ తెగిపోవడంతో నందిపేట బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్చేంజ్‌ పరిధిలోగల ఇంటర్‌నెట్‌ సేవలు గురువారం నుంచి పూర్తిగా స్తంభించాయి. సాంకేతికంగా అభివృద్ది చెంది ప్రతి ఒక్కరు ఇంటర్‌నెట్‌ సేవలు వినియోగించాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికి క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా సేవలు అందిస్తున్నారు. మిషన్‌ భగీరథ కోసం తవ్వకాలు చేపట్టడంతో జన్నేపల్లి, ఆంధ్రానగర్‌లలో ఆప్టికల్‌ కేబుల్‌లు ధ్వంసమైతేమూడురోజుల నుంచి రిపేరు చేసే ...

Read More »

ఈదురుగాలుల బీభత్సం

  నిజాంసాగర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో ఈదురుగాలుల బీభత్సంతో హసన్‌పల్లి గ్రామంలో బేగరి రాజవ్వకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. హసన్‌పల్లి నుంచి హెర్తులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి వెల్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుకు ఇరుపక్కల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ తీగలు తెగిరోడ్డుపై పడడంతో విద్యుత్‌ అంతరాయం సైతం ఏర్పడింది. రాత్రి నుంచి కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. ఈదురుగాలుల వల్ల నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని ...

Read More »

ప్రశాంతంగా పది పరీక్షలు

  నందిపేట, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు శుక్రవారం మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెల్మల్‌, డొంకేశ్వర్‌, నందిపేట, ఆంధ్రానగర్‌, బాద్గుణ, ఖుదావన్‌పూర్‌, ఐలాపూర్‌, నూత్‌పల్లి జడ్పిహెచ్‌ఎస్‌, మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 922 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 757, బాలురు 335, బాలికలు- 422, కాగా ప్రయివేటు పాఠశాలలకు చెందిన ...

Read More »

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

  నిజాంసాగర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని కాస్లాబాద్‌ గ్రామంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో ప్రతి యేడు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని హాజీబాబా తెలిపారు. గ్రామంలోని హాజీబాబా ఇంటివద్ద నుంచి గంధాన్ని ఒంటెపైతీసుకొని భాజా భజంత్రీల చప్పుళ్లతో, నృత్యాలు చేస్తు గ్రామ వీధుల గుండా తిరుగుతూ సైలాని దర్గావద్దకు తెచ్చి అక్కడ సమర్పిస్తారు. అనంతరం ఖవాళీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బోధన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు ఖవాలీ పాడి అందరిని అలరించారు. భారీ సంఖ్యలో ...

Read More »

కంటితుడుపు చర్యలు చేపడితే ఊరుకునే ప్రసక్తే లేదు

  బీర్కూర్‌ రైతుల ఆందోళన బీర్కూర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు కంటి తుడుపు చర్యగా నామమాత్రపు ఆర్థిక మొత్తాలు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీర్కూర్‌ ఎంపిటిసి సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులు బీర్కూర్‌ మండలంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా మండలంలో కరువు బీభత్సం వల్ల రైతులు నష్టాల ఊబిలో ఉన్నారని, గత వర్సాకాలంలో కురిసిన వర్షాలకుగాను ...

Read More »

మంచినీటి ట్యాంకు నిర్మాణానికి సర్వే

నిజాంసాగర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకిపల్లి గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మాణం కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. సుమలత, పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప ఆధ్వర్యంలో స్థల సర్వేచేశారు. ట్యాంకు నిర్మాణం కోసం గ్రామంలోని ఆలయం వద్ద వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. మిషన్‌ భగీరథ నీటి కోసం సర్వే చేసినట్టు తెలిపారు.

Read More »

తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారు

  బీర్కూర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో చేపడుతున్న తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల ప్రజలు పార్టీలో చేరికపై ఆసక్తి కనబరుస్తున్నారని పార్టీ మండల అద్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. తెరాస సంక్షేమ పథకాలపై జనాలు ఆకర్షితులవుతున్నారని, 2017-18 బడ్జెట్‌లో కులాల వారిగా ప్రకటించిన బడ్జెట్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో కంటే అధికంగా సభ్యత్వం నమోదుఅవుతుందని దీమావ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరైతుకు న్యాయం చేస్తాం

  – జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య బీర్కూర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య శుక్రవారం బీర్కూర్‌, కిష్టాపూర్‌, చించొల్లి, అన్నారం తదితర గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వ్యవసాయేతరులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేవిధంగా తగు చర్యలు చేపడతామని జేసి అన్నారు. అంతకుముందు మండలంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లో బాధితులు పంట నష్టపరిహారం చెల్లించాలంటూ రాస్తారోకో చేశారు. పంటనష్టం ...

Read More »

బీర్కూర్‌ పిఆర్‌టియు అధ్యక్షునిగా గుండం నర్సింలు

  బీర్కూర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల పిఆర్‌టియు అధ్యక్షునిగా గుండం నర్సింలు సమీప అభ్యర్థి రవిందర్‌జెట్టిపై 11 ఓట్లతో గెలుపొందారు. శుక్రవారం నిర్వహించిన పిఆర్‌టియు అధ్యక్ష ఎన్నికల్లో నర్సింలు గెలుపొందారని జిల్లా పిఆర్‌టియు అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తెలిపారు. కార్యదర్శిగా హనుమాండ్లు, మహిళా కార్యదర్శిగా నాగమణి, తదితరులు ఎన్నికల్లో గెలుపొందారని ఆయన అన్నారు. పిఆర్‌టియు రాష్ట్రంలోనే ఉపాధ్యాయుల అతిపెద్ద యూనియన్‌ అని, ఉపాధ్యాయ సమస్యలపై ఎల్లవేళలా పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఇవో గోపాల్‌రావు, పిఆర్‌టియు జిల్లా కార్యదర్శి కుషాల్‌, ...

Read More »

యాసంగి పంటల కోసం నీటి విడుదల

  నిజాంసాగర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు హెర్సులూస్‌ ప్రధాన కాలువ గేట్లకు అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్‌ కేంద్రం గేట్ల ద్వారా 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్టు డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలోని లక్ష 15 వేల ఎకరాల్లో యాసంగి రైతులు వేసిన పంటకు సాగునీరు అందించేందుకు ఐదువిడతలుగా నీటి విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు ద్వారా పదిరోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, మార్చి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బంజేపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను సర్పంచ్‌ బేగరి రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే నిదుల కింద రూ. 5 లక్షలు మంజూరయ్యాయన్నారు. గ్రామంలోని బిసి కాలనీలో సిసి రోడ్డు పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సర్పంచ్‌, ఎంపిటిసి కమలాబాయి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు సత్యగౌడ్‌, శివయ్య ఉన్నారు.

Read More »

మండలంలో వడగండ్ల వాన బీభత్సం

  బీర్కూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పెద్ద ఈదురుగాలులు, రాళ్లతో కూడిన వర్షం కురిసే సరికి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం వల్ల పంట నష్టం తీవ్రంగా జరిగి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై అక్కడక్కడ చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు.

Read More »

18న సర్పంచ్‌ల సమావేశం

  నందిపేట, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశానికి మండలంలోని సర్పంచ్‌లందరు సకాలంలో హాజరు కావాలని ఇవో పిఆర్‌డి రాజేశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులపై చర్చించి కలెక్టర్‌ సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుల్‌కు సన్మానం

  నందిపేట, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకన్న ఏఎస్‌ఐ గా పదోన్నతితో రెంజల్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆయన్ను ఎస్‌ఐ జాన్‌రెడ్డి గురువారం సత్కరించారు. 1989లో కానిస్టేబుల్‌గా నియమితులైన వెంకన్న బాల్కొండ, గాంధారి, నిజామాబాద్‌ -1వ టౌన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి, హెడ్‌కానిస్టేబుల్‌గా బీర్కూర్‌లో పనిచేశారు. నందిపేట్‌లో 22 నెలలు పనిచేశారు. పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశానుసారం జిల్లాలో పదోన్నతి పొందిన నలుగురు ఏఎస్‌ఐలలో వెంకన్న ఒకరు. ఈసందర్భంగా సిబ్బంది ...

Read More »

బ్యాంకుల ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించాలి

  మోర్తాడ్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ రుణాలు లబ్దిదారులు పొందినవారు అబివృద్ది చెంది సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్దికి తోడ్పాటునందించాలని ఎంపిడిఓ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలోని పాలెం ఎస్‌బిహెచ్‌ ఆద్వర్యంలో గ్రామానికి చెందిన 10 మంది ఎస్సీ లబ్దిదారులకు, ఆరుగురు బిసిలకు, ఒక మైనార్టీకి ఆయా కార్పొరేషన్ల ద్వారా అందిన రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఎంపిడివో మాట్లాడుతూ రుణాలు అందించిన బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌కు, మేనేజర్‌ ...

Read More »

అధికారులకే పరిమితమైన విజిలెన్స్‌ మీటింగ్‌

  మోర్తాడ్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం మండల ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో నయాబ్‌ తహసీల్దార్‌ జనార్దన్‌ మాట్లాడుతూ రేషన్‌ డీలర్లు రికార్డులను సక్రమంగా రూపొందించాలని తనిఖీకి ఏ ప్రజాప్రతినిధులైన ఏరోజైన రావచ్చని ఆయన సూచించారు. రేషన్‌ డీలర్లు ప్రతినెల 1వ తేదీ నుంచి 16 వరకు సమయ పాలన పాటిస్తూ ప్రతి ఒక్కరికి నిత్యవసర సరుకులు అందించాలని సూచించారు. ముఖ్యంగా డీలర్లు క్లోజింగ్‌ రికార్డులను ఖచ్చితంగా నమోదు చేయాలని, ...

Read More »

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆర్డీఓ

  నందిపేట, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను గురువారం ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ పరిశీలించారు. నందిపేట మండలంలోని కంఠం, కౌల్‌పూర్‌ గ్రామాల్లో నయాబ్‌ తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయాధికారి గంగమల్లుతో కలిసి పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం అందేందుకు వివరాలు అందజేయాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో అకస్మాత్తుగా వడగండ్ల వాన కురియడంతో మామిడి కాయలు నేలరాలాయని, పలు పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆరబెట్టిన ...

Read More »